Motorola Edge 60 Stylus
Motorola Edge 60 Stylus : మోటోరోలా అభిమానులకు గుడ్ న్యూస్.. మోటోరోలా లేటెస్ట్ మిడ్-రేంజ్ ఆఫర్ అదిరింది.. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో మోటోరోలా ఎడ్జ్ 60 స్టైలస్ ఫోన్ (Motorola Edge 60 Stylus) అతి తక్కువ ధరకే అందుబాటులో ఉంది. ఏప్రిల్ 2025లో లాంచ్ అయిన ఈ ఫోన్ ఇంటర్నల్ స్టైలస్, డిజైన్, ఫీచర్-ప్యాక్డ్ పర్ఫార్మెన్స్ అందిస్తుంది. లిమిటెట్ ఆఫర్ బ్యాంక్, ఎక్స్ఛేంజ్ ఆఫర్లతో కొనుగోలుదారులు కేవలం రూ. 10,899 కన్నా తక్కువ ధరకు సొంతం చేసుకోవచ్చు.
ఫ్లిప్‌కార్ట్‌లో మోటోరోలా ఎడ్జ్ 60 స్టైలస్ డీల్ :
మోటోరోలా ఎడ్జ్ 60 స్టైలస్ ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో అధికారికంగా ధర రూ.22,999కు లభ్యమవుతుంది. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా 5 శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. అంటే.. రూ.1,150 తగ్గింపు పొందదవచ్చు. దాంతో ఫోన్ ధర రూ.21,849కి తగ్గుతుంది.
పాత ఫోన్‌ను ఎక్స్చేంజ్ చేసుకుంటే ఈ డీల్ ఇంకా తగ్గుతుంది. ఉదాహరణకు.. మోటోరోలా ఎడ్జ్ 40తో ట్రేడింగ్ చేస్తే.. రూ. 10,950 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ లభిస్తుంది. కార్డ్, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు పొందవచ్చు. దాంతో ఈ మోటోరోలా ఫోన్ ధర కేవలం రూ. 10,899కి లభిస్తుంది.
మోటోరోలా ఎడ్జ్ 60 స్టైలస్ స్పెక్స్, ఫీచర్లు :
మోటోరోలా ఎడ్జ్ 60 స్టైలస్ అత్యుత్తమ ఫీచర్లలో ఇంటర్నల్ స్టైలస్ కూడా ఉంది. క్విక్ నోట్స్, స్కెచ్‌లు, ఆన్-స్క్రీన్ నావిగేషన్ కోసం వాడుకోవచ్చు. ఈ ఫోన్ MIL-STD 810H సర్టిఫికేషన్‌తో కూడా వస్తుంది. IP68 రేటింగ్ కలిగి ఉంది. 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.67-అంగుళాల 1.5K pOLED డిస్‌ప్లే, 3000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. మీడియా, అవుట్‌డోర్ వినియోగానికి బెస్ట్ ఫోన్. ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 2 చిప్‌సెట్ కలిగి ఉంది. 8GB ర్యామ్, 256GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది.
కెమెరా విషయానికి వస్తే.. ఈ ఫోన్‌లో OISతో కూడిన 50MP సోనీ LYTIA 700C మెయిన్ కెమెరా, 13MP అల్ట్రా-వైడ్ లెన్స్, సెల్ఫీల కోసం 32MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. 68W వైర్డు, 15W వైర్‌లెస్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంది.
మోటోరోలా హలో యూఐతో ఆండ్రాయిడ్ 15పై రన్ అవుతుంది. ఈ ఫోన్, క్యాచ్ మీ అప్, రిమెంబర్ దిస్ మ్యాజిక్ కాన్వాస్ వంటి మోటో ఏఐ ఫీచర్లతో వస్తుంది. జిబ్రాల్టర్ సీ, సర్ఫ్ ది వెబ్ వంటి ఆకర్షణీయమైన PANTONE కలర్ ఆప్షన్లలో పొందవచ్చు. రూ. 11వేల లోపు ధరలో స్టైలిష్ స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తుంటే ఈ లిమిటెడ్ డీల్ అసలు మిస్ చేసుకోవద్దు.