Mercedes First Vegan Car : వరల్డ్ ఫస్ట్ ‘ప్యూర్ వీగన్ కారు’ వచ్చేసింది.. ఫుల్ ఛార్జ్ చేస్తే 713 కి.మీ రేంజ్.. ఫీచర్లు, ధర వివరాలివే..!

Mercedes First Vegan Car : ప్రపంచంలోనే మొట్టమొదటి ఎలక్ట్రిక్ కారును అమెరికాలో ప్రవేశపెట్టారు. 'పూర్తిగా వీగన్' ఇంటీరియర్ కారు వచ్చేసింది. ఈ కారు లుక్స్, డిజైన్, పర్ఫార్మెన్స్ పరంగా అద్భుతంగా ఉంటుంది.

Mercedes First Vegan Car : వరల్డ్ ఫస్ట్ ‘ప్యూర్ వీగన్ కారు’ వచ్చేసింది.. ఫుల్ ఛార్జ్ చేస్తే 713 కి.మీ రేంజ్.. ఫీచర్లు, ధర వివరాలివే..!

Mercedes First Vegan Car (Image Credit To Original Source)

Updated On : January 14, 2026 / 7:13 PM IST
    • ప్రపంచంలోని మొట్టమొదటి వీగన్ కారు
    • అమెరికాలో మొట్టమొదటి మెర్సిడెస్-బెంజ్ ఎలక్ట్రిక్ కారు
    • ఆల్-వీగన్ ఇంటీరియర్ ఆప్షన్
    • సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు కూడా సపోర్టు
    • ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే దాదాపు 713 కి.మీ

Mercedes First Vegan Car : కొత్త కారు కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? మీకోసం సరికొత్త మోడ్రాన్ కారు వచ్చేసింది. ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ మెర్సిడెస్-బెంజ్ అత్యంత పాపులర్ కారు జీఎల్‌సీ ఫస్ట్ ఎలక్ట్రిక్ మోడల్‌ను అమెరికాలో ప్రవేశపెట్టింది. ఈ కారు అతిపెద్ద ఫీచర్ ‘పూర్తిగా వీగన్’ ఇంటీరియర్ అందించింది. ఈ మెర్సిడెస్ కారుకు ‘ఆల్-వీగన్’ ఇంటీరియర్ ఆప్షన్ కూడా ఉంది. ప్రపంచంలో ఇప్పటివరకూ ఏ కంపెనీ కూడా ఇలాంటి కారు తయారు చేయలేదు.

ఫస్ట్ టైమ్ మెర్సిడెస్ కంపెనీ వీగన్ కారును తీసుకొచ్చింది. అయితే, కస్టమర్లు తమకు నచ్చిన ఇంటీరియర్‌ను ఎంచుకోవచ్చు. ఈ కారు లుక్స్, డిజైన్, పర్ఫార్మెన్స్ పరంగా చాలా అద్భుతంగా ఉంది. ఫీచర్లు చాలా బాగున్నాయి. ఈ మెర్సిడెస్ కారు ప్రత్యేక ఫీచర్లకు సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

ప్రపంచంలో మొట్టమొదటి వీగన్ కారు :
లగ్జరీ కార్లలో సాధారణంగా సీట్లు, డాష్‌బోర్డ్‌ల కోసం జంతువుల చర్మాన్ని ఉపయోగిస్తారు. అయితే, మెర్సిడెస్ ఈ కారును పూర్తిగా మార్చింది. లోపలి భాగాలు (సీట్లు, స్టీరింగ్ వీల్, కార్పెట్‌లు మొదలైనవి) ఏవీ జంతు ఉత్పత్తులను ఉపయోగించి తయారుచేయలేదు అనమాట.

