Mother Dairy Milk : రెండు రూపాయలు పెరిగిన పాల ధర…ఎక్కడంటే ?

దేశంలో   నిత్యావసర  వస్తవుల ధరలు రానురాను పెరిగిపోతూ ప్రజలకు పెనుభారంగా మారుతున్నాయి.   యుక్రెయిన్-రష్యా  యుధ్ధం  తర్వాత   మరికొన్ని  నిత్యావసర  వస్తువుల ధరలు పెరుగుతాయనే  వార్తలు 

Mother Dairy Milk : రెండు రూపాయలు పెరిగిన పాల ధర…ఎక్కడంటే ?

Mother Dairy

Updated On : March 5, 2022 / 6:21 PM IST

Mother Dairy Milk :  దేశంలో   నిత్యావసర  వస్తవుల ధరలు రానురాను పెరిగిపోతూ ప్రజలకు పెనుభారంగా మారుతున్నాయి.   యుక్రెయిన్-రష్యా  యుధ్ధం  తర్వాత   మరికొన్ని  నిత్యావసర  వస్తువుల ధరలు పెరుగుతాయనే  వార్తలు  సామాన్యుడికి  కంటి మీద  కునుకు లేకుండా చేస్తున్నాయి.

ఈక్రమంలో   పాల ఉత్పత్తుల సంస్ధలు రోజుల వ్యవధిలో  పాల  ధరను పెంచటానికి పోటీ పడుతున్నాయి. ఇప్పటికే  అమూల్  కంపెనీ  పాల ధరను రెండు రూపాయలు పెంచుతున్నట్లు   ప్రకటించింది.  ఇప్పుడు దేశ వ్యాప్తంగా  100కి  పైగా నగరాల్లో ఉన్న మదర్ డెయిరీ  సైతం పాల  ధరను దేశ రాజధాని ఢిల్లీలో రూ. 2 లు పెంచుతున్నట్లు  ప్రకటించింది.

పెరుగుతున్న రవాణా.. ఇతర ఖర్చుల  కారణంగా  పాలధర  పెంచాల్సి   వస్తున్నట్లు మదర్ డెయిరీ పేర్కోంది.  పెరిగిన  పాల ధర రేపటి నుంచి  (ఆదివారం) అమల్లోకి   వస్తుంది.  దీంతో ప్రస్తుతం రూ.57 ఉన్న మదర్ డెయిరీ పాల  ధర  ఢిల్లీలో  లీటరు ఒక్కింటికి రూ. 59 కానుంది.  టోన్డ్ మిల్క్ ధర 49 కి పెరుగుతుండగా..డబుల్ టోన్డ్ ధరలు 43కి   పెరగ నున్నాయి.
Also Read : Minister Harish Rao : తెలంగాణ కోసం బీజేపీ ఏం చేసింది ? మంత్రి హరీష్ రావు
ఆవు పాల ధర లీటరుకు రూ.49 నుండి రూ.51కి పెరిగింది.  బల్క్ వెండెడ్ మిల్క్ (టోకెన్ మిల్క్) ధర లీటరుకు రూ.44 నుంచి రూ.46 కి పెరిగింది.  హర్యానా, ఉత్తరప్రదేశ్,ఉత్తరాఖండ్‌లలో కూడా  పాల ధరలను మదర్ డెయిరీ  లీటరుకు రూ. 2 పెంచింది.  ఈ ఎంపిక చేసిన ప్రాంతాలకు మించిన మార్కెట్లు దశల  వారీగా సవరించబడతాయి.