Amazon Prime Day 2023 : అమెజాన్ ప్రైమ్ డే సేల్స్.. ప్రైమ్ మెంబర్లకు అదిరే ప్లాన్లు.. మరెన్నో డీల్స్.. ఎప్పటినుంచో తెలుసా?

Amazon Prime Day 2023 : అమెజాన్ ప్రైమ్ డే సేల్స్ మొదలుకానుంది. వచ్చే జూలై 11 నుంచి జూలై 12 వరకు ఈ సేల్స్ అందుబాటులో ఉండనుంది. ప్రైమ్ మెంబర్లకు అదిరే ప్లాన్లను అమెజాన్ ప్రకటించనుంది.

Amazon Prime Day 2023 : అమెజాన్ ప్రైమ్ డే సేల్స్.. ప్రైమ్ మెంబర్లకు అదిరే ప్లాన్లు.. మరెన్నో డీల్స్.. ఎప్పటినుంచో తెలుసా?

Amazon’s official Prime Day 2023 deals list & best early sales

Amazon Prime Day 2023 : ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ (Amazon) వచ్చే జూలై 11 నుంచి జూలై 12 వరకు ప్రైమ్ డే 2023 సేల్ నిర్వహించనున్నట్టు అధికారికంగా ప్రకటించింది. ఈ ఏడాదిలో బిగ్ సేల్ సందర్భంగా వందల వేల డీల్‌లు నిర్వహించింది. అమెజాన్ మరోసారి ప్రారంభ ప్రైమ్ డే సేల్స్ నిర్వహించేందుకు రెడీగా ఉంది. ఈ ఏడాది ప్రారంభంలో కూడా అనేక ఆకర్షణీయమైన ధరలను అందించింది. 2023కి సంబంధించిన అమెజాన్ అధికారిక ప్రైమ్ డే డీల్‌ల జాబితాను రివీల్ చేసింది. అమెజాన్ అధికారిక ప్రైమ్ డే పేజీ పూర్తి వివరాలను అందించింది. అందులో AWS, Amazon Prime, Alexa, లాజిస్టిక్స్, డివైజ్‌లు వంటి మరిన్నింటితో సహా టెక్ దిగ్గజం అనేక డీల్స్ అందించనుంది.

అమెజాన్ 2023 ప్రైమ్ డే సేల్స్ ఈవెంట్‌ను జూలై 11 (మంగళవారం), జూలై 12 (బుధవారం)నిర్వహిస్తుందని సీటెల్ ఆధారిత ఇ-కామర్స్ దిగ్గజం ప్రకటించింది. ప్రైమ్ డే ఈవెంట్‌లో విక్రయించే ప్రొడక్టులను కొనుగోలు చేయడానికి ముందస్తుగా ఇన్విటేషన్లను కూడా ప్రైమ్ మెంబర్‌లకు పంపనుంది. తద్వారా కంపెనీ కొత్త ఇన్విటేషన్లకు మాత్రమే ప్రైమ్ డేస్ డీల్ అందిస్తోంది. ఎక్స్‌క్లూజివ్ డీల్ ధరకు ప్రొడక్టులను ఎలా కొనుగోలు చేయాలనే సూచనలతో ప్రైమ్ డే సందర్భంగా ఎంపిక చేసిన సభ్యులకు తెలియజేయనుంది.

Read Also : Honor Pad X8 Launch : అదిరే ఫీచర్లతో హానర్ ప్యాడ్ X8 ట్యాబ్ ఇదిగో.. ఈ నెల 22నే లాంచ్.. ధర ఎంతో తెలిసిందోచ్..!

అలాగే, అమెజాన్ 2023 ప్రైమ్ డే ప్లాన్‌లను ప్రైమ్ మెంబర్ల కోసం ప్రకటించనుంది. మొదటిసారిగా, ప్రైమ్ డే డీల్‌లు బై విత్ ప్రైమ్ ప్రోగ్రామ్‌లో పాల్గొనే థర్డ్-పార్టీ సైట్‌లకు విస్తరించనుంది. గత ఏడాదిలో ప్రైమ్‌తో కొనుగోలు చేయండి. ప్రైమ్ సభ్యులు అమెజాన్.కామ్‌ (Amazon.com)లో వస్తువులను కొనుగోలు చేసినట్లే.. నాన్-అమెజాన్ సైట్‌లలో వస్తువులను కొనుగోలు చేసేందుకు అనుమతిస్తుంది.

Amazon’s official Prime Day 2023 deals list & best early sales

Amazon’s official Prime Day 2023 deals list & best early sales

ప్రైమ్ డే తేదీలను ఆన్‌లైన్ షాపర్‌లు అమెజాన్ డీలర్లు, పార్టనర్లు, థర్డ్-పార్టీ డీలర్స్, ఆర్డర్‌లలో కంపెనీ వేర్‌హౌస్ ఉద్యోగులు నిశితంగా గమనిస్తారు. అదే సమయంలో సొంత సేల్ విక్రయ ఈవెంట్‌లను నిర్వహించనున్నారు. అమెజాన్ ప్రైమ్ డే జూలై రెండవ మంగళవారం, బుధవారం నిర్వహించడం వరుసగా రెండో సంవత్సరమని చెప్పవచ్చు. ప్రైమ్ డే ఆదాయం కంపెనీ మూడవ త్రైమాసిక ఫలితాలలో చేర్చనుంది. అమెజాన్ 2022 ఈవెంట్ హిస్టరీలోనే అతిపెద్ద ప్రైమ్ డే ఈవెంట్ అని చెప్పవచ్చు. ప్రపంచవ్యాప్తంగా 300 మిలియన్లకు పైగా వస్తువులను కొనుగోలు చేసింది. ప్రైమ్ సభ్యుల ద్వారా మొత్తం 1.7 బిలియన్ డాలర్లు ఆదా చేసింది.

2015 నుంచి ప్రైమ్ డే ఈవెంట్ అనేది కంపెనీకి అత్యంత ముఖ్యమైన వార్షిక ఈవెంట్‌లలో ఒకటిగా మారింది. హాలిడే షాపింగ్ రద్దీ తర్వాత 6 లేదా 7 నెలల తర్వాత రెండవ పీక్ సీజన్‌ను ప్రారంభిస్తుంది. ఈ ఏడాది ఆస్ట్రేలియా, ఆస్ట్రియా, బెల్జియం, బ్రెజిల్, కెనడా, చైనా, ఈజిప్ట్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, లక్సెంబర్గ్, మెక్సికో, నెదర్లాండ్స్, పోలాండ్, పోర్చుగల్, సౌదీ అరేబియా, సింగపూర్, స్పెయిన్, స్వీడన్, టర్కీ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, అమెరికా, యూకేలో వంటి దేశాల్లో ఈవెంట్ నిర్వహించనున్నట్టు అమెజాన్ తెలిపింది. భారత మార్కెట్లో ఈ వేసవి తరువాత నిర్వహించనున్నట్టు కంపెనీ తెలిపింది.

Read Also : Ola Electric GigaFactory : ఓలా ఎలక్ట్రిక్ భారతీయ అతిపెద్ద సెల్ ఫ్యాక్టరీ నిర్మాణం మొదలైందోచ్.. దేశంలో ఎక్కడ? కార్యకలాపాలు ఎప్పుడంటే?