Apple iPhone 16e : బిగ్ డిస్కౌంట్.. భారీగా తగ్గిన ఐఫోన్ 16.. ఇలా చేస్తే ఇంకా తక్కువ ధరకే కొనేసుకోవచ్చు!

Apple iPhone 16e : కొత్త ఆపిల్ ఐఫోన్ కొంటున్నారా? ఐఫోన్ 16e ధర భారీగా తగ్గింది. ఈ అద్భుతమైన డీల్ ఎలా పొందాలంటే?

Apple iPhone 16e : బిగ్ డిస్కౌంట్.. భారీగా తగ్గిన ఐఫోన్ 16.. ఇలా చేస్తే ఇంకా తక్కువ ధరకే కొనేసుకోవచ్చు!

Apple iPhone 16e

Updated On : May 13, 2025 / 5:04 PM IST

Apple iPhone 16e : మీరు కొత్త ఐఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే, ఇది మీకోసమే.. విజయ్ సేల్స్ ఐఫోన్ 16eపై భారీ డిస్కౌంట్ అందిస్తోంది. గతంలో కన్నా సరసమైన ధరకే సొంతం చేసుకోవచ్చు.

Read Also : Samsung Galaxy S25 Edge : ఐఫోన్ 17 ఎయిర్‌కు పోటీగా శాంసంగ్ గెలాక్సీ S25 ఎడ్జ్ ఫోన్.. అల్ట్రా స్లిమ్ డిజైన్ కేక.. ధర ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే!

ఈ ఐఫోన్ కొనుగోలుపై రూ. 10,500 కన్నా ఎక్కువ ఆదా చేసుకోవచ్చు. మీ ప్రస్తుత ఫోన్ అప్‌గ్రేడ్ చేస్తున్నా లేదా మొదటిసారి ఐఫోన్‌కు మారుతున్నా ఈ ఆఫర్ ఓసారి చెక్ చేసుకోండి. ఈ డీల్ ఎలా పనిచేస్తుందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

ఐఫోన్ 16e డీల్ :
భారత మార్కెట్లో ఆపిల్ ఐఫోన్ 16e మోడల్ రూ.59,900 ప్రారంభ ధరకు లాంచ్ అయింది. ప్రస్తుతం విజయ్ సేల్స్ అధికారిక వెబ్‌సైట్‌లో ఈ స్మార్ట్‌ఫోన్ రూ.53,290కి జాబితా అయింది.

రిటైలర్ ఐఫోన్ 16eపై రూ.6,610 ఫ్లాట్ డిస్కౌంట్‌ను అందిస్తోంది. అలాగే, ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్/డెబిట్ కార్డ్, యాక్సస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, కోటాక్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఈఎంఐ లావాదేవీలపై అదనంగా రూ. 4వేలు తగ్గింపు పొందవచ్చు.

ఐఫోన్ 16e స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
ఆపిల్ ఐఫోన్ 16e ఫోన్ 60Hz రిఫ్రెష్ రేట్‌తో 6.1-అంగుళాల OLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ ఫోన్ అల్యూమినియం డిజైన్, ఫేస్ ఐడీ సపోర్ట్‌ను కలిగి ఉంది.

హుడ్ కింద ఐఫోన్ 16e ఆపిల్ A18 చిప్‌సెట్ ద్వారా పవర్ పొందుతుంది. ఆప్టిక్స్ పరంగా ఐఫోన్ 16e 2x ఆప్టికల్ జూమ్‌తో 48MP మెయిన్ కెమెరా, 12MP ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది.

Read Also : iOS 18.5 Update : ఆపిల్ లవర్స్‌కు పండగే.. iOS 18.5 అప్‌డేట్ ఆగయా.. ఏయే ఐఫోన్లలో సపోర్టు చేస్తుంది? డౌన్‌లోడ్ చేయండిలా..!

ఈ ఐఫోన్ ఇమేజ్ క్లీనప్ టూల్, ఇమేజ్ ప్లేగ్రౌండ్, చాట్‌జీపీటీ ఇంటిగ్రేషన్, రైటింగ్ టూల్స్ వంటి అనేక రకాల ఏఐ ఫీచర్లను అందిస్తుంది. ఇంకా, ఆపిల్ ఐఫోన్ 16e USB-C పోర్ట్‌ను కలిగి ఉంది. IP68 సర్టిఫికేట్ పొందింది.