Jio Airtel Plans : పండగ చేస్కోండి.. జియో, ఎయిర్‌టెల్ సరసమైన ప్లాన్లు.. 30 రోజుల వ్యాలిడిటీ.. ఇందులో ఏది బెటర్?
Jio Airtel Plans : జియో, ఎయిర్‌టెల్ 30 రోజుల వ్యాలిడిటీతో సరసమైన రీఛార్జ్ ప్లాన్లను ఆఫర్ చేస్తున్నాయి.. ఏ రీఛార్జ్ ప్లాన్ బెటర్ ..

Jio Airtel Plans
Jio Airtel Plans : రిలయన్స్ జియో, ఎయిర్ టెల్ కస్టమర్లకు గుడ్ న్యూస్.. భారత మార్కెట్లో రెండు అతిపెద్ద టెలికాం కంపెనీలైన రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్ (Jio Airtel Plans) అద్భుతమైన రీఛార్జ్ ప్లాన్లను అందిస్తున్నాయి. తమ వినియోగదారులను ఆకట్టుకునేందుకు నెలవారీ ప్లాన్లను ఆఫర్ చేస్తున్నాయి. సరసమైన రీఛార్జ్ ప్లాన్‌లతో జియో, ఎయిర్‌టెల్ 30 రోజుల వ్యాలిడిటీ అందిస్తున్నాయి.
జియో 30 రోజుల వ్యాలిడిటీతో రూ. 335 రీఛార్జ్, అదే వ్యాలిడిటీతో ఎయిర్‌టెల్ రూ. 379 రీఛార్జ్ ప్లాన్ అందిస్తోంది. ఈ రెండు రీఛార్జ్ ప్లాన్‌ల ధరల మధ్య రూ. 44 తేడా ఉంటుంది. ఈ రీఛార్జ్ ప్లాన్లలో ఏ కంపెనీ 30 రోజుల వ్యాలిడిటీతో బెటర్ బెనిఫిట్స్ అందిస్తున్నాయో ఓసారి వివరంగా తెలుసుకుందాం..
జియో రూ.335 ప్లాన్ :
జియో రూ.335 ప్లాన్ 30 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఈ ప్లాన్‌లో యూజర్లు అన్‌లిమిటెడ్ ఫ్రీ కాలింగ్ బెనిఫిట్స్ పొందవచ్చు. రోజుకు 100 ఫ్రీ SMSలతో పాటు మొత్తం 25GB డేటాను పొందవచ్చు. జియో రూ.335 ప్లాన్‌లో యూజర్లు జియో హాట్ స్టార్, జియో క్లౌడ్‌లకు ఫ్రీ యాక్సెస్ కూడా పొందవచ్చు.
ఎయిర్‌టెల్ రూ.379 ప్లాన్ :
ఎయిర్‌టెల్ రూ.379 ప్లాన్ 30 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఈ ప్లాన్‌లో వినియోగదారులు అన్‌లిమిటెడ్ ఫ్రీ కాలింగ్ బెనిఫిట్స్ పొందవచ్చు. ప్రతిరోజూ 2GB డేటాతో పాటు రోజుకు 100 ఫ్రీ SMS బెనిఫిట్స్ పొందవచ్చు. ఈ ఎయిర్‌టెల్ ప్లాన్‌లో వినియోగదారులు ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ యాప్‌కు కూడా యాక్సెస్ పొందవచ్చు.