ఫార్చూన్‌ బిజినెస్‌ పర్సన్‌ ఆఫ్‌ ది ఇయర్..సత్య నాదెళ్ల

  • Published By: veegamteam ,Published On : November 21, 2019 / 01:52 AM IST
ఫార్చూన్‌ బిజినెస్‌ పర్సన్‌ ఆఫ్‌ ది ఇయర్..సత్య నాదెళ్ల

Updated On : November 21, 2019 / 1:52 AM IST

ఫోర్బ్స్‌ జాబితాలో మరోసారి తెలుగు వెలుగులు కనిపించాయి. దేశంలోని అత్యంత సంపన్నుల జాబితాలో మైక్రోసాఫ్ట్‌ CEO సత్య నాదెళ్ల.. ఈ ఏడాది ‘ఫార్చూన్‌ బిజినెస్‌ పర్సన్‌ ఆఫ్‌ ది ఇయర్-2019’ జాబితాలో ప్రథమ స్థానాన్ని సొంతం చేసుకున్నారు. ఈ జాబితాలో మొత్తం 20 మంది పేర్లు ఉండగా.. వీరిలో ముగ్గురు భారతీయ సంతతికి చెందిన వారే ఉండడం విశేషం. ఇందులో వార్షిక సంకలనం మాస్టర్ కార్డ్ CEO అజయ్ బంగా, అరిస్టా హెడ్ జయశ్రీ ఉల్లాల్ కూడా ఉన్నారు.   

ఇక తెలుగు వాడైన సత్య నాదెళ్ల తొలి స్థానంలో ఉండడం మరో విశేషం. కొన్నేళ్లుగా మనదేశంలోని కుబేరుల జాబితాలో చోటు దక్కించుకుంటున్న సత్య నాదెళ్ల తన ర్యాంకును ఎప్పటికప్పుడు మెరుగుపర్చుకుంటున్నారు. మాస్టర్‌ కార్డ్‌ CEO బంగా 8వ స్థానంలో ఉండగా, కాలిఫోర్నియా కంప్యూటర్‌ నెట్‌వర్కింగ్‌ సంస్థ అరిస్టా హెడ్‌ జయశ్రీ ఉల్లాల్ 18వ స్థానంలో నిలిచారు.

ఇక ఈ ఏడాది మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో మేఘా ఇంజినీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌ కంపెనీ భారీ లాభాలను ఆర్జించింది. రెవెన్యూ 23 శాతం వృద్ధి చెందడంతో… నెట్ ప్రాఫిట్ 3100 కోట్ల రూపాయలకు చేరింది. లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టుల నిర్మాణాలను సైతం పరుగులు పెట్టిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణాన్ని శరవేగంగా పూర్తిచేశారు. ప్రభుత్వం విధించిన గడువులోపే ప్రాజెక్టును కంప్లీట్ చేసి ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు పొందారు.