India Gold Reserves : భారతీయుల వద్ద బంగారం ఎంతుందో తెలుసా..? దాని మార్కెట్ విలువ ఎంతంటే.. దిమ్మతిరిగి పోవాల్సిందే..
India Gold Reserves : మోర్గాన్ స్టాన్లీ ఒక నివేదికలో తెలిపిన వివరాల ప్రకారం.. 2025 జూన్ నెల నాటికి భారతీయ కుటుంబాల వద్ద నగలు, కడ్డీలు, బిస్కెట్లు, నాణేల రూపంలోG
India Gold Reserves
India Gold Reserves : దేశంలో బంగారం ధరలు ఆకాశమే హద్దుగా దూసుకెళ్తున్నాయి. రోజురోజుకు పెరుగుతున్న గోల్డ్ రేటు సరికొత్త రికార్డులను నమోదు చేస్తోంది. ధరలు చుక్కలంటుతున్నా సరే దేశ ప్రజలు బంగారాన్ని విపరీతంగా కొనుగోలు చేస్తున్నారు.
మోర్గాన్ స్టాన్లీ ఒక నివేదికలో తెలిపిన వివరాల ప్రకారం.. 2025 జూన్ నెల నాటికి భారతీయ కుటుంబాల వద్ద నగలు, కడ్డీలు, బిస్కెట్లు, నాణేల రూపంలో ఉన్న బంగారం నిల్వలు సుమారు 34,600 టన్నులకు చేరినట్లు తెలిపింది. దాని విలువ ప్రస్తుత మార్కెట్‌తో పోలిస్తే 3.8లక్షల కోట్ల డాలర్లు (సుమారు రూ.342 లక్షల కోట్లు) అని నివేదిక పేర్కొంది. ప్రస్తుతం దేశ జీడీపీలో ఇది 88.8శాతానికి సమానం.
గతంలో ప్రజలు బంగారాన్ని ఎక్కువగా ఆభరణాల రూపంలోనే కొనుగోలు చేసేవారు. కేవలం కొద్దిమంది మాత్రమే పెట్టుబడి, లాభాల కోసం కొనేవారు. కానీ, ప్రస్తుతం గోల్డ్ రేటు దూకుడుతో బంగారం నగలు కొనుగోలు కంటే బంగారంపై పెట్టుబడి పెడుతున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని మ్యూచువల్ ఫండ్స్ గోల్డ్ ఈటీఎఫ్‌లు, మల్టీ అసెట్స్‌ఫండ్స్ పేరుతో ప్రత్యేక పథకాలను ప్రారంభించి పెద్దెత్తున నిధులు సమీకరిస్తున్నాయి.
కోటక్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ ఒక నివేదికలో తెలిపిన వివరాల ప్రకారం.. కొనుగోలు చేసిన ఆభరణాల్లో 30 నుంచి 35శాతం విలువకు రాళ్లు, రత్నాలే ఉంటాయి. తరుగు, తయారీ చార్జీలు అదనం. పసిడి ధర ఏటా కనీసం 30శాతం చొప్పున పెరిగితేగానీ ఆభరణాల పెట్టుబడిపై లాభాలు రావు. దీన్ని దృష్టిలో పెట్టుకొని పెట్టుబడి లాభాలకోసం చూసే వారు ఫిజికల్ గోల్డ్ లేదా గోల్డ్ ఈటీఎఫ్‌లలో మదుపు చేయడం మచిందని ఇన్వెస్ట్‌మెంట్ నిపుణులు సూచిస్తున్నారు.
