Jio Mutual Fund
Jio Mutual Fund : పెట్టుబడిదారులకు గుడ్ న్యూస్.. మ్యూచువల్ ఫండ్లలో ఇన్వెస్ట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారా? ఇప్పుడు మీరు జియో ఫైనాన్స్ లేదా (MyJio) యాప్ ద్వారా సులభంగా పెట్టుబడి పెట్టవచ్చు.
నివేదికల ప్రకారం.. జియోఫైనాన్స్ యాప్‌లో అకౌంట్ క్రియేట్ చేయడం ద్వారా ఇప్పుడు మ్యూచువల్ ఫండ్ స్కీమ్‌లో లేదా జియో బ్లాక్‌రాక్ అసెట్ (Jio BlackRock Mutual Fund) మేనేజ్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ రాబోయే NFOలో పెట్టుబడి పెట్టవచ్చు. జియోఫైనాన్స్ యాప్‌లో ఇందుకోసం ఇన్వెస్ట్‌మెంట్ అనే కొత్త ట్యాబ్ అందుబాటులో ఉంది.
జియో బ్లాక్‌రాక్ అసెట్ మేనేజ్‌మెంట్ ఫస్ట్ న్యూ ఫండ్ ఆఫర్ (NFO)లో మొత్తం రూ. 17,800 కోట్లకుపైగా పెట్టుబడిని పొందింది. ఈ కంపెనీ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ (JFSL), బ్లాక్‌రాక్ మధ్య 50:50 జాయింట్ వెంచర్ కలిగి ఉంది. ఓవర్‌నైట్ ఫండ్, లిక్విడ్ ఫండ్, మనీ మార్కెట్ ఫండ్ అనే 3 క్యాష్, లోన్ ఫండ్లలలో పెట్టుబడి పెట్టవచ్చు. న్యూ ఫండ్ ఆఫర్ తర్వాత ఈ మ్యూచువల్ ఫండ్లలో ఎవరైనా సులభంగా పెట్టుబడి పెట్టవచ్చు.
అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలి? :
మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టడం చాలా ఈజీ. ముందుగా మీరు JioFinance యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. యాప్ ఓపెన్ చేశాక హోమ్‌పేజీలో ‘Invest’ ట్యాబ్‌పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత, మీ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. పెట్టుబడి ప్రాసెస్ మొదలు పెట్టవచ్చు.
ఈ 3 రోజుల న్యూ ఫండ్ ఆఫర్ (NFO) అనేది జూన్ 30, 2025న ప్రారంభమైంది. 90 కన్నా ఎక్కువ సంస్థాగత పెట్టుబడిదారుల నుంచి పెట్టుబడులను ఆకర్షించింది. ఇందులో డేటా ఆధారిత పెట్టుబడి, డిజిటల్ ఫోకస్ వంటివి ఉన్నాయి.
అవసరమైనప్పుడు డబ్బులు విత్‌డ్రా చేయొచ్చు :
ఈ మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టడం ద్వారా పెట్టుబడిదారులు అనేక సౌకర్యాలు పొందవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు డబ్బును విత్‌డ్రా చేసుకోవచ్చు. తమ అవసరానికి అనుగుణంగా ఆ డబ్బులను వాడుకోవచ్చు. ఈ ఫండ్స్ ఇన్వెస్ట్‌మెంట్ పోర్ట్ పోలియోస్, కంపెనీ ట్రెజరీ డిపార్ట్‌మెంట్స్, రిటైల్ ఇన్వెస్టర్లతో సహా అందరికీ ఉపయోగకరంగా ఉంటాయి.
జియో బ్లాక్‌రాక్ (Jio BlackRock) అసెట్ మేనేజ్‌మెంట్ దేశంలోని టాప్ 15 అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీలలో (AMC) చేరింది. ప్రస్తుతం దేశంలో మొత్తం 47 ఫండ్ హౌస్‌లు ఉన్నాయి. పెట్టుబడిదారులు తమ అవసరాలకు అనుగుణంగా లిక్విడిటీ, రిస్క్, రాబడి కోసం ఎంచుకోవచ్చు.