Maruti Fronx Baleno Bookings : మారుతి సుజుకి ఫ్రాంక్స్, బాలెనో కలిపి కుమ్మేశాయి.. రోజువారీ బుకింగ్స్ ఎంతో తెలుసా?

Maruti Fronx Baleno Bookings : మారుతి సుజుకి ఫ్రాంక్స్, మారుతి సుజుకి బాలెనో రోజువారీ బుకింగ్‌లు ఇప్పుడు 1,250కి చేరుకున్నాయని కంపెనీ సీనియర్ అధికారి తెలిపారు.

Maruti Fronx Baleno Bookings : ప్రముఖ ఆటోమొబైల్ తయారీ కంపెనీ మారుతి సుజుకి (Martuti Suzuki) నుంచి Fronx మోడల్ కారు గత ఏప్రిల్ చివరిలో భారత మార్కెట్లో లాంచ్ అయింది. ఇప్పుడు ఈ ఫ్రాంక్స్ కారు దాదాపు 550 రోజువారీ బుకింగ్‌లను పొందుతోంది. మరోవైపు, బాలెనో మోడల్ (Baleno) రోజుకు బుకింగ్‌లు 700కి తగ్గాయి. ఫ్రాంక్స్ లాంచ్‌కు ముందు బాలెనో దాదాపు 830గా బుకింగ్స్ ఉన్నాయి. ఫ్రాంక్స్ ఎంట్రీతో బాలెనోపై కొద్దిగా ప్రభావం పడిందనే చెప్పాలి.

ఫ్రాంక్స్ కన్నా తగ్గిన బాలెనో బుకింగ్స్ :
ఫ్రాంక్స్ రాకముందు బాలెనో దాదాపు 830 బుకింగ్‌లను పొందింది. ఫ్రాంక్స్ వచ్చిన తర్వాత, బాలెనో రోజువారీ బుకింగ్‌లు 700కి పడిపోయాయి. అయితే, ఇప్పుడు ఫ్రాంక్స్ మోడల్ బుకింగ్స్ 550కి చేరుకున్నాయని మారుతీ సుజుకి ఇండియా (Maruti Suzuki India) మార్కెటింగ్, సేల్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శశాంక్ శ్రీవాస్తవ పేర్కొన్నారు. ఇప్పుడు రెండింటి కార్ల కంబైన్డ్ స్కోర్‌ను పరిశీలిస్తే.. దాదాపు 1,250గా బుకింగ్స్ నమోదయ్యాయి. కంబైన్డ్ స్కోర్ చాలా బాగుందని, కానీ బాలెనో కొద్దిగా తగ్గిందని అన్నారాయన.

Read Also : Maruti Suzuki Fronx CNG : అద్భుతమైన ఫీచర్లతో మారుతి సుజుకి ఫ్రాంక్స్ CNG వెర్షన్.. కొత్త కారు ధర ఎంతంటే?

ఇతర కార్లకు పోటీగా ఫ్రాంక్స్ మోడల్ :
మారుతి ఇప్పటి వరకు 52,022 ఫ్రాంక్స్ యూనిట్లను విక్రయించింది. జిమ్నీ, బ్రెజ్జా, గ్రాండ్ విటారాతో పాటు కాంపాక్ట్ SUV, FY24లో మహీంద్రాను అధిగమించి SUV చార్ట్‌లో మారుతీని అగ్రస్థానాన్ని చేరడంలో కీలక పాత్ర పోషించింది. దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ సంస్థ నెక్సా ఛానెల్ నుంచి విక్రయించింది. మారుతి సుజుకి ఫ్రాంక్స్ టాటా నెక్సాన్, హ్యుందాయ్ వెన్యూ, కియా సోనెట్ వంటి వాటికి పోటీదారుగా ఉంది. మారుతి (Fronx) రెండు ఇంజన్ ఆప్షన్లను కలిగి ఉంది. 1.2-లీటర్ డ్యూయల్-జెట్ డ్యూయల్-VVT పెట్రోల్ ఇంజన్ ఉంది.

Maruti Fronx Baleno Bookings 

గరిష్టంగా 89.73PS శక్తిని, 113Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 5-స్పీడ్ MT లేదా 5-స్పీడ్ AMTతో రావచ్చు. మీరు 5-స్పీడ్ MTతో CNG వెర్షన్ (77.5PS 98.5Nm)ని కూడా ఎంచుకోవచ్చు. ఆ తర్వాత, 1.0-లీటర్ టర్బో బూస్టర్‌జెట్ పెట్రోల్ ఇంజన్ ఉంది. గరిష్టంగా 100.06PS పవర్, 147.6Nm గరిష్ట టార్క్‌ను అభివృద్ధి చేస్తుంది. 5-స్పీడ్ MT లేదా 6-స్పీడ్ ATతో క్లబ్‌ చేయొచ్చు. మారుతి సుజుకి ఫ్రాంక్స్ సిగ్మా, డెల్టా, డెల్టా+, జీటా, ఆల్ఫా అనే 5 వేరియంట్లలో లభిస్తుంది. వెహికల్ వేరియంట్ ధరలు (ఎక్స్-షోరూమ్) ఈ కింద విధంగా ఉన్నాయి.

* సిగ్మా 1.2 MT – రూ. 7.46 లక్షలు
* సిగ్మా CNG MT – రూ. 8.41 లక్షలు
* డెల్టా 1.2 MT – రూ. 8.32 లక్షలు
* డెల్టా CNG MT – రూ. 9.27 లక్షలు
* డెల్టా 1.2 AMT – రూ. 8.87 లక్షలు
* డెల్టా+ 1.2 MT – రూ. 8.72 లక్షలు
* డెల్టా+ 1.2 AMT – రూ. 9.27 లక్షలు
* డెల్టా+ 1.0 MT – రూ. 9.72 లక్షలు
* జీటా 1.0 MT – రూ. 10.55 లక్షలు
* జీటా 1.0 AT – రూ. 12.05 లక్షలు
* ఆల్ఫా 1.0 MT – రూ. 11.47 లక్షలు
* ఆల్ఫా 1.0 AT – రూ. 12.97 లక్షలు
* ఆల్ఫా 1.0 MT డ్యూయల్ టోన్ – రూ. 11.63 లక్షలు
* ఆల్ఫా 1.0 AT డ్యూయల్ టోన్ – రూ. 13.13 లక్షలు

Read Also : Noise Air Buds Pro SE Launch : 45 గంటల ఫుల్ బ్యాటరీ లైఫ్‌‌తో నాయిస్ ఎయిర్ బడ్స్ ప్రో SE TWS ఇయర్‌ఫోన్‌లు..!

ట్రెండింగ్ వార్తలు