Mark Zuckerberg : అమెరికాకు జుకర్ బర్గ్ వెన్నుపోటు.. చైనాలో బిజినెస్ కోసం చేతులు కలిపి..!

Mark Zuckerberg : మెటా విజిల్‌బ్లోయర్ విన్-విలియమ్స్, సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ గురించి షాకింగ్ విషయాలు వెల్లడించారు. ఆయన 'చైనా ప్రభుత్వంతో చేతులు కలిపి పనిచేస్తున్నారని' ఆరోపించారు.

Mark Zuckerberg

Mark Zuckerberg : ప్రముఖ సోషల్ దిగ్గజం మెటా మాజీ ఎగ్జిక్యూటివ్ సారా విన్-విలియమ్స్ సంస్థ అధినేత మార్క్ జుకర్‌బర్గ్‌పై సంచలన ఆరోపణలు చేశారు. చైనాలో తన వ్యాపారాన్ని పెంచుకునే ప్రయత్నంలో జుకర్‌బర్గ్ అమెరికా జాతీయ భద్రతను ప్రమాదంలో పడేసేరంటూ ఆమె తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పించారు.

అమెరికా ప్రయోజనాల కన్నా మెటా సీఈఓకు డబ్బు ముఖ్యమంటూ ఆమె ఆరోపించారు. సెనేటర్ జోష్ హాలే నేతృత్వంలోని కాంగ్రెస్ విచారణ సందర్భంగా ఆమె వాంగ్మూలంలో ఈ ఆరోపణలు చేశారు. మెటా చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ (CCP) అమెరికన్ పౌరులకు చెందిన సమాచారంతో సహా యూజర్ల వ్యక్తిగత డేటాను యాక్సెస్ చేసేందుకు వీలుగా ఉందని మెటా విజిల్‌బ్లోయర్ ఆరోపించారు.

Read Also : LIC Scheme : LICలో అద్భుతమైన స్కీమ్.. ఒక్కసారి ప్రీమియం చెల్లిస్తే చాలు.. 40ఏళ్ల వయస్సు నుంచే పెన్షన్ తీసుకోవచ్చు..!

చైనాలో బిజినెస్ కోసం మెటా కంపెనీ ఇలాంటి తప్పుడు చర్యలకు దిగుతోందని, చైనాతో జుకర్‌బర్గ్‌ చేతులు కలిపారంటూ ఆమె మండిపడ్డారు. “మెటా ఎగ్జిక్యూటివ్‌లు పదే పదే అమెరికా జాతీయ భద్రతను అణగదొక్కడంతో పాటు అమెరికన్ విలువలకు ద్రోహం చేస్తున్నారు” అని విన్-విలియమ్స్ పేర్కొన్నట్లు సీబీఎస్ న్యూస్ తెలిపింది.

కస్టమ్ సెన్సార్‌షిప్, డేటా భాగస్వామ్యంపై ఆరోపణలు :
మెటా యూజర్ డేటాను యాక్సెస్ చేసేందుకు అనుమతించడమే కాకుండా బీజింగ్ సెన్సార్‌షిప్ ప్రయత్నాలకు సపోర్టు చేస్తోందంటూ విన్-విలియమ్స్ ఆరోపించారు. చైనా ప్రభుత్వం కంటెంట్‌ను నియంత్రించడానికి కంపెనీ కస్టమైజడ్ టూల్స్ నిర్మించిందని ఆమె పేర్కొన్నారు.

“మార్క్ జుకర్‌బర్గ్ ఇప్పటివరకు తాను అమెరికన్ అని, దేశభక్తుడిగా పేర్కొంటూ అమెరికా జెండా కప్పుకుని చైనాలో సేవలను అందించనని చెబుతూనే గత దశాబ్దంలో డ్రాగన్ దేశంలో 18 బిలియన్ డాలర్ల వ్యాపార సామ్రాజ్యాన్ని స్థాపించాడని ఆమె పేర్కొన్నారు. జాతీయ భద్రతా సమస్యలు, సాంకేతిక పోటీ, ఆర్థిక ప్రయోజనాల కోసం అమెరికా, చైనా మధ్య భౌగోళిక రాజకీయ ఘర్షణ తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో ఆమె ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి.

విచారణ సందర్భంగా సెనేటర్ హాలీ ఈ విషయంపై ప్రస్తావించారు. విన్-విలియమ్స్ సాక్ష్యం చెప్పకుండా అడ్డుకునేందుకు మెటా అన్ని ప్రయత్నాలు చేసిందని పేర్కొన్నారు. అయితే, మెటా ఈ ఆరోపణలను తీవ్రంగా తిరస్కరించింది. చైనా మార్కెట్‌లోకి ప్రవేశించడానికి గతంలో ఆసక్తి ఉందని మెటా అంగీకరించినప్పటికీ, ప్రస్తుతం చైనాలో తమ సర్వీసులను అందించడం లేదని ప్రతినిధి ర్యాన్ డేనియల్స్ స్పష్టం చేశారు.

చైనాతో ఏఐ లింకులు, చట్టపరమైన ముప్పు :
మెటా ఓపెన్-సోర్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్, లామా గురించి కూడా ఆందోళనలను లేవనెత్తింది. ఈ మోడల్‌ను చైనీస్ ఏఐ సంస్థ డీప్‌సీక్ ఉపయోగించిందని విన్-విలియమ్స్ ఆరోపించారు. డేటా భద్రత, విదేశీ ప్రభావం గురించి ఆందోళనలను మరింత రేకెత్తించింది.

మెటా ప్రతినిధి ఆండీ స్టోన్ మాత్రం ఈ వాదనను తోసిపుచ్చారు. చైనా ఇప్పటికే అమెరికాను సాంకేతికంగా అధిగమించడానికి ఒక ట్రిలియన్ కన్నా ఎక్కువ పెట్టుబడి పెడుతోందని, చైనీస్ టెక్ కంపెనీలు తమ సొంత ఓపెన్ ఏఐ మోడల్‌లను అమెరికా కన్నా వేగంగా రిలీజ్ చేస్తున్నాయని పేర్కొన్నారు.

ఈ నిజాన్ని బయటపెట్టినందుకు 50వేల డాలర్ల జరిమానా విధిస్తామని తనను బెదిరించారని విన్-విలియమ్స్ పేర్కొన్నారు. దీనిపై మెటా స్పందిస్తూ.. ఈ జరిమానా ఆమె ఉల్లంఘనలకు సంబంధించిందని, అంతేకానీ కాంగ్రెస్ కమిటీతో సంబంధం లేదని స్పష్టం చేసింది.

Read Also : Indian Overseas Bank : లోన్ తీసుకోవాలనుకునే వారికి గుడ్ న్యూస్.. వడ్డీ రేట్లు భారీగా తగ్గించిన ఇండియన్ ఓవర్‌సీస్ బ్యాంక్..!

గతంలో ఫేస్‌బుక్‌లో గ్లోబల్‌ పబ్లిక్‌ పాలసీ డైరెక్టర్‌గా సారా విన్‌ విలియమ్స్‌ విధులు నిర్వర్తించారు. ఏడేళ్లపాటు పనిచేసిన ఆమె 2025 మార్చిలో కేర్‌లెస్‌ పీపుల్‌ పేరిట బుక్ రిలీజ్ చేయడం చర్చనీయాంశంగా మారింది. ఈ పుస్తకంపై మెటా కోర్టును ఆశ్రయించింది. దాంతో ఆ పుస్తకాన్ని తాత్కాలికంగా బ్యాన్ అయింది.