Meta Matt Deitke : AI రేసులో తీవ్ర పోటీ.. ఈ 24 ఏళ్ల యువకుడికి మెటాలో రూ. 2,196 కోట్ల భారీ ప్యాకేజీ.. ఏఐ రీసెర్చర్ మాట్ డైట్కే ఎవరంటే?

Meta Matt Deitke : మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ 24 ఏళ్ల ఏఐ రీసెర్చర్ మాట్ డీట్కేకు రూ. 2,196 కోట్ల శాలరీ ఆఫర్ చేసి ఏఐ టీంలో చేర్చుకున్నాడు..

Meta Matt Deitke : AI రేసులో తీవ్ర పోటీ.. ఈ 24 ఏళ్ల యువకుడికి మెటాలో రూ. 2,196 కోట్ల భారీ ప్యాకేజీ.. ఏఐ రీసెర్చర్ మాట్ డైట్కే ఎవరంటే?

Meta Matt Deitke

Updated On : August 6, 2025 / 5:45 PM IST

Meta Matt Deitke : ఏఐ టెక్నాలజీ వేగంగా అభివృద్ధి చెందుతోంది. రోజురోజుకీ టెక్ ప్రపంచంలో తీవ్ర పోటీ వాతావరణం పెరుగుతోంది. ఐటీ కంపెనీలు పోటీపోటీగా (Meta Matt Deitke) ఏఐని డెవలప్ చేస్తూ దూసుకుపోతున్నాయి. ప్రస్తుతం సిలికాన్ వ్యాలీలో ఏఐ వార్ కొనసాగుతోంది. ఏఐ రేసులో దిగ్గజ ఐటీ కంపెనీలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రీసెర్చర్లను తమ కంపెనీల్లో చేర్చుకునేందుకు పోటీ పడుతున్నాయి.

ఈ ఏఐ రేసులో మెటా (ఫేస్‌బుక్ పేరెంట్ కంపెనీ) మరో ముందడుగు వేసింది. ఇప్పుడే మొత్తం టెక్ పరిశ్రమలో ఇదే పెద్ద చర్చనీయాంశమవుతోంది. నివేదికల ప్రకారం.. మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ స్వయంగా 24 ఏళ్ల ఏఐ రీసెర్చర్ మాట్ డీట్కేను రూ. 2,196 కోట్లు ఆఫర్ చేసి మెటా కంపెనీలో చేర్చుకున్నాడు.

మాట్ డైట్కే ఎవరంటే? :
ఏఐ ప్రపంచంలో అత్యంత ప్రతిభావంతులైన రీసెర్చర్లలో మాట్ డైట్కే ఒకరు. వాషింగ్టన్ యూనివర్శిటీ నుంచి పీహెచ్‌డీని వదిలి నేరుగా సియాటిల్‌లోని అల్లెన్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ AI (AI2)లో పనిచేయడం ప్రారంభించాడు.

అక్కడ మోల్మో అనే అధునాతన మల్టీమోడల్ చాట్‌బాట్‌ను డెవలప్ చేశాడు. ఇది టెక్స్ట్‌ను మాత్రమే కాకుండా ఫొటోలు, ఆడియోను కూడా ప్రాసెస్ చేయగలదు. ఏఐ రీసెర్చ్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన న్యూరిఐపీఎస్ 2022లో “అవుట్‌స్టాండింగ్ పేపర్ అవార్డు” కూడా అందుకున్నాడు.

Read Also : BSNL Recharge Plan : BSNL సూపర్ ప్లాన్.. సింగిల్ రీఛార్జ్‌తో 600GB హైస్పీడ్ డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్, 365 రోజులు ఎంజాయ్ చేయొచ్చు..!

భారీ ప్యాకేజీతో మ్యాట్ డైట్కే నియామకం :
మెటా 2023 నుంచి సూపర్ ఇంటెలిజెన్స్ ల్యాబ్ కోసం డైట్కేను నియమించుకోవాలని చూస్తోంది. కానీ, ఆయన సొంత AI కంపెనీ వెర్సెప్ట్‌లో పనిచేస్తున్నందున మొదట ఆ ఆఫర్‌ను తిరస్కరించాడు. అయితే, జుకర్‌బర్గ్ ఎప్పటినుంచో మెటా జాయిన్ కావాలని ఒత్తిడి చేస్తున్నాడు. ఎట్టకేలకు భారీ ప్యాకేజీ ఇచ్చి డైట్కేను మెటాలోకి తీసుకున్నాడు.

మెటా సూపర్ ఇంటెలిజెన్స్ ల్యాబ్ ఏంటి? :
ఈ సూపర్ ఇంటెలిజెన్స్ ల్యాబ్ ఆఫ్ మెటా అనేది ప్రపంచంలోనే అత్యంత అడ్వాన్స్ AI సిస్టమ్ ప్రాజెక్ట్. ఇందుకోసం మెటా కంపెనీ రూ. 8వేల కోట్లకు పైగా (1 బిలియన్ డాలర్లు) పెట్టుబడి పెట్టింది. OpenAI, Google, Apple వంటి కంపెనీల నుంచి టాప్ రేంజ్ ఏఐ రీసెర్చర్లను నియమించుకుంది.

మాట్ డైట్కేతో పాటు, మెటా ఇటీవలే ఆపిల్ ఏఐ టీం అధిపతిగా ఉన్న రూమింగ్ పాంగ్‌ను కూడా తన బృందంలో చేర్చుకుంది. నివేదికల ప్రకారం. పాంగ్ 200 మిలియన్ డాలర్లు (రూ. 1,660 కోట్లకు పైగా) ప్యాకేజీ ఆఫర్ చేసింది.