Maruti Suzuki Dzire : మారుతీ సుజుకి డిజైర్ 2024 వచ్చేస్తోంది.. నవంబర్ 11నే లాంచ్.. ధర ఎంత ఉండొచ్చుంటే?

Maruti Suzuki Dzire : మారుతి సుజుకి ఇండియా నుంచి సరికొత్త మోడల్ కారు వచ్చేస్తోంది. వచ్చే నెల (నవంబర్) 11న మారుతి సుజుకి డిజైర్ 2024ని కంపెనీ లాంచ్ చేయనుంది.

Maruti Suzuki Dzire : మారుతీ సుజుకి డిజైర్ 2024 వచ్చేస్తోంది.. నవంబర్ 11నే లాంచ్.. ధర ఎంత ఉండొచ్చుంటే?

Maruti Suzuki Dzire 2024 launch in India

Updated On : October 26, 2024 / 11:02 PM IST

Maruti Suzuki Dzire : కొత్త కారు కొనేందుకు చూస్తున్నారా? భారత మార్కెట్లో అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా నుంచి సరికొత్త మోడల్ కారు వచ్చేస్తోంది. వచ్చే నెల (నవంబర్) 11న మారుతి సుజుకి డిజైర్ 2024ని కంపెనీ లాంచ్ చేయనుంది. మారుతి సుజుకి స్విఫ్ట్ 2024 తర్వాత కంపెనీ ఈ ఏడాదిలో రెండో కారును లాంచ్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది. మారుతి డిజైర్ దేశ మార్కెట్లో అత్యధికంగా అమ్ముడవుతున్న సెడాన్. ఈ ఆర్థిక సంవత్సరంలో దేశీయ మార్కెట్‌లో 164,517 యూనిట్ల వాల్యూమ్‌లను పొందింది.

ప్రధాన పోటీదారుల్లో హోండా అమేజ్, హ్యుందాయ్ ఆరా, టాటా టిగోర్ ఉన్నాయి. కొత్త అవతార్‌లో మారుతి డిజైర్ చాలా ఎక్స్‌టీరియర్, ఇంటర్నల్ అప్‌డేట్స్ కలిగి ఉంటుంది. ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌లతో కూడిన కొత్త గ్రిల్ ఉంటుంది. బ్యాక్ సైడ్ కొత్త ఎల్ఈడీ టెయిల్‌ల్యాంప్‌లు ఉంటాయి. కాంపాక్ట్ సెడాన్ లేటెస్ట్ అల్లాయ్ వీల్స్‌పై డ్రైవ్ చేస్తుంది. వాహనం ఎలక్ట్రిక్ సన్‌రూఫ్‌ను పొందుతుందని అనేక మీడియా నివేదికలు పేర్కొన్నాయి.

క్యాబిన్ లోపల కొత్త టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వైర్‌లెస్ ఛార్జర్ వంటి ఫీచర్లను పొందవచ్చు. ఈ కొత్త కారులో 360-డిగ్రీ కెమెరా సెటప్ ఉంటుందని భావిస్తున్నాం. అవుట్‌గోయింగ్ డిజైర్ ప్రసిద్ధ 1.2-లీటర్ కె-సిరీస్ డ్యూయల్-జెట్ డ్యూయల్-వీవీటీ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగిస్తుంది. గరిష్టంగా 89.7పీఎస్ పవర్ 113ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లలో 5-స్పీడ్ ఎంటీ, 5-స్పీడ్ ఎఎంటీ ఉన్నాయి.

5-స్పీడ్ ఎంటీతో సీఎన్‌జీ ఆప్షన్ (77.4పీఎస్, 98.5ఎన్ఎమ్) కూడా ఉంది. మారుతి సుజుకి డిజైర్ 2024 పాత డిజైర్ కె-సిరీస్ యూనిట్‌తో కొనసాగుతుంది. మారుతి స్విఫ్ట్ 2024 కొత్త జెడ్-సిరీస్ 1.2-లీటర్ 3-సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌ కలిగి ఉంది. గరిష్టంగా 82పీఎస్ శక్తిని 113Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లలో 5-స్పీడ్ ఎంటీ 5-స్పీడ్ ఎఎంటీ ఉన్నాయి. పాత డిజైర్ ధర రూ. 6.56 లక్షల నుంచి రూ. 9.39 లక్షలు (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది. కొత్త డిజైర్ ధర కొంచెం ఎక్కువగా ఉంటుందని అంచనా.

Read Also : Aadhaar Card Transactions : ఆధార్ కార్డ్ ద్వారా బ్యాంకు అకౌంట్లలోకి డబ్బులు ఎలా పంపాలో తెలుసా? ఇదిగో సింపుల్ ప్రాసెస్..!