BSNL Recharge Plan : BSNL సూపర్ ప్లాన్.. సింగిల్ రీఛార్జ్‌తో 600GB హైస్పీడ్ డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్, 365 రోజులు ఎంజాయ్ చేయొచ్చు..!
BSNL Recharge Plan : బీఎస్ఎన్ఎల్ సూపర్ ప్లాన్ మీకోసం.. లాంగ్ టైమ్ రీఛార్జ్ ప్లాన్ కావాలంటే ఈ కొత్త ప్లాన్‌తో 365 రోజులు ఎంజాయ్ చేయొచ్చు.

BSNL's new affordable plan
BSNL Recharge Plan : బీఎస్ఎన్ఎల్ యూజర్లకు గుడ్ న్యూస్.. భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) భారీ సంఖ్యలో వినియోగదారులను ఆకర్షించేందుకు అనేక చౌకైన (BSNL Recharge Plan) రీఛార్జ్ ప్లాన్‌లను అందిస్తోంది.
ప్రభుత్వ యాజమాన్యంలోని టెలికాం ప్రొవైడర్ రూ.107 నుంచి రీఛార్జ్ ప్లాన్‌లను అందిస్తుంది. అన్‌లిమిటెడ్ కాలింగ్, డేటా బెనిఫిట్స్ మరిన్నింటితో లాంగ్ టైమ్ రీఛార్జ్ ప్లాన్ కోసం చూస్తుంటే ఈ రీఛార్జ్ ప్లాన్ మీకోసమే.
ఒకసారి రీఛార్జ్ చేస్తే.. ఏడాదివరకు మళ్లీ రీఛార్జ్ చేయాల్సిన అవసరం ఉండదు. అన్‌లిమిటెడ్ కాలింగ్, డేటా, SMS బెనిఫిట్స్ అందించే అత్యంత చౌకైన రీఛార్జ్ ప్లాన్. మరోవైపు.. ఎయిర్‌టెల్ రూ.2,249కే 365 రోజుల పాటు అన్‌లిమిటెడ్ కాలింగ్, SMS బెనిఫిట్స్, 30GB డేటాను అందిస్తుంది. జియో 365 రోజుల రీఛార్జ్ ప్లాన్ ధర రూ.3,599కు పొందవచ్చు. బీఎస్ఎన్ఎల్ రూ.1,999 ప్లాన్ బెనిఫిట్స్, వ్యాలిడిటీ సహా ఇతర వివరాలను ఓసారి లుక్కేయండి..
BSNL రూ.1,999 రీఛార్జ్ ప్లాన్ బెనిఫిట్స్ :
బీఎస్ఎన్ఎల్ రూ.1,999 రీఛార్జ్ ప్లాన్ అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 SMS బెనిఫిట్స్, 600GB డేటాను 365 రోజుల వరకు వ్యాలిడిటీతో అందిస్తుంది. ఈ ప్లాన్ భారత మార్కెట్లో అన్ని BSNL సర్కిల్‌లలో అందుబాటులో ఉంది. ఈ వన్-టైమ్ రీఛార్జ్ ప్లాన్ నెలవారీ రీఛార్జ్ అవసరం లేదు.
BSNL స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా రూ.1 ప్రీపెయిడ్ ప్లాన్‌ను ప్రకటించింది. ఈ ప్లాన్ కేవలం రూ.1కే 30 రోజుల అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకు 2GB హై-స్పీడ్ డేటా, రోజుకు 100 ఫ్రీ SMS బెనిఫిట్స్ అందిస్తుంది.
ఆసక్తిగల వినియోగదారులు దేశవ్యాప్తంగా రోమింగ్‌కు కూడా యాక్సెస్ పొందవచ్చు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న అత్యంత సరసమైన ఎంట్రీ-లెవల్ ప్యాక్‌లలో ఒకటిగా నిలిచింది. అయితే, ఈ బెనిఫిట్స్ పొందడానికి వినియోగదారులు ఆగస్టు 1 నుంచి ఆగస్టు 31 మధ్య కొత్త BSNL సిమ్ కార్డు కొనుగోలు చేయాలి. రీఛార్జ్ రూ.1 చెల్లి్స్తే చాలు అద్భుతమైన బెనిఫిట్స్ పొందవచ్చు.