Maruti Suzuki Invicto : మారుతి సుజుకి ఇన్విక్టో బుకింగ్స్.. ఒక వేరియంట్.. ఒక కలర్ ఆప్షన్ మాత్రమే.. త్వరపడండి..!

Maruti Suzuki Invicto : మారుతి సుజుకి ఇన్విక్టో కొత్త కారు బుకింగ్స్ మొదలయ్యాయి.. మారుతి ఫ్లాగ్‌షిప్ మోడల్‌లో Invicto కారు ఒకటి. ఈ కారు మోడల్ ఒక వేరియంట్, ఒక కలర్ ఆప్షన్ మాత్రమే బుకింగ్స్ అందిస్తోంది.

Maruti Suzuki Invicto : మారుతి సుజుకి ఇన్విక్టో బుకింగ్స్.. ఒక వేరియంట్.. ఒక కలర్ ఆప్షన్ మాత్రమే.. త్వరపడండి..!

Maruti Suzuki Invicto

Maruti Suzuki Invicto : ప్రముఖ ఆటోమొబైల్ తయారీ కంపెనీ మారుతి సుజుకి ఇండియా (Maruti Suzuki India) నుంచి దేశ మార్కెట్లో జూలై 5న ఇన్విక్టో మోడల్ కారు విడుదల కానుంది. ఒక వేరియంట్, ఒకే కలర్ ఆప్షన్ కోసం బుకింగ్‌లను స్వీకరిస్తోంది. అధికారిక Nexa వెబ్‌సైట్ ప్రకారం.. మారుతి ఇన్విక్టో IE స్ట్రాంగ్ హైబ్రిడ్ ఆల్ఫా+ 2L వేరియంట్‌కు మాత్రమే బుకింగ్‌లు చేయవచ్చు.

ఇందులో ఒక కలర్ ఆప్షన్ ‘నెక్సా బ్లూ (Celestial)’ ఉన్నాయి. మారుతి సుజుకి టయోటా ఇన్నోవా హైక్రాస్ రీబ్యాడ్జ్‌గా ఇన్విక్టో మోడల్‌ కారు వస్తోంది. బాలెనో-గ్లాంజా, విటారా బ్రెజ్జా-అర్బన్ క్రూయిజర్, గ్రాండ్ విటారా-అర్బన్ క్రూయిజర్ హైరైడర్ తర్వాత మారుతి, టయోటా భాగస్వామ్యం చేసిన నాల్గవ మోడల్ ఇది.

Read Also : Ola Electric GigaFactory : ఓలా ఎలక్ట్రిక్ భారతీయ అతిపెద్ద సెల్ ఫ్యాక్టరీ నిర్మాణం మొదలైందోచ్.. దేశంలో ఎక్కడ? కార్యకలాపాలు ఎప్పుడంటే?

ఇన్విక్టోమారుతి ఫ్లాగ్‌షిప్ మోడల్ అని చెప్పవచ్చు. ప్రస్తుతం, గ్రాండ్ విటారా కార్ల తయారీదారుల అత్యంత ఖరీదైన వాహనం కూడా. గ్రాండ్ విటారా రేంజ్-టాపింగ్ వేరియంట్ ధర రూ. 19.79 లక్షలు (ఎక్స్-షోరూమ్), ఇన్విక్టో రూ. 20 లక్షల+ (ఎక్స్-షోరూమ్) ధర కలిగి ఉంది. ఇన్నోవా హైక్రాస్ ధర రూ. 18.55 లక్షల నుంచి రూ. 29.99 లక్షలు (ఎక్స్-షోరూమ్).

Maruti Suzuki Invicto

Maruti Suzuki Invicto

మారుతి ఇప్పటికే రెండు మల్టీ బెనిఫిట్స్ వాహనాలను (MPVలు) విక్రయిస్తోంది. అందులో ఎర్టిగా, XL6. ఈ కేటగిరీలో దాదాపు 50శాతం వాటాను కలిగి ఉంది. ఇన్విక్టో బలమైన హైబ్రిడ్ యూనిట్ 2.0-లీటర్ VVTi పెట్రోల్ ఇంజన్‌ను ఆటో-చార్జింగ్ బలమైన హైబ్రిడ్ ఎలక్ట్రిక్ సిస్టమ్‌తో వస్తుంది.

188Nm వద్ద ఇంజిన్ టార్క్, 206Nm వద్ద మోటార్ టార్క్‌తో కలిపి 186PS గరిష్ట శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఇ-డ్రైవ్ సీక్వెన్షియల్ షిఫ్ట్ ద్వారా పనిచేస్తుంది. Innova Hycross 2.0-లీటర్ VVTi పెట్రోల్ ఇంజన్ ఆప్షన్ కలిగి ఉంది. 174PS గరిష్ట శక్తిని 205Nm గరిష్ట టార్క్‌ను అభివృద్ధి చేస్తుంది. CVT ఆటోమేటిక్‌తో వస్తుంది. ఇన్విక్టో ఈ పవర్‌ట్రెయిన్‌ కలిగి ఉంటుందా? లేదా అనే దానిపై మారుతి నుంచి ఎలాంటి క్లారిటీ లేదు.

Read Also : Amazon Prime Day 2023 : అమెజాన్ ప్రైమ్ డే సేల్స్.. ప్రైమ్ మెంబర్లకు అదిరే ప్లాన్లు.. మరెన్నో డీల్స్.. ఎప్పటినుంచో తెలుసా?