Raksha Bandhan 2025 : రక్షా బంధన్ 2025.. మీ సోదరి కోసం రూ. 10వేల లోపు 7 అద్భుతమైన గాడ్జెట్‌లు… ఏది గిఫ్ట్ ఇస్తారో మీదే ఛాయిస్..!
Raksha Bandhan 2025 : రక్షా బంధన్ 2025 సందర్భంగా మీ ప్రియమైన సోదరికి ఏదైనా గిఫ్ట్ ఇస్తున్నారా? ఈ 7 కూల్ గాడ్జెట్లను ఓసారి చెక్ చేయండి..

Raksha Bandhan 2025
Raksha Bandhan 2025 : రక్షా బంధన్ 2025 వచ్చేస్తోంది.. మీ సోదరికి ప్రత్యేకమైన బహుమతిగా ఇవ్వాలని అనుకుంటున్నారా? ఈ పండుగ సీజన్‌లో (Raksha Bandhan 2025) రూ. 10వేల లోపు ధరలో 7 అద్భుతమైన గాడ్జెట్‌లు అందుబాటులో ఉన్నాయి. అవేంటో ఓసారి లుక్కేయండి.
వన్‌ప్లస్ బడ్స్ ప్రో 3 (రూ. 9,999) :
వన్‌ప్లస్ బడ్స్ ప్రో 3లో సౌండ్ క్వాలిటీ కోసం డ్యూయల్ డ్రైవర్లు, డ్యూయల్ DAC ఉన్నాయి. డైన్‌ఆడియో (Dynaudio EQ)లు, ఏఐ-ఆధారిత ట్రాన్సులేటర్, 50dB వరకు అడాప్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్‌ను అందిస్తాయి. ఇయర్‌బడ్‌లు మొత్తం 43 గంటల బ్యాటరీ లైఫ్ అందిస్తాయి.
లావా స్టార్మ్ ప్లే (రూ. 9,999) :
లావా స్టార్మ్ ప్లే 6.75-అంగుళాల IPS LCD డిస్‌ప్లేతో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్‌ను అందిస్తుంది. మొబైల్ యూనిట్ మీడియాటెక్ డైమన్షిటీ 7060 చిప్‌సెట్‌తో రన్ అవుతుంది. డ్యూయల్ 50MP+2MP మెయిన్ కెమెరా, 8MP ఫ్రంట్ కెమెరా, 18W ఛార్జింగ్ ద్వారా 5000mAh బ్యాటరీ సపోర్ట్‌తో వస్తుంది.
అమేజ్‌ఫిట్ బిప్ 6 స్మార్ట్ వాచ్ (రూ. 7,999) :
అమాజ్‌ఫిట్ బిప్ 6 1.97-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లేతో వస్తుంది. సింగిల్ ఛార్జ్ చేస్తే.. 14 రోజుల వరకు ఉంటుంది. ఇందులో ఫ్రీ మ్యాప్‌లు, బ్లూటూత్ కాలింగ్, టెక్స్టింగ్‌తో కూడిన ఇంటర్నల్ GPS ఉన్నాయి. ఈ వాచ్‌లో ఏఐ ఫీచర్లు, హెల్త్, స్లీప్ ట్రాకింగ్, 140+ వర్కౌట్ మోడ్‌లు, 5 ఏటీఎం వాటర్ రెసిస్టెన్స్ కూడా ఉన్నాయి.
ఐక్యూ Z10 లైట్ (రూ. 9,999) :
ఐక్యూ Z10 లైట్ ఫోన్ 90Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్టు ఇచ్చే 6.7-అంగుళాల LCD డిస్‌ప్లేతో వస్తుంది. మీడియాటెక్ డైమన్షిటీ 6300 ప్రాసెసర్‌పై రన్ అవుతుంది. మొబైల్ యూనిట్ 15W ఛార్జింగ్‌కు సపోర్టు ఇచ్చే 6000mAh బ్యాటరీ, 50MP+2MP డ్యూయల్ రియర్ లెన్స్, 5MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా కలిగి ఉంది.
ఇన్ఫినిక్స్ హాట్ 50 5G (రూ. 9,499) :
డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌తో ఇన్ఫినిక్స్ హాట్ 50 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్టు ఇచ్చే 6.7-అంగుళాల HD+ స్క్రీన్ కలిగి ఉంది. 5000mAh బ్యాటరీ, 48MP ప్రైమరీ కెమెరా, 8MP ఫ్రంట్ కెమెరాను అందిస్తుంది.
సోనీ wh-ch720n (రూ. 8,820) :
ఈ వైర్‌లెస్ ఓవర్-ఇయర్ హెడ్‌ఫోన్‌లు యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్, అడాప్టివ్ సౌండ్ కంట్రోల్, బిల్ట్-ఇన్ మైక్‌తో వస్తాయి. 35 గంటల బ్యాటరీ లైఫ్, క్విక్ ఛార్జింగ్, కస్టమైజడ్ సౌండ్ ఎక్స్‌పీరియన్స్ కోసం కస్టమైజడ్ EQ అందిస్తాయి.
నాయిస్ ప్రో 6 మ్యాక్స్ స్మార్ట్ వాచ్ (రూ. 7,499) :
నాయిస్ ప్రో 6 మ్యాక్స్ 1.96-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లే, స్టెయిన్‌లెస్ స్టీల్ బిల్డ్, ఇంటర్నల్ GPS కలిగి ఉంది. పవర్‌ఫుల్ EN2 ప్రాసెసర్‌పై రన్ అవుతుంది. 5 ATM వాటర్ రెసిస్టెన్స్, AI పవర్‌తో కూడిన వాచ్ ఫేస్‌లు, స్మార్ట్ డైలీ సపోర్ట్ కోసం ఏఐ కంపానియన్‌ను కలిగి ఉంటుంది.