LIC Smart Pension Plan
LIC Smart Pension Plan : సినీయర్ సిటిజన్లకు గుడ్ న్యూస్.. పదవి విరామణ తర్వాత ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు ఉండవు. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) స్మార్ట్ పెన్షన్ ప్లాన్ అనే కొత్త పెన్షన్ పథకాన్ని ప్రారంభించింది. ఆర్థిక సేవల కార్యదర్శి ఎం. నాగరాజు ఎల్ఐసీ సీఈఓ సిద్ధార్థ మొహంతి ప్రారంభించారు. సింగిల్ ప్రీమియం పథకంగా పిలుస్తారు.
పదవీ విరమణ చేసిన వారికి సౌకర్యవంతమైన యాన్యుటీ ఎంపికలు, సురక్షితమైన ఆదాయ మార్గాలను అందిస్తుంది. ఈ ప్లాన్ వ్యక్తిగత, గ్రూపు సేవింగ్స్ కోసం రూపొందించింది. నమ్మకమైన కస్టమర్లకు అధిక రేట్లు, లిక్విడిటీ ఎంపికలు, వైకల్యం లేదా ఇతరులపై ఆధారపడిన వారికి అధిక ప్రయోజనాలతో కూడిన ఫీచర్లను కలిగి ఉంటుంది.
సింగిల్ లేదా జాయింట్ పెన్షన్ ప్రయోజనాలను పొందవచ్చు. ఇందులో ఇన్‌స్టంట్ పెన్షన్ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది. ఈ పెన్షన్ స్కీమ్ ఎలా ఉంటుంది? ఫీచర్లు ఎలా ఉన్నాయి.. ఎవరు ఎలా కొనుగోలు చేయొచ్చు? అనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
స్మార్ట్ పెన్షన్ పథకం ముఖ్య ఫీచర్లు :
ఆర్థిక భద్రత : ఈ పథకం పదవీ విరమణ తర్వాత మీకు ఆర్థిక భద్రతను అందిస్తుంది.
వన్-టైమ్ ప్రీమియం : మీరు ఈ పథకంలో పెట్టుబడి పెట్టిన తర్వాత మీకు పెన్షన్ అందుతూనే ఉంటుంది. పెన్షన్ పొందడానికి మొత్తం ప్రీమియం ఒకేసారి చెల్లించాలి.
వివిధ పెన్షన్ ఆప్షన్లు (యాన్యుటీ ఆప్షన్లు ) : ఇందులో అనేక రకాల పెన్షన్ ప్లాన్‌లు అందుబాటులో ఉన్నాయి. సింగిల్ లైఫ్, జాయింట్ లైఫ్ యాన్యుటీ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. మీ అవసరాలకు అనుగుణంగా ఎంచుకోవచ్చు.
లిక్విడిటీ ఆప్షన్లు : సగం లేదా పూర్తి విత్‌డ్రా సౌకర్యాన్ని పొందవచ్చు.
కనీస పెట్టుబడి : ఈ పథకం కింద కనీస పెట్టుబడి రూ. 1 లక్ష ఉంటుంది.
రుణ సౌకర్యం : పాలసీ ప్రారంభమైన 3 నెలల తర్వాత రుణ సౌకర్యం అందుతుంది.
ఎల్ఐసీ స్మార్ట్ పెన్షన్ ప్లాన్ వివరాలు :
కనీస కొనుగోలు ధర : రూ.1,00,000/
గరిష్ట కొనుగోలు ధర : పరిమితి లేదు ( గరిష్ట కొనుగోలు ధర బోర్డు ఆమోదించిన అండర్ రైటింగ్ పాలసీ ప్రకారం లోబడి ఉంటుంది)
కనీస యాన్యుటీ : కనీస యాన్యుటీ మొత్తాలు ఈ కింది విధంగా ఉన్నాయి.
ఎంచుకున్న యాన్యుటీ చెల్లింపు విధానాన్ని బట్టి నెలకు రూ. 1,000, త్రైమాసికానికి రూ. 3,000, అర్ధ సంవత్సరానికి రూ. 6,000, సంవత్సరానికి రూ. 12,000
గరిష్ట యాన్యుటీ : పరిమితి లేదు
ప్రీమియం చెల్లింపు విధానం : సింగిల్ ప్రీమియం
ఈ పాలసీని ఎవరు కొనుగోలు చేయవచ్చు? :
18 ఏళ్ల నుంచి 100 సంవత్సరాల మధ్య వయస్సు గల వారు ఈ పథకంలో పెట్టుబడి పెట్టవచ్చు.
Retirement isn’t the end of earning—it’s the beginning of financial freedom! With LIC of India’s Smart Pension, enjoy a lifetime of steady income and stress-free golden years.https://t.co/YU86iMOu9M#LIC #SmartPension #PensionPlan pic.twitter.com/4bXUXbz90g
— LIC India Forever (@LICIndiaForever) February 19, 2025
పెన్షన్ పేమెంట్ ఆప్షన్లు :
ఈ పథకంలో, పాలసీదారుడు నెలవారీ, త్రైమాసిక, అర్ధ వార్షిక, వార్షిక ప్రాతిపదికన పెన్షన్ పొందే అవకాశాన్ని పొందుతారు.
ఎల్ఐసీ పాలసీదారులకు ప్రత్యేక సౌకర్యం :
మీరు ఇప్పటికే ఎల్ఐసీ పాలసీదారు అయితే లేదా మరణించిన పాలసీదారుడి నామినీగా ఉంటే.. మెరుగైన యాన్యుటీ రేటు బెనిఫిట్స్ పొందుతారు.
ఈ ప్లాన్ ఎక్కడ కొనాలి? :
ఈ పథకాన్ని LIC అధికారిక వెబ్‌సైట్ నుంచి ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయవచ్చు లేదా ఎల్ఐసీ ఏజెంట్లు, POSP-లైఫ్ ఇన్సూరెన్స్, కామన్ పబ్లిక్ సర్వీస్ సెంటర్ల ద్వారా ఆఫ్‌లైన్‌లో కూడా కొనుగోలు చేయవచ్చు.