Maruti Suzuki Invicto Bookings : జూన్ 19 నుంచి మారుతి సుజుకి ఇన్విక్టో బుకింగ్స్.. ధర తెలియాలంటే జూలై 5 వరకు ఆగాల్సిందే..!

Maruti Suzuki Invicto Bookings : మారుతి సుజుకి ఇండియా సొంత బ్రాండ్ పేరుతో భారత మార్కెట్లో విక్రయించనున్న ఫస్ట్ టయోటా వాహనం ఇన్విక్టో బుకింగ్స్ ఈ నెల 19 నుంచి మొదలు కానున్నాయి.

Maruti Suzuki Invicto Bookings : జూన్ 19 నుంచి మారుతి సుజుకి ఇన్విక్టో బుకింగ్స్.. ధర తెలియాలంటే జూలై 5 వరకు ఆగాల్సిందే..!

Maruti Suzuki Invicto bookings to open on June 19, price announcement on July 5

Updated On : June 13, 2023 / 7:53 PM IST

Maruti Suzuki Invicto Bookings : ప్రముఖ దేశీయ ఆటోమొబైల్ తయారీ కంపెనీ మారుతి సుజుకి ఇండియా (Maruti Suzuki India) రాబోయే మల్టీ-పర్పస్ వెహికల్ (MPV), టయోటా ఇన్నోవా హైక్రాస్ ఆధారంగా మారుతి సుజుకి ఇన్విక్టోగా తీసుకొస్తోంది. మారుతి సుజుకి ఇన్విక్టో (Maruti Suzuki Invicto) బుకింగ్‌లు జూన్ 19న ఓపెన్ కానున్నాయి. ఈ MPV వెహికల్ ధర జూలై 5న కంపెనీ ప్రకటించనుంది.

మారుతి సొంత బ్రాండ్ పేరుతో భారత మార్కెట్లో విక్రయించనున్న ఫస్ట్ టయోటా వాహనం ఇన్విక్టో మోడల్. మారుతి ఇప్పటికే టయోటాకు 2 వాహనాలను అందించింది. అందులో మొదటిది టయోటా అర్బన్ క్రూయిజర్‌గా విక్రయించిన విటారా బ్రెజ్జా ( Vitara Brezza), రెండవది బాలెనో, టయోటా గ్లాంజాగా అందిస్తోంది. అంతేకాకుండా, మారుతీ సుజుకి ఇండియా, టయోటా కిర్లోస్కర్ మోటార్ జపనీస్ పేరంట్స్ కంపెనీ మిడ్-సైజ్ SUVని డెవలప్ చేశారు. భారతీయ మార్కెట్లో మారుతి సుజుకి గ్రాండ్ విటారా, టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్‌గా విక్రయిస్తోంది.

Read Also : Apple Sale Days on Amazon : అమెజాన్‌లో ఆపిల్ సేల్ డేస్.. భారీగా తగ్గిన ఐఫోన్ 14 సిరీస్‌ ధర.. లిమిటెడ్ ఆఫర్ మాత్రమే.. ఇప్పుడే కొనేసుకోండి..!

టయోటా ఇన్నోవా హైక్రాస్ ధర రూ. 18.55 లక్షల నుంచి రూ. 29.99 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. మారుతి సుజుకి ఇన్విక్టో ధర కూడా ఇదే రేంజ్‌లో ఉంటుందని ఆశించవచ్చు. Innova Hycross రెండు ఇంజన్ ఆప్షన్లను కలిగి ఉంది. 2.0-లీటర్ VVTi పెట్రోల్, 2.0-లీటర్ VVTi పెట్రోల్ ఆటో-చార్జింగ్ బలమైన హైబ్రిడ్ ఎలక్ట్రిక్ సిస్టమ్‌తో వస్తుంది. 2.0-లీటర్ VVTi పెట్రోల్ 174PS గరిష్ట శక్తిని, 205Nm గరిష్ట టార్క్‌ను అభివృద్ధి చేస్తుంది. CVT ఆటోమేటిక్‌తో వస్తుంది.

Maruti Suzuki Invicto bookings to open on June 19, price announcement on July 5

Maruti Suzuki Invicto Bookings to open on June 19, price announcement on July 5

బలమైన హైబ్రిడ్ యూనిట్ 188Nm వద్ద ఇంజిన్ టార్క్, 206Nm వద్ద మోటార్ టార్క్‌తో కలిపి 186PS గరిష్ట శక్తిని అందిస్తుంది. ఇ-డ్రైవ్ సీక్వెన్షియల్ షిఫ్ట్‌తో వస్తుంది. ఇన్విక్టో రెండు ఇంజన్ ఆప్షన్లను కలిగి ఉంటుందని భావించవచ్చు. భారత మార్కెట్లో ఇన్విక్టో మారుతి ఫ్లాగ్‌షిప్ వాహనంగా రానుంది. ప్రస్తుతం, గ్రాండ్ విటారా కార్ల తయారీలో అత్యంత ఖరీదైన మోడల్ ఇదే కానుంది. రాబోయే ఈ ఇన్విక్టా మోడల్ కారు ధర రూ. 10.70 లక్షల నుంచి రూ. 19.79 లక్షలు (ఎక్స్-షోరూమ్) ఉంటుందని అంచనా.

Read Also : Xiaomi Pad 6 Launch : అద్భుతమైన ఫీచర్లతో షావోమీ ప్యాడ్ 6 వచ్చేసిందోచ్.. ధర ఎంతో తెలుసా?