Motorola Edge 50 Fusion
Motorola Edge 50 Fusion : మోటోరోలా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. కొత్త మోటోరోలా ఫోన్ కోసం చూస్తున్నారా? అయితే, మోటోరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ బెస్ట్ ఆప్షన్. రూ. 25వేల లోపు (Motorola Edge 50 Fusion) ధరలో ఈ హ్యాండ్‌సెట్ లాంచ్ కాగా ఇప్పుడు అమెజాన్‌లో తగ్గింపు ధరకే లభిస్తోంది.
3D కర్వ్డ్ డిస్‌ప్లే, వీగన్ లెదర్ బ్యాక్ ఫినిషింగ్, సన్నని బెజెల్స్ కలిగి ఉంది. వాటర్, డస్ట్ నిరోధకతకు IP68 రేటింగ్‌తో వస్తుంది. అమెజాన్‌లో ఈ మోటరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ స్మార్ట్‌ఫోన్ రూ. 17,277 లోపు ధరకు సొంతం చేసుకోవచ్చు. ఇంతకీ ఈ డీల్ ఎలా పొందాలో ఇప్పుడు చూద్దాం..
మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ ధర :
అమెజాన్‌లో మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ రూ.4,222 భారీ ధర తగ్గింపు పొందింది. ప్రస్తుతం ఈ మోటోరోలా ఫోన్ అసలు లాంచ్ ధర రూ.22,999 నుంచి రూ.18,777కు అమ్ముడవుతోంది. ఆసక్తిగల యూజర్లు HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌పై రూ.1,500 అదనపు డిస్కౌంట్ పొందవచ్చు. తద్వారా ధర రూ.17,277కు తగ్గుతుంది.
Read Also : Oppo F31 Launch : ఒప్పో F31 సిరీస్ లాంచ్ ఎప్పుడో తెలిసిందోచ్.. ధర, స్పెషిఫికేషన్లపై భారీ అంచనాలివే..!
ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఎంపిక చేసిన బ్యాంకులపై 6 నెలల నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కూడా పొందవచ్చు. మీ పాత ఫోన్ కొత్త మోటో ఎడ్జ్ 50 ఫ్యూజన్ కోసం ఎక్స్ఛేంజ్ మోడల్, వర్కింగ్ కండిషన్ బట్టి రూ.17,500 వరకు ఆదా చేసుకోవచ్చు.
మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ స్పెసిఫికేషన్లు :
మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ 6.7-అంగుళాల FHD+ pOLED డిస్‌ప్లే కలిగి ఉంది. ఈ మోటోరోలా ఫోన్ HDR10+, 144Hz రిఫ్రెష్ రేట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ కలిగి ఉంది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 2 చిప్‌సెట్ ద్వారా అందిస్తుంది. ఈ మోటోరోలా ఫోన్ అడ్రినో 710 GPU, 12GB వరకు LPDDR4X ర్యామ్, 512GB వరకు UFS 2.2 స్టోరేజీని కలిగి ఉంది. సాఫ్ట్‌వేర్ సపోర్టు కోసం ఆండ్రాయిడ్ 14-ఆధారిత కస్టమ్ స్కిన్‌పై రన్ అవుతుంది.
ఫొటోగ్రఫీ విషయానికి వస్తే.. ఈ స్మార్ట్‌ఫోన్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది. ఇందులో 50MP సోనీ IMX700 సెన్సార్ OISతో 13MP అల్ట్రా-వైడ్ కెమెరా ఉన్నాయి. ఫ్రంట్ సైడ్ 32MP సెల్ఫీ కెమెరా కలిగి ఉంది. అదనంగా, ఈ స్మార్ట్‌ఫోన్ 5,000mAh బ్యాటరీతో వస్తుంది. 68W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది.