Meta AI Users : మీ వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ చెక్ చేశారా? మెటా ఏఐ అసిస్టెంట్ ఫీచర్.. ఇదేలా పనిచేస్తుందంటే?

Meta AI Users : మెటా ఏఐ కూడా "ఇమాజిన్" అనే ప్రత్యేకమైన ఫీచర్‌ను కలిగి ఉంది. వినియోగదారులు వారి చాట్‌ల నుంచి నేరుగా ఏఐ రూపొందించిన ఫొటోలను క్రియేట్ చేయొచ్చు.

Meta AI Users : మీ వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ చెక్ చేశారా? మెటా ఏఐ అసిస్టెంట్ ఫీచర్.. ఇదేలా పనిచేస్తుందంటే?

Meta AI on WhatsApp, Instagram, Facebook ( Image Source : Google )

Meta AI Users : ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం మెటా అడ్వాన్స్‌డ్ ఏఐ అసిస్టెంట్, మెటా ఏఐని భారత్‌లో ప్రవేశపెట్టింది. ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, వాట్సాప్ సర్వీసులను ఉపయోగించే యూజర్లు ఈ యాప్‌లలో మెటా ఏఐని ఉపయోగించగలరు. రోజువారీ పనులు, అభ్యాసం, క్రియేటివిటీ పనిలో వినియోగదారులకు మెటా ఏఐ సాయపడుతుందని కంపెనీ పేర్కొంది. గత ఏడాదిలో మెటా కనెక్ట్‌లో సరికొత్త (Llama 3) టెక్నాలజీ ఆధారితమైనది. మెటా ఏఐ ఏప్రిల్ నుంచి ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తోంది. ఇప్పుడు భారత్‌లోని యూజర్లకు కూడా అందుబాటులో ఉంది.

Read Also : Realme C61 Launch : రూ.10వేల లోపు ధరలో రియల్‌మి C61 ఫోన్ వచ్చేస్తోంది.. ఈ నెల 28నే లాంచ్..!

వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లో మెటా ఏఐ ఎలా ఉపయోగించాలి? :
వాట్సాప్‌లో గ్రూప్ చాట్‌లలో మెటా ఏఐ అసిస్టెంట్ వినియోగించవచ్చు. నైట్ అవుట్ కోసం రెస్టారెంట్ సిఫార్సులు కావాలన్నా లేదా రోడ్ ట్రిప్ కోసం ప్రయాణ ఆలోచనలు కావాలన్నా యూజర్లు తమ వాట్సాప్ కానర్వేషన్‌లో మెటా ఏఐ యాక్సస్ చేయొచ్చునని కంపెనీ తెలిపింది. మెటా ఏఐ నేరుగా యాక్సెస్ చేయడానికి మీ డివైజ్ అప్‌డేట్ అందుబాటులోకి వచ్చిన తర్వాత యాప్ టాప్ ప్లేసులో బ్లూ-పర్పుల్ సర్కిల్ ఐకాన్ కోసం సెర్చ్ చేయొచ్చు.

ఆసక్తికరంగా, మెటా ఏఐ కూడా “ఇమాజిన్” అనే ప్రత్యేకమైన ఫీచర్‌ను కలిగి ఉంది. వినియోగదారులు వారి చాట్‌ల నుంచి నేరుగా ఏఐ రూపొందించిన ఫొటోలను క్రియేట్ చేయొచ్చు. ఈ ఫొటోలను షేర్ చేసేందుకు అనుమతిస్తుంది. మెటా ఏఐతో “ఇమాజిన్” అనే పదంతో కొన్ని టాస్కులను పూర్తి చేయవచ్చు.

బర్త్‌డే పార్టీల వంటి ఈవెంట్‌ల కోసం కస్టమైజడ్ ఇన్విటేషన్లను క్రియేట్ చేయడం, హోమ్ డెకర్ మూడ్ బోర్డ్‌లను డెవలప్ చేయడం వంటివి ఉన్నాయి. ఈ కొత్త ప్రాంప్ట్‌లను అందించడం ద్వారా ఇప్పటికే ఉన్న ఫొటోలను యానిమేట్ చేయవచ్చు లేదా ఎడిట్ చేయొచ్చు అని కంపెనీ తెలిపింది.

వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌‌బుక్‌లో మెటా ఏఐ ఎలా యాక్సెస్ చేయాలి? :
మెటా ఏఐ క్రమంగా భారత్ అంతటా రిలీజ్ అవుతోంది. ఇంకా అప్‌డేట్ పొందని వినియోగదారులు రాబోయే రోజుల్లో పొందవచ్చు. మీరు వీలైనంత త్వరగా యాక్సెస్ పొందవచ్చు. మీ మెటా యాప్‌లను లేటెస్ట్ వెర్షన్‌కి అప్‌డేట్ చేస్తూ ఉండండి. వాట్సాప్‌లో బ్లూ-పర్పుల్ ఐకాన్ కోసం సెర్చ్ చేయండి లేదా ఇన్‌స్టాగ్రామ్ డీఎమ్‌లలో “@”ని ఉపయోగించి మీరు అప్‌డేట్‌ని అందుకున్నారా లేదో లేటెస్ట్‌ అప్‌డేట్ చేశారో చెక్ చేయండి.

Read Also : Realme P1 Pro Sale : కొత్త ఫోన్ కొంటున్నారా? రియల్‌మి పి1 ప్రో సేల్ మొదలైందోచ్.. ఈ స్పెషల్ ధర ఎంతో తెలుసా?