Motorola Edge 60 Stylus
Motorola Edge 60 Stylus : కొత్త స్మార్ట్ ఫోన్ కొంటున్నారా? మీరు మోటోరోలా అభిమాని అయితే.. మీ బడ్జెట్ ధరలోనే మోటోరోలా కొత్త ఫోన్ కొనేసుకోవచ్చు. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బచత్ డేస్ సేల్ సందర్భంగా ఆకర్షణీయమైన ఫీచర్లతో మోటోరోలా ఎడ్జ్ 60 స్టైలస్ స్మార్ట్‌ఫోన్ సొంతం చేసుకోవచ్చు.
ఈ సేల్ సమయంలో మోటోరోలా ఎడ్జ్ 60 స్టైలస్ 256GB స్టోరేజీ ఫోన్ ఇప్పుడు రూ. 22,999కు లభిస్తుంది. అసలు ధర రూ. 28,999 ఉండగా దీనిపై రూ. 6వేలు తగ్గింపు అందిస్తోంది.
అదనపు బ్యాంక్, ఎక్స్ఛేంజ్ ఆఫర్లతో ఈఎంఐ కేవలం రూ. 711 నుంచి ప్రారంభమవుతుంది. మీరు తక్కువ ధరకే మోటోరోలా ఎడ్జ్ 60 స్టైలస్‌ను పొందవచ్చు. రూ. 711 క్రెడిట్ కార్డ్ లేదా బజాజ్ ఫిన్‌సర్వ్ నుంచి ఈఎంఐ ఆప్షన్ ఎంచుకోవచ్చు.
ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ హోల్డర్లు 5 శాతం క్యాష్‌బ్యాక్‌ను పొందవచ్చు. కస్టమర్లు పాత ఫోన్ వర్కింగ్ కండిషన్, మోడల్ ఆధారంగా ఎక్స్ఛేంజ్ ఆఫర్ ద్వారా రూ.21,300 వరకు తగ్గింపు పొందవచ్చు.
మోటోరోలా ఎడ్జ్ 60 స్టైలస్ టాప్ స్పెషిఫికేషన్లు :
మోటోరోలా ఎడ్జ్ 60 స్టైలస్ ఎకో-లెదర్ ఫినిషింగ్, IP68-రేటెడ్ డిజైన్‌తో వస్తుంది.
డిస్‌ప్లే : 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7-అంగుళాల P-OLED డిస్‌ప్లే
ప్రాసెసర్ : క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 7s జనరేషన్ 2 చిప్‌సెట్
8GB ర్యామ్, 256GB ఇంటర్నల్ స్టోరేజ్
ఫోటోగ్రఫీ : 50MP, 13MP డ్యూయల్ రియర్ కెమెరా సెటప్
ఫ్రంట్ సైడ్ సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32MP షూటర్ ఉంది.
ఆపరేటింగ్ సిస్టమ్ : ఆండ్రాయిడ్ 15 OSపై రన్ అవుతుంది.
బ్యాటరీ : లాంగ్ టైమ్ పర్ఫార్మెన్స్ కోసం 5,000mAh బ్యాటరీ సపోర్టు
Read Also : Apple iPhone 16e : బిగ్ డిస్కౌంట్.. భారీగా తగ్గిన ఐఫోన్ 16.. ఇలా చేస్తే ఇంకా తక్కువ ధరకే కొనేసుకోవచ్చు!
మోటోరోలా ఎడ్జ్ 60 స్టైలస్ ప్రస్తుతం అత్యుత్తమ మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్ డీల్‌లలో ఒకటి. మీ ఫోన్ అప్‌గ్రేడ్ చేస్తున్నా లేదా ఎక్స్ఛేంజ్ చేస్తున్నా 2025 స్మార్ట్‌ఫోన్ లైనప్‌లో ఇదే బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు.