Maruti Suzuki e Vitara : కారు అంటే ఇలా ఉండాలి.. మారుతి ఫస్ట్ ఎలక్ట్రిక్ ఇ-విటారా SUV వచ్చేసిందోచ్.. 7 ఎయిర్ బ్యాగులు, సింగిల్ రీఛార్జ్‌తో 543 కి.మీ రేంజ్..!

Maruti Suzuki e Vitara : భారత మార్కెట్లో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఎలక్ట్రిక్ SUV విభాగంలోకి మారుతి సుజుకి ఇ విటారాతో అధికారికంగా ప్రవేశించింది. త్వరలో బుకింగ్‌లు ప్రారంభం కానున్నాయి.

Maruti Suzuki e Vitara : కారు అంటే ఇలా ఉండాలి.. మారుతి ఫస్ట్ ఎలక్ట్రిక్ ఇ-విటారా SUV వచ్చేసిందోచ్.. 7 ఎయిర్ బ్యాగులు, సింగిల్ రీఛార్జ్‌తో 543 కి.మీ రేంజ్..!

Maruti Suzuki e Vitara

Updated On : December 2, 2025 / 8:17 PM IST

Maruti Suzuki e Vitara : మారుతి కారు లవర్స్‌కు గుడ్ న్యూస్.. భారత మార్కెట్లోకి మారుతి సుజుకి ఫస్ట్ ఎలక్ట్రిక్ కారు ఇ-విటారా వచ్చేసింది. దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి హర్యానాలోని గురుగ్రామ్‌లో జరిగే ఈవెంట్లో ఇ-విటారా ఎలక్ట్రిక్ కారును అధికారికంగా లాంచ్ చేసింది. ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్లో ఇదే ఈవీ కారు మోడల్ లాంచ్ చేయగా ఈ ఫుల్-ఎలక్ట్రిక్ SUV భారతీయ ఆటోమోటివ్ రంగంలో మారుతి సుజుకి ఫస్ట్ ఎలక్ట్రిక్ కారుగా గుర్తింపు పొందుతుంది.

అంతేకాదు.. లాంచ్‌కు ముందుగానే (Maruti Suzuki e Vitara) మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్‌కు 5-స్టార్ భారత్ NCAP సేఫ్టీ రేటింగ్ లభించింది. కంపెనీ స్వయంగా ఇ-విటారా కోసం ఇండియా NCAP రివ్యూ కోసం దరఖాస్తు చేసుకుంది. కంపెనీ 5-స్టార్ భారత్ NCAP రేటింగ్ పొందిన వాహనాల పోర్ట్‌ఫోలియోలో చేరింది. ఇందులో సరికొత్త డిజైర్, విక్టోరిస్, ఇన్విక్టో కూడా ఉన్నాయి.

ఈ ఎస్‌యూవీ FWD, AWD ఆప్షన్లు, 500 కి.మీ వరకు క్లెయిమ్ రేంజ్ LFP బ్యాటరీ ప్యాక్‌లు, ఫీచర్-ప్యాక్డ్ ఇంటీరియర్‌ను ప్రదర్శించింది. హ్యుందాయ్ క్రెటా ఈవీ, విండ్సర్ ఈవీ ప్రో, టాటా కర్వ్ ఈవీ, మహీంద్రా BE 6 లతో పోటీ పడటానికి ఇ-విటారీ రెడీగా ఉంది. మారుతి సుజుకి తొలి ఎలక్ట్రిక్ కారు ఇ-విటారా వేరియంట్లు, ఫీచర్లు, స్పెసిఫికేషన్లు, కలర్ ఆప్షన్లను ఓసారి పరిశీలిద్దాం..

మారుతి సుజుకి ఇ-విటారా ఫీచర్లు :

ఈ SUV లోపలి భాగంలో వైర్‌లెస్ ఛార్జర్, సీట్ వెంటిలేషన్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, యాంబియంట్ లైటింగ్, ఫిక్స్‌డ్ గ్లాస్ సన్‌రూఫ్, ఎలక్ట్రానిక్ గేర్ షిఫ్టర్‌తో కూడిన ఫ్లోటింగ్ కన్సోల్, ఇన్ఫినిటీ సౌండ్ వంటి అనేక ఆకట్టుకునే ఫీచర్లు ఉంటాయి. లోపలి భాగంలో డ్యూయల్-టోన్ ఫినిషింగ్‌తో కూడిన హై క్వాలిటీ ఆప్షన్లు ఉన్నాయి. ఇందులో టూ-స్పోక్ మల్టీఫంక్షన్ స్టీరింగ్ వీల్, క్రోమ్ బెజెల్స్‌తో కూడిన 4 వైడ్ ఏసీ వెంట్‌లు ఉన్నాయి.

