Motorola Edge 50 Pro 5G : మోటోరోలా ఫోన్ క్రేజ్ ఇదే.. ఫ్లిప్‌కార్ట్‌లో అతి తక్కువ ధరకే మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో కొనేసుకోవచ్చు..
Motorola Edge 50 Pro 5G : కొత్త మోటోరోలా 5G ఫోన్ అదిరిపోయింది.. ఫ్లిప్‌కార్ట్‌లో అతి తక్కువ ధరకే మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో సొంతం చేసుకోండి.

Motorola Edge 50 Pro 5G
Motorola Edge 50 Pro 5G : కొత్త స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా? మీరు రూ.30వేల లోపు ధరలో స్టైలిష్ ఫోన్ కోసం చూస్తుంటే ఇదే సరైన టైమ్.. మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో తక్కువ ధరకే కొనేసుకోవచ్చు.
ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్ రూ.8వేలు ఫ్లాట్ ధర తగ్గింపుతో రూ.28వేలు లోపు అమ్ముడవుతోంది. ఈ ఫోన్ గత ఏడాది ఏప్రిల్‌లో బేస్ 8GB+128GB కాన్ఫిగరేషన్ కోసం రూ.35,999 ప్రారంభ ధరతో లాంచ్ అయింది.
ఈ హ్యాండ్‌సెట్ కర్వ్డ్ OLED డిస్‌ప్లే ఏఐ పవర్డ్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. కొత్త మిడ్-రేంజ్ ఫోన్ కోసం చూస్తున్న కొనుగోలుదారులు ఫ్లిప్‌కార్ట్‌లో ఈ లిమిటెడ్ టైమ్ మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో డీల్‌ను సొంతం చేసుకోవచ్చు.
ఫ్లిప్‌కార్ట్‌లో మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో ఆఫర్ :
ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో రూ.27,999 ధరకు లిస్ట్ అయింది. లాంచ్ ధరపై ఫ్లాట్ రూ.8వేలు తగ్గింపు లభిస్తుంది. కస్టమర్లు తమ ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌పై 5శాతం క్యాష్‌బ్యాక్‌ను కూడా పొందవచ్చు.
అదనంగా, నెలకు రూ.985 నుంచి ప్రారంభమయ్యే ఈఎంఐ ఆప్షన్ పొందవచ్చు. ఇంకా, కొనుగోలుదారులు తమ పాత ఫోన్లను ఎక్స్ఛేంజ్ చేసుకోవచ్చు. వర్కింగ్ కండిషన్, మోడల్ ఆధారంగా రూ. 17,750 వరకు తగ్గింపు పొందవచ్చు.
మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో స్పెసిఫికేషన్లు :
మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో 6.7-అంగుళాల 1.5K pOLED కర్వ్డ్ డిస్‌ప్లేను 144hz రిఫ్రెష్ రేట్, HDR10+ సపోర్ట్, 2,000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో కలిగి ఉంది.
ఈ హ్యాండ్‌సెట్ స్నాప్‌డ్రాగన్ 7 జనరేషన్ 3ని 12GB వరకు ర్యామ్, 256GB స్టోరేజ్‌తో వస్తుంది. ఆండ్రాయిడ్ 14-ఆధారిత HelloUI ప్రీ-ఇన్‌స్టాల్‌తో వస్తుంది.
మోటోరోలా ఎడ్జ్ 50 ప్రోలో 50MP ప్రైమరీ సెన్సార్, 13MP అల్ట్రావైడ్ లెన్స్, 3x ఆప్టికల్ జూమ్‌తో 10MP టెలిఫోటో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్‌ల కోసం ఈ స్మార్ట్‌ఫోన్‌లో 50MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంది.
ఈ మోటోరోలా ఫోన్ 4,500mAh బ్యాటరీతో రన్ అవుతుంది. 125W ఫాస్ట్ వైర్డ్ ఛార్జింగ్, 50W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. స్ప్లాష్, డస్ట్ రెసిస్టెన్స్ కోసం IP68-రేటెడ్ కూడా అందిస్తుంది.