Nothing Phone 3 : నథింగ్ ఫోన్ 3 వస్తోందోచ్.. జూలై 1నే లాంచ్.. కెమెరా ఫీచర్లు ఇవే.. ధర ఎంత ఉండొచ్చంటే?

Nothing Phone 3 : వచ్చే జూలై 1న నథింగ్ ఫోన్ 3 వచ్చేస్తోంది.. లాంచ్‌కు ముందే కీలక ఫీచర్లు, ధర వివరాలు రివీల్ అయ్యాయి..

Nothing Phone 3 : నథింగ్ ఫోన్ 3 వస్తోందోచ్.. జూలై 1నే లాంచ్.. కెమెరా ఫీచర్లు ఇవే.. ధర ఎంత ఉండొచ్చంటే?

Nothing Phone 3

Updated On : June 27, 2025 / 5:32 PM IST

Nothing Phone 3 : కొత్త స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా..? నథింగ్ బ్రాండ్ నుంచి సరికొత్త మోడల్ రాబోతుంది. రాబోయే ఫ్లాగ్‌షిప్ ఫోన్ నథింగ్ ఫోన్ 3 కెమెరా ఫీచర్లు (Nothing Phone 3) రివీల్ అయ్యాయి. నథింగ్ ఫోన్
2 మోడల్ కన్నా భారీ అప్‌గ్రేడ్‌లతో అందిస్తుందని భావిస్తున్నారు.

కంపెనీ ఇప్పటికే చిప్‌సెట్, కొత్త గ్లిఫ్ మ్యాట్రిక్స్ డిజైన్, ఫీచర్లతో సహా కొన్ని కీలక వివరాలను వెల్లడించింది. ఇప్పుడు, బ్రాండ్ ఫోన్ కెమెరా వివరాలను నిర్ధారించింది. ఈ నథింగ్ ఫోన్ పూర్తి ఫీచర్ల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. నథింగ్ ఫోన్ 3 లాంచ్ తేదీ, స్పెసిఫికేషన్లు, డిజైన్, ధరకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

భారత్‌లో నథింగ్ ఫోన్ 3 లాంచ్ తేదీ :
జూలై 1న భారత్, ప్రపంచ మార్కెట్లలో నథింగ్ ఫోన్ 3 లాంచ్ అవుతుంది. ఈ ఫోన్ మైక్రోపేజీ ఫ్లిప్‌కార్ట్‌లో లైవ్ అయింది. నథింగ్ ఇ-స్టోర్, ఎంపిక చేసిన రిటైల్ ఛానెల్‌లు, ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. కంపెనీ నథింగ్ హెడ్‌ఫోన్ 1 కూడా లాంచ్ చేయనుంది.

Read Also : Jio Airtel Plans : పండగ చేస్కోండి.. జియో, ఎయిర్‌టెల్ సరసమైన ప్లాన్లు.. 30 రోజుల వ్యాలిడిటీ.. ఇందులో ఏది బెటర్?

నథింగ్ ఫోన్ 3 కెమెరాలు (అంచనా) :
కెమెరాల విషయానికి వస్తే.. నథింగ్ ఫోన్ 3 బ్యాక్ సైడ్ 50MP పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా ఉంటుందని కంపెనీ ధృవీకరించింది. నివేదికల ప్రకారం.. ఈ నథింగ్ ఫోన్ 3x ఆప్టికల్ జూమ్‌ను అందించవచ్చు. అదనంగా, ఈ నథింగ్ ఫోన్ 50MP ప్రైమరీ, 50MP అల్ట్రావైడ్ సెన్సార్‌లను కూడా కలిగి ఉంటుందని అంచనా.

నథింగ్ ఫోన్ 3 (Nothing Phone 3) స్పెసిఫికేషన్లు (అంచనా)  :
నథింగ్ ఫోన్ 3 మోడల్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7-అంగుళాల LTPO OLED ప్యానెల్‌తో వస్తుందని భావిస్తున్నారు. ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 4 చిప్‌సెట్‌తో వస్తుంది. లీక్‌ల ప్రకారం.. ఈ ఫోన్ 5,150mAh బ్యాటరీని కలిగి ఉండవచ్చు. 100W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇవ్వవచ్చు. ఆండ్రాయిడ్ ఆధారిత నథింగ్ OSతో రావచ్చ. ఐదు ఏళ్ల AndroidOS అప్‌డేట్స్ పొందవచ్చు. ఈ నథింగ్ ఫోన్ నథింగ్స్ ఎసెన్షియల్ స్పేస్‌ను కూడా పొందవచ్చు.

నథింగ్ ఫోన్ 3 ధర :
భారత మార్కెట్లో నథింగ్ ఫోన్ 3 ధర దాదాపు రూ.60వేలు ఉంటుందని అంచనా. వేరియంట్ వారీగా ధర తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే..