×
Ad

Most Expensive SmartPhones : వరల్డ్ టాప్ 5 అత్యంత ఖరీదైన స్మార్ట్‌ఫోన్లు.. బిలియనీర్లు ఈ లగ్జరీ ఐఫోన్లనే ఎందుకు ఇష్టపడతారో తెలుసా?

Most Expensive SmartPhones : అత్యంత ఖరీదైన మొబైల్ ఫోన్లలో కేవలం స్పెషిఫికేషన్లు మాత్రమే కాదు.. ఈ ఫోన్లు ప్రాసెసర్లు, కెమెరాలకు మించి ఉంటాయి. లగ్జరీ మెటీరియల్స్‌తో తయారవుతాయి. చేతితో తయారు చేస్తారు. కొద్ది మంది మాత్రమే వాడుతారు.

Most Expensive SmartPhones

Most Expensive SmartPhones : కాస్ట్‌లీ ఫోన్ కొంటున్నారా? చాలామంది లగ్జరీ ఫోన్ అంటే ఆపిల్ ఐఫోన్ లేదా శాంసంగ్ ఫోన్ అనుకుంటారు. వాస్తవానికి బిలియనీర్లు ఈ ఖరీదైన ఫోన్లు అసలు కొనరు. వజ్రాలు పొదిగిన ఐఫోన్ల నుంచి గోల్డ్ పూత ఆండ్రాయిడ్‌ల వరకు ప్రపంచంలోని అత్యంత ఖరీదైన మొబైల్ ఫోన్‌లు చాలానే ఉన్నాయి.

ఇవి కేవలం గాడ్జెట్‌లు కాదు.. ఈ లగ్జరీ ఫోన్లలో కస్టమ్ డిజైన్‌లు, సూపర్‌కార్‌లకు (Most Expensive SmartPhones) పోటీగా ధర ఉంటుంది. ఒక్కమాటలో చెప్పాలంటే బిలియనీర్లకు స్టేటస్ సింబల్ ఫోన్‌లు అనమాట. ప్రపంచంలో అత్యంత ఖరీదైన ఫోన్ ఎవరి వద్ద ఉందో తెలుసా? మీరు లగ్జరీ టెక్ గాడ్జెట్‌ల గురించి తెలుసుకోవాలని ఉంటే మీకోసం ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను అందిస్తున్నాం.

అత్యంత ఖరీదైన లగ్జరీ స్మార్ట్ ఫోన్లు :
మార్కెట్లో ఏదైనా లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్ ఖరీదైనదిగా అనిపిస్తే.. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మొబైల్ ఫోన్లపై ఓసారి లుక్కేయండి. ఈ ఫోన్లు కేవలం గాడ్జెట్లు మాత్రమే కాదు.. డిజైనర్ ఫోన్‌లు, కస్టమ్ లగ్జరీ ఫోన్‌లు, స్టేటస్ సింబల్‌లుగా ఉంటాయి. 24K గోల్డ్, వజ్రాలు, డైనోసార్ ఎముకలతో కూడా రూపొందించి ఉంటాయి. ఈ జాబితాలోని ప్రతి ఫోన్ బిలియనీర్ల కోసం తయారైన అద్భుతమైన కళాఖండాలుగా చెప్పొచ్చు. 2025కి ప్రపంచంలోని టాప్ 5 అత్యంత ఖరీదైన స్మార్ట్ ఫోన్లను ఇప్పుడు చూద్దాం..

1. ఫాల్కన్ సూపర్నోవా ఐఫోన్ 6 పింక్ డైమండ్ : 48.5 మిలియన్ డాలర్లు :
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మొబైల్ ఫోన్. ఫాల్కన్ లగ్జరీ ఈ కస్టమ్ ఐఫోన్ తయారు చేసింది. 24 క్యారెట్ల గోల్డ్ పొదిగి ఉంది. బ్యాక్ సైడ్ అతిపెద్ద గులాబీ వజ్రం ఉంది. భారత బిలియనీర్ ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీకి చెందినదని సమాచారం.

