Honor Pad X8 Launch : అదిరే ఫీచర్లతో హానర్ ప్యాడ్ X8 ట్యాబ్ ఇదిగో.. ఈ నెల 22నే లాంచ్.. ధర ఎంతో తెలిసిందోచ్..!

Honor Pad X8 Launch : కొత్త ట్యాబ్ కొనేందుకు చూస్తున్నారా? అయితే, ఈ నెల 22న అదిరే ఫీచర్లతో హానర్ ప్యాడ్ x8 టాబ్లెట్ రానుంది. లాంచ్‌కు ముందే ఈ ట్యాబ్ ధరను అమెజాన్ రివీల్ చేసింది.

Honor Pad X8 Launch : అదిరే ఫీచర్లతో హానర్ ప్యాడ్ X8 ట్యాబ్ ఇదిగో.. ఈ నెల 22నే లాంచ్.. ధర ఎంతో తెలిసిందోచ్..!

Honor Pad X8 With MediaTek Helio G80 SoC to Launch in India on June 22

Honor Pad X8 Launch : ప్రముఖ చైనా ఎలక్ట్రానిక్ తయారీ కంపెనీ హానర్ నుంచి కొత్త ప్యాడ్ వచ్చేస్తోంది. హానర్ ప్యాడ్ (Honor Pad X8) ట్యాబ్ ఈ నెల (జూన్ 22న) భారత మార్కెట్లో లాంచ్ కానుంది. ఈ టాబ్లెట్ గత ఏడాది సెప్టెంబర్‌లో చైనాలో లాంచ్ అయింది. ఆక్టా-కోర్ MediaTek Helio G80 SoC ద్వారా పవర్ అందిస్తుంది. 5,100mAh బ్యాటరీతో సపోర్టు అందిస్తుంది.

ఈ టాబ్లెట్ చైనా డాన్ బ్లూ, మింట్ కలర్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంది. 4GB + 128GB, 6GB + 128GB స్టోరేజ్ వేరియంట్‌లలో లభిస్తుంది. 5MP బ్యాక్ కెమెరా, 2MP ఫ్రంట్ కెమెరా సెన్సార్‌తో వస్తుంది. భారత మార్కెట్లో టాబ్లెట్ ధరను లాంచ్‌కు ముందే అమెజాన్‌లో వెల్లడించింది.

Read Also : WhatsApp Tips : మీ ఫోన్ స్టోరేజీ సేవ్ చేయాలా? వాట్సాప్‌లో ఫొటో వీడియో ఆటో డౌన్‌లోడ్ డిసేబుల్ చేయండిలా..!

భారత్‌లో హానర్ ప్యాడ్ X8 ధర ఎంతంటే? :
అమెజాన్ జాబితా ప్రకారం.. హానర్ ప్యాడ్ X8 3GB + 32GB వేరియంట్ భారత మార్కెట్లో రూ. 10,999గా ఉండనుంది. (GizmoChina) నివేదిక ప్రకారం.. 4GB + 64GB వేరియంట్ ధర రూ. 11,999గా ఉంది. అదే సమయంలో, భారత మార్కెట్లో టాబ్లెట్ బ్లూ అవర్ కలర్ ఆప్షన్‌లో అందించే అవకాశం ఉందని హానర్ ఇండియా వెబ్‌సైట్ ధృవీకరిస్తుంది. జూన్ 22న మధ్యాహ్నం 12 గంటల నుంచి ఈ హానర్టాబ్లెట్ కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది.

Honor Pad X8 With MediaTek Helio G80 SoC to Launch in India on June 22

Honor Pad X8 With MediaTek Helio G80 SoC to Launch in India on June 22

హానర్ ప్యాడ్ X8 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
హానర్ ప్యాడ్ X8 మోడల్ 1,920 x 1,200 పిక్సెల్‌ల రిజల్యూషన్, 224ppi పిక్సెల్ సాంద్రతతో 10.1-అంగుళాల ఫుల్-HD IPS డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ టాబ్లెట్ భారతీయ వేరియంట్‌పై ఆండ్రాయిడ్ 12-ఆధారిత మ్యాజిక్ OS స్కిన్‌ను అందిస్తుంది. టాబ్లెట్ ఆక్టా-కోర్ MediaTek Helio G80 SoCతో పాటు 6GB వరకు RAM, 128GB ఇంటర్నల్ స్టోరేజీతో వస్తుంది. అయితే, కంపెనీ భారత్‌లో తక్కువ స్టోరేజ్ వేరియంట్‌లను లాంచ్ చేసే అవకాశం ఉంది. అమెజాన్‌లో 3GB + 32GB వేరియంట్ లిస్టు కాగా.. మరో 4GB + 64GB మోడల్ కూడా అందుబాటులో ఉండవచ్చు.

ఆప్టిక్స్ విషయానికి వస్తే.. హానర్ టాబ్లెట్‌లో 5MP బ్యాక్ కెమెరా, సెల్ఫీలకు 2MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. టాబ్లెట్ 5,100mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుంది. 3 గంటల్లో 0 నుంచి 100 శాతం వరకు ఛార్జ్ అవుతుంది. ఈ టాబ్లెట్ అల్యూమినియం బాడీ బరువు 460 గ్రాములు, సైజు 240.2mm x 159mm x 7.55mm. USB టైప్-C, WiFi 802.11 a/b/g/n/ac, బ్లూటూత్ v5.1 కనెక్టివిటీకి సపోర్టు ఇస్తుంది. 3.5mm ఆడియో జాక్‌తో వస్తుంది. ఈ టాబ్లెట్ హానర్ హిస్టన్ సౌండ్ ఎఫెక్ట్‌లతో కూడిన స్టీరియో స్పీకర్‌లను కూడా కలిగి ఉంది.

Read Also : Nothing Smartwatch : నథింగ్ ఫోన్ (2) తర్వాత మార్కెట్లోకి కొత్త స్మార్ట్‌వాచ్‌ వచ్చేస్తోంది.. టిప్‌స్టర్ హింట్ ఇదిగో..!