ఇంటీరియర్ అంతటా గ్లోస్ బ్లాక్ టచ్‌ల వాడకం ఇ విటారా క్యాబిన్‌ను మరింత ప్రీమియంగా చేస్తుంది. మారుతి సుజుకి ఇ-విటారా అనేక డ్రైవ్ మోడ్‌లతో వస్తుంది. ఇందులో ఎకో, నార్మల్, స్పోర్ట్ ఉన్నాయి. ఎకో మోడ్ హై రేంజ్‌ను అందిస్తుంది. అయితే, స్పోర్ట్ మోడ్ బెస్ట్ పర్ఫార్మెన్స్ అందిస్తుంది. నార్మల్ మోడ్ రెండింటి మధ్య బ్యాలెన్స్ చూపుతుంది. అదనంగా, జారిపడే ఉపరితలాలపై కూడా గట్టి పట్టు కోసం రీజెన్ మోడ్, స్నో మోడ్ ఆప్షన్లు ఉన్నాయి. అన్ని రకాల భూభాగాల్లో కూడా ఈవీ కారు వేగంగా వెళ్లేలా రూపొందింది.

Read Also : Hyundai Car Discounts : కొంటే ఇలాంటి కార్లు కొనాలి.. ఈ హ్యుందాయ్ కార్లపై మైండ్ బ్లోయింగ్ డిస్కౌంట్లు.. ఏకంగా రూ. లక్ష వరకు తగ్గింపు..!

మారుతి సుజుకి E విటారా బ్యాటరీ :
మారుతి సుజుకి E విటారా ఎలక్ట్రిక్ కారు మొత్తం 120 లిథియం-అయాన్ సెల్స్‌తో హై కెపాసిటీ బ్యాటరీ ద్వారా పవర్ పొందుతుంది. ఈ పర్సనల్ సెల్స్ మన్నిక, సేఫ్టీ కోసం టెస్టింగ్ చేసినట్టు మారుతి సుజుకి పేర్కొంది. ఈ సెల్స్ 30°C నుంచి 60°C ఉష్ణోగ్రత పరిధిలో రేట్ పొందింది. 49kWh, 61kWh రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. సింగిల్ ఛార్జ్‌లో 500Km కన్నా ఎక్కువ రేంజ్ అందిస్తుంది.

ఇ-విటారా కలర్ ఆప్షన్లు :

మారుతి సుజుకి ఇ-విటారా 10 ఎక్స్‌ట్రనల్ కలర్ ఆప్షన్లు ఉన్నాయి. ఇందులో 6 మోనో-టోన్, 4 డ్యూయల్-టోన్ కలర్లు ఉన్నాయి. 6 సింగిల్-టోన్ కలర్ ఆప్షన్లలో నెక్సా బ్లూ, స్ప్లెండిడ్ సిల్వర్, ఆర్కిటిక్ వైట్, గ్రాండియర్ గ్రే, బ్లూయిష్ బ్లాక్, ఒపులెంట్ రెడ్ ఉన్నాయి. డ్యూయల్-టోన్ కలర్ ఆప్షన్లలో బ్లాక్ రూఫ్, ఎ-పిల్లర్, బి-పిల్లర్ ఉన్నాయి. కాంట్రాస్టింగ్ కలర్ ఆప్షన్లలో ఆర్కిటిక్ వైట్, ల్యాండ్ బ్రీజ్ గ్రీన్, స్ప్లెండిడ్ సిల్వర్, ఒపులెంట్ రెడ్ ఆప్షన్లు ఉన్నాయి.

మారుతి సుజుకి ఇ-విటారా సేఫ్టీ :
మారుతి ఇ-విటారా లెవల్ 2 ADAS సూట్‌తో వస్తుంది. ఇందులో లేన్ కీప్ అసిస్ట్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, 7 ఎయిర్‌బ్యాగ్‌లు, బ్లైండ్ స్పాట్ మానిటర్, టైర్ ప్రెజర్ మానిటర్, 360-డిగ్రీ కెమెరా, ఫ్రంట్, బ్యాక్ పార్కింగ్ సెన్సార్లు, బ్యాక్ డిస్క్ బ్రేక్‌లు, ఆటో-హోల్డ్ ఫంక్షన్‌తో కూడిన ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, పాదచారుల కోసం ఎగ్జాస్ట్ వెహికల్ అలారం సిస్టమ్ (AVAS) వంటి ఫీచర్లు ఉన్నాయి.

జనవరి 2026 నుంచి ఇ-విటారా సేల్స్ :
జపాన్‌లో ఈ-విటారా లాంచ్‌తో సమానంగా జనవరి 2026 నుంచి సేల్స్ ప్రారంభమవుతాయని మారుతి సుజుకి ధృవీకరించింది. నిర్దిష్ట తేదీని ప్రకటించలేదు. కానీ, బుకింగ్‌లు త్వరలోనే ప్రారంభమవుతాయి. ఈ ఎలక్ట్రిక్ SUV బ్యాటరీ-యాజ్-ఎ-సర్వీస్ (BaaS) సబ్‌స్క్రిప్షన్‌తో అందుబాటులో ఉంటుంది. కస్టమర్లకు గ్యారెంటీతో కూడిన బైబ్యాక్ ప్రోగ్రామ్‌తో వస్తుంది.