Motorola Edge 50
Motorola Edge 50 : మోటోరోలా ఫోన్‌పై ఖతర్నాక్ డిస్కౌంట్.. అద్భుతమైన ఫీచర్లతో మిడ్-రేంజ్ మోటోరోలా ఎడ్జ్ 50 ఫోన్ ఆకట్టుకునేలా ఉంది. ఈ హ్యాండ్‌సెట్ ప్రీమియం ఫీచర్లు, డిజైన్ కెమెరా సెటప్ (Motorola Edge 50) మరింత ఆకర్షణీయంగా ఉన్నాయి.
ఫ్లిప్‌కార్ట్‌లో 8GB ర్యామ్, 256GB స్టోరేజ్ వేరియంట్ కొనుగోలుపై రూ. 11వేలకు పైగా డిస్కౌంట్ పొందవచ్చు. ఇక్కడ డిస్కౌంట్ మాత్రమే కాదు.. క్యాష్‌బ్యాక్ కూడా పొందవచ్చు.
Read Also : Vivo Y400 Pro 5G : వివో లవర్స్‌కు పండగే.. ఈ కొత్త 5G ఫోన్ భలే ఉంది భయ్యా.. ఏఐ ఫీచర్ల కోసమైనా కొనాల్సిందే..!
రూ.22వేల లోపు కొత్త ఫోన్ కొనేవారికి మోటోరోలా ఎడ్జ్ 50 బెస్ట్ ఆఫర్. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఎడ్జ్ 50 డీల్ ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
మోటోరోలా ఎడ్జ్ 50 డీల్ :
ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో మోటోరోలా ఎడ్జ్ 50 ఫోన్ రూ.11వేలు తగ్గింది. దాంతో ఫైనల్ ధర రూ.21,999కే కొనేసుకోవచ్చు. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ క్రెడిట్ కార్డులపై రూ.1,100 వరకు క్యాష్‌బ్యాక్ పొందవచ్చు.
ఎంపిక చేసిన బ్యాంక్ క్రెడిట్ కార్డులపై కస్టమర్లు నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కూడా పొందవచ్చు. పాత ఫోన్లపై ఎక్స్ఛేంజ్ చేయడం ద్వారా రూ.29,400 వరకు డిస్కౌంట్ కూడా పొందవచ్చు.
మోటోరోలా ఎడ్జ్ 50 స్పెసిఫికేషన్లు (Motorola Edge 50) :
మోటోరోలా ఎడ్జ్ 50 ఫోన్ 6.6-అంగుళాల P-OLED ప్యానెల్‌తో 1.5K రిజల్యూషన్, HDR10+ సపోర్ట్, 120Hz వరకు రిఫ్రెష్ రేట్, 1600 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. ఈ మోటోరోలా ఫోన్ గొరిల్లా గ్లాస్ 5 ద్వారా కూడా ప్రొటెక్షన్ అందిస్తుంది.
8GB ర్యామ్, 256GB స్టోరేజ్‌తో స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 1 AE (యాక్సిలరేటెడ్ ఎడిషన్) ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 14-ఆధారిత హలో యూఐ అవుట్-ఆఫ్-ది-బాక్స్‌పై రన్ అవుతుంది.
ఫొటోగ్రఫీ విషయానికి వస్తే.. ఈ మోటోరోలా ఫోన్ ట్రిపుల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS)తో కూడిన 50MP మెయిన్ కెమెరా, 13MP అల్ట్రావైడ్ లెన్స్, 3x ఆప్టికల్ జూమ్‌తో కూడిన 10MP టెలిఫోటో సెన్సార్ ఉన్నాయి.
సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం మోటోరోలా ఎడ్జ్ 50లో 32MP సెల్ఫీ షూటర్ ఉంది. మోటోరోలా ఎడ్జ్ 50 ఫోన్ 68-వాట్ల వరకు ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. 5000mAh బ్యాటరీని కలిగి ఉంది.