2. ఐఫోన్ 5 బ్లాక్ డైమండ్ : 15.3 మిలియన్ డాలర్లు :

లగ్జరీ డిజైనర్ స్టువర్ట్ హ్యూస్ ఈ లిమిటెడ్ ఎడిషన్ ఫోన్ రూపొందించారు. 600 వైట్ వజ్రాలతో పొదిగి ఉంది. హోమ్ బటన్‌గా 26 క్యారెట్ బ్లాక్ వజ్రాన్ని కలిగి ఉంది. 24K బంగారంతో రూపొందించారు. ఈ ఐఫోన్ తయారీకి ఏకంగా 9 వారాలు పట్టింది.

Read Also : MG Motor Sale 2025 : కొత్త MG కారు కొనేందుకు సువర్ణావకాశం.. ఈ కార్లపై రూ.4 లక్షల వరకు బెనిఫిట్స్.. ఏ మోడల్‌ ధర ఎంత తగ్గిందంటే?

3. స్టువర్ట్ హ్యూస్ ఐఫోన్ 4S ఎలైట్ గోల్డ్ : 9.4 మిలియన్ డాలర్లు :
ఈ హై-ఎండ్ మొబైల్ ఫోన్ గులాబీ కలర్ గోల్డ్ చుట్టబడి 500 కన్నా ఎక్కువ వజ్రాలతో మొత్తం 100+ క్యారెట్లు పొదిగి ఉంది. ఈ ఐఫోన్ స్పెషల్ ఫీచర్లలో 8.6 క్యారెట్ల డైమండ్ హోమ్ బటన్, ప్లాటినం, రియల్ టి-రెక్స్ డైనోసార్ ఎముకతో కేసు తయారు చేశారు.

4. స్టువర్ట్ హ్యూస్ ఐఫోన్ 4 డైమండ్ రోజ్ : 8 మిలియన్ డాలర్లు :
స్టువర్ట్ హ్యూస్ ఐఫోన్ 4 డైమండ్ రోజ్ ప్రపంచంలోని అత్యంత ఖరీదైన మొబైల్ ఫోన్లలో ఒకటి. ఇప్పటివరకు కేవలం 2 యూనిట్లు మాత్రమే తయారయ్యాయి. లగ్జరీ హస్తకళను ఐకానిక్ టెక్నాలజీతో అరుదైన డిజైనర్ ఫోన్. ఈ వజ్రాలు పొదిగిన ఫోన్‌లో 100+ క్యారెట్ల బరువున్న 500 కన్నా ఎక్కువ దోషరహిత వజ్రాలు ఉన్నాయి. హోమ్ బటన్ 7.4-క్యారెట్ పింక్ డైమండ్‌ కలిగి ఉంది. అయితే, ఫ్రేమ్ 22K గోల్డ్, హై-గ్రేడ్ అల్యూమినియం కలిగి ఉంది. ఆపిల్ లోగో కూడా 53 వ్యక్తిగత వజ్రాలతో మెరుస్తుంది. బిలయనీర్లు మెచ్చిన ఫోన్ అని చెప్పొచ్చు.

Goldstriker iPhone 3GS Supreme

5. గోల్డ్‌స్ట్రైకర్ ఐఫోన్ 3GS సుప్రీం : 3.2 మిలియన్ డాలర్లు :
గోల్డ్‌స్ట్రైకర్ ఐఫోన్ 3GS సుప్రీం అనేది లగ్జరీ టెక్ గాడ్జెట్లు, టైమ్‌లెస్ డిజైన్‌లతో అద్భుతమైన ఫోన్. 271 గ్రాముల సాలీడ్ 22-క్యారెట్ గోల్డ్ కలిగి ఉంది. ఇప్పటివరకు అత్యంత సంపన్నమైన ఫోన్‌లలో ఇదొకటిగా నిలిచింది. ఫ్రంట్ సైడ్ 136 మచ్చలేని వజ్రాలు ఉన్నాయి. 7.1 క్యారెట్ సింగిల్ డైమండ్ హోమ్ బటన్ అరుదైన డిజైన్ కలిగి ఉంది. ఆపిల్ లోగో కూడా 53 వజ్రాలతో నిండి ఉంది. లగ్జరీ గ్రానైట్, కాశ్మీర్ గోల్డ్ బాక్సులో కూడా వస్తుంది. ఈ ఫోన్ ప్రపంచంలోని టాప్ 10 అత్యంత ఖరీదైన ఫోన్‌లలో ఒకటిగా చెప్పొచ్చు.