Credit Card Rule
Credit Card Rule : క్రెడిట్ కార్డు వాడుతున్నారా? అయితే, ఇది మీకోసమే.. జూలైలో క్రెడిట్ కార్డు కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి. ప్రధానంగా SBI , HDFC బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్‌తో సహా అనేక బ్యాంకులు తమ క్రెడిట్ కార్డ్ నిబంధనలను సవరించాయి. ఈ కొత్త మార్పులు జూలై 2025 నుంచి అమల్లోకి వస్తాయి.
ఇందులో కొన్ని SBI కార్డులపై ఫ్రీ విమాన ప్రమాద బీమాను నిలిపివేయనుంది. HDFC బ్యాంక్ కొత్త లావాదేవీ రుసుములు, రివార్డ్ పాయింట్ పరిమితులను తీసుకొచ్చింది. మింత్రా కోటక్ క్రెడిట్ కార్డ్‌ను క్రమంగా కోటక్ లీగ్ క్రెడిట్ కార్డ్‌తో రిప్లేస్ చేస్తుంది. ఈ క్రెడిట్ కార్డ్‌ల కొత్త నిబంధనలకు సంబంధించి పూర్తి వివరాలను కార్డ్ హోల్డర్లు తప్పనిసరిగా తెలుసుకోవాలి.
SBI కార్డు :
ఎస్బీఐ కార్డ్.. తమ క్రెడిట్ కార్డ్ హోల్డర్ల కోసం జూలై 15, 2025 నుంచి కొత్త నిబంధనలు అమలులోకి రానున్నట్టు ప్రకటించింది. ఈ మార్పులు మినిమం డ్యూ పేమెంట్ క్యాలిక్యూలేషన్, పేమెంట్ సెటిల్మెంట్ ఆర్డర్, ఎంపిక చేసిన SBI క్రెడిట్ కార్డ్‌లపై విమాన ప్రమాదాలకు కాంప్లిమెంటరీ బీమాను నిలిపివేయడం వరకు ఉంటాయి.
ఉచిత విమాన ప్రమాద బీమా :
ఎస్బీఐ కార్డ్ జూలై 15, 2025 నుంచి ఎంపిక చేసిన ప్రీమియం SBI క్రెడిట్ కార్డులపై ప్రస్తుతం అందిస్తున్న రూ. 1 కోటి విలువైన కాంప్లిమెంటరీ ఎయిర్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కవరేజీని నిలిపివేస్తుంది. ఈ మార్పు కొన్ని రకాల కార్డులకు వర్తిస్తుంది. SBI కార్డ్ ఎలైట్, SBI కార్డ్ మైల్స్ ఎలైట్, SBI కార్డ్ మైల్స్ ప్రైమ్ ఉన్నాయి.
Read Also : Nothing Phone 3 : నథింగ్ ఫోన్ 3 వస్తోందోచ్.. జూలై 1నే లాంచ్.. కెమెరా ఫీచర్లు ఇవే.. ధర ఎంత ఉండొచ్చంటే?
ఈ టైప్ SBI క్రెడిట్ కార్డులను ఉపయోగించే కస్టమర్‌లు ప్రయోజనాలను కోల్పోతారు. SBI కార్డ్ ప్రైమ్, SBI కార్డ్ పల్స్‌పై రూ. 50 లక్షల ఉచిత విమాన ప్రమాద బీమా కవరేజ్ కూడా జూలై 15, 2025 నుంచి నిలిపివేయనుంది. SBI వెబ్‌సైట్‌లో సమాచారం ప్రకారం.. ఈ వేరియంట్ కార్డ్ హోల్డర్లు పేర్కొన్న తేదీ నుంచి ఈ బీమా ప్రయోజనాన్ని పొందలేరు.
HDFC బ్యాంక్ :
జూలై 1, 2025 నుంచి HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఛార్జీలను సవరిస్తోంది. కొన్ని మార్పులలో ఒక శాతం రుసుము నెలకు రూ. 4,999గా పరిమితం చేసింది. ఆన్‌లైన్ స్కిల్స్ ఆధారిత గేమింగ్, వాలెట్ లోడింగ్ (ఉదాహరణకు.. PayTM, Mobikwik), యూజర్ల క్రెడిట్ కార్డులపై నెలకు రూ. 50వేలకు మించి యుటిలిటీ బిల్లు పేమెంట్లకు (బిజినెస్ కార్డ్‌లకు రూ. 75వేలు) వర్తిస్తుంది.
గేమింగ్ ఖర్చులపై ఎలాంటి రివార్డ్ పాయింట్లు ఉండవు. బీమా ఖర్చులు ఛార్జీల నుంచి మినహాయింపు ఉంటుంది. కానీ, నెలవారీ రివార్డ్ పాయింట్ క్యాప్‌లను పొందవచ్చు. ఇన్ఫినియాకు 10,000, డైనర్స్ బ్లాక్‌కు 5,000, ఇతర కార్డులకు 2,000 రివార్డు పాయింట్లు పొందవచ్చు. మారియట్ బోన్‌వాయ్ కార్డులకు మాత్రం ఈ పరిమితి వర్తించదని గమనించాలి.
కోటక్ క్రెడిట్ కార్డు :
కోటక్ మహీంద్రా బ్యాంక్ జూలై 10, 2025 నుంచి మింత్రా కోటక్ (Myntra Kotak) క్రెడిట్ కార్డ్‌ను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే ఉన్న అన్ని మింత్రా కోటక్ క్రెడిట్ కార్డ్ యూజర్లు కోటక్ లీగ్ క్రెడిట్ కార్డ్‌కు మారిపోవచ్చు. కొత్త కార్డ్ ఫీచర్లు, బెనిఫిట్స్ తెలుసుకోవాలి. మైగ్రేషన్ తర్వాత వర్తించే నిబంధనలు, రివార్డ్‌లలో మార్పులను గమనించాలి.