Mercedes First Vegan Car

Mercedes First Vegan Car (Image Credit To Original Source)

2 ఏళ్లు రీసెర్చ్ :
మెర్సిడెస్ రెండు ఏళ్లుగా వీగన్ సొసైటీతో రీసెర్చ్ నిర్వహించి 100 కన్నా ఎక్కువ పార్టులను జంతు తయారు చేసింది. కారు లోపలి భాగంలో వాడిన పదార్థాలను జంతువులపై పరీక్షించలేదు. లోపలి భాగంలో రీసైకిల్డ్ పదార్థాలు ఉన్నాయి.

అద్భుతమైన పర్ఫార్మెన్స్, రేంజ్ ఎంతంటే? :

మెర్సిడెస్ అందించే ఈ ఎలక్ట్రిక్ జీఎల్‌సీ ఎకో ఫ్రెండ్లీగా ఉంటుంది. స్పీడ్ పరంగా కూడా సూపర్ ఫాస్ట్ ఉంటుంది. పర్ఫార్మెన్స్ విషయంలో కూడా మెర్సిడెస్ అసలు వెనక్కి తగ్గలేదు. పవర్ అవుట్‌పుట్ పరంగా ఎలక్ట్రిక్ ఇంజిన్ 483hp పవర్ ఇస్తుంది. టాప్ స్పీడ్ 210kmphతో వస్తుంది.

ఈ కారు సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు కూడా సపోర్టు ఇస్తుంది. డీసీ ఫాస్ట్ ఛార్జింగ్ ద్వారా కేవలం 10 నిమిషాల్లో 300 కి.మీ రేంజ్ అందిస్తుంది. ఈ బ్యాటరీ ఛార్జ్ అయ్యేందుకు 330kW ఫాస్ట్ ఛార్జర్ కూడా ఉంది. ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే.. ఈ కారు దాదాపు 713 కి.మీ దూసుకెళ్తుంది.

సూపర్-అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ :
హైపర్‌స్క్రీన్ : ఈ కారులో డాష్‌బోర్డ్ ఒక సోర్సెస్ నుంచి మరో సోర్సెస్ వరకు విస్తరించిన పెద్ద 39.1-అంగుళాల హైపర్‌స్క్రీన్ ఉంది.

Read Also : Haier 4K Smart TVs : కొత్త స్మార్ట్‌టీవీ కొంటున్నారా? 4 కొత్త హైయర్ 4K అల్ట్రా స్మార్ట్ టీవీలు.. ధర జస్ట్ రూ. 25,990కే.. ఫుల్ డిటెయిల్స్

ఏఐ కాంబినేషన్ : మైక్రోసాఫ్ట్, గూగుల్ ఏఐ ద్వారా 4వ జనరేషన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ అందిస్తుంది. మైక్రోసాఫ్ట్, గూగుల్ రెండింటి నుంచి ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్)తో రన్ అయ్యే ప్రపంచంలోనే ఫస్ట్ కారుగా చెప్పవచ్చు.

డ్రైవర్‌లెస్ ట్రావెల్ : లెవల్ 2 అటానమస్ సిస్టమ్‌తో వస్తుంది. కారు పార్కింగ్ నుంచి డెస్టినేషన్ చేరుకోవడానికి కేవలం ఒక క్లిక్‌తో దూసుకెళ్లగలదు.

MB.OS : ఈ కారు సొంత కొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో వస్తుంది.

ఈ కారు సేల్ ఎప్పుడంటే? :
మెర్సిడెస్ ఇటీవలే ఈ కారును అమెరికాలోని లాస్ వెగాస్‌లో జరిగిన సీఈఎస్ 2026లో ప్రదర్శించింది. అమెరికాలో ఈ కారు సేల్స్ 2026 రెండో త్రైమాసికంలో (ఏప్రిల్-జూన్) ప్రారంభమయ్యే అవకాశం ఉంది. కస్టమర్లు కంపెనీ వెబ్‌సైట్‌లో తమకు నచ్చిన వేగన్ ఇంటీరియర్‌ను కొనేసుకోవచ్చు.