Jio 5 Cheapest Plans : పండగ చేస్కోండి.. జియో 5 చీపెస్ట్ రీఛార్జ్ ప్లాన్లు ఇవే.. హైస్పీడ్ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్, మరెన్నో బెనిఫిట్స్..!

Jio 5 Cheapest Plans : జియో తమ యూజర్ల కోసం సరసమైన ధరలో రీఛార్జ్ ప్లాన్లను అందిస్తోంది. రూ.350 లోపు ధరలో జియో 5 బెస్ట్ ప్లాన్లపై లుక్కేయండి..

Jio 5 Cheapest Plans : పండగ చేస్కోండి.. జియో 5 చీపెస్ట్ రీఛార్జ్ ప్లాన్లు ఇవే.. హైస్పీడ్ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్, మరెన్నో బెనిఫిట్స్..!

Reliance Jio

Updated On : July 9, 2025 / 12:14 PM IST

Jio 5 Cheapest Plans : రిలయన్స్ జియో అత్యంత సరసమైన రీఛార్జ్ ప్లాన్లను అందిస్తోంది. జియో ఇటీవలే అనేక ప్రీపెయిడ్ ప్లాన్‌ల ధరల్లో మార్పులు చేసింది. ఈ జియో ప్లాన్‌లలో 5G డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్, SMS, అదనపు బెనిఫిట్స్ పొందవచ్చు. రూ.350 లోపు ధరలో జియో కొన్ని బెస్ట్ రీఛార్జ్ ప్లాన్‌లను అందిస్తోంది. రోజుకు 1.5GB డేటాతో పాటు నెల మొత్తం ఫోన్ కాల్స్ చేసుకోవచ్చు. జియో ప్లాన్‌ల జాబితాను ఓసారి లుక్కేయండి..

1. జియో రూ.329 ప్లాన్ :
రిలయన్స్ జియో ఈ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌లో రోజుకు 1.5 GB డేటా పొందవచ్చు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులు ఉంటుంది. ఈ ప్లాన్‌లో మొత్తం 42GB డేటా అందుబాటులో ఉంది. అదే సమయంలో అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజువారీ 100 SMS బెనిఫిట్స్ పొందవచ్చు. ఈ ప్లాన్ ప్రత్యేకత ఏమిటంటే.. JioSaavn సబ్‌స్క్రిప్షన్ ఈ ప్లాన్‌తో అందుబాటులో ఉంది. ఇతర బెనిఫిట్స్ విషయానికి వస్తే.. జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ సబ్‌స్క్రిప్షన్ అందుబాటులో ఉంది.

2. జియో రూ.319 ప్లాన్ :
రిలయన్స్ జియో రూ.319 రీఛార్జ్ ప్లాన్‌లో వినియోగదారులు రోజుకు 1.5GB డేటాను పొందవచ్చు. ఈ జియో రీఛార్జ్ ప్లాన్ మొత్తం క్యాలెండర్ నెలకు 30 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఈ ప్లాన్‌లో మొత్తం 45GB డేటాను పొందవచ్చు. దేశవ్యాప్తంగా ఏ నెట్‌వర్క్‌లోనైనా ఫ్రీ కాలింగ్ బెనిఫిట్స్ పొందవచ్చు. బెనిఫిట్స్ విషయానికి వస్తే.. జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్‌ యాక్సెస్ చేయొచ్చు.

Read Also : Apple iOS 26 Beta 3 : ఆపిల్ లవర్స్ మీకోసమే.. కొత్త ఫీచర్లతో iOS 26 బీటా 3 డౌన్‌లోడ్‌.. ఐఫోన్లలో ఎలా ఇన్‌స్టాల్ చేయాలంటే?

3. జియో రూ.299 ప్లాన్ :
ఈ జియో ప్లాన్‌లో ప్రతిరోజూ 1.5 GB డేటా పొందవచ్చు. ఈ ప్లాన్ 28 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. మొత్తం 42GB డేటా పొందవచ్చు. ఈ ప్లాన్‌తో రీఛార్జ్ చేయడం ద్వారా వినియోగదారులు 28 రోజుల పాటు అన్‌లిమిటెడ్ కాల్స్ చేయొచ్చు. ప్రతిరోజూ 100 SMS పొందవచ్చు. ఈ ప్లాన్ జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్‌లను కూడా యాక్సెస్ చేయొచ్చు.

4. జియో రూ.239 ప్లాన్ :
ఈ జియో ప్లాన్ అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్ ఫీచర్‌తో వస్తుంది. వ్యాలిడిటీ 22 రోజులు ఉంటుంది. వినియోగదారులు రోజుకు 1.5GB డేటా, మొత్తం 33GB డేటాను పొందవచ్చు. అలాగే, ఈ ప్లాన్‌లో ప్రతిరోజూ 100 ఫ్రీ SMS బెనిఫిట్స్ పొందవచ్చు. జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్‌ కూడా యాక్సెస్ చేయొచ్చు.

5. జియో రూ. 199 ప్లాన్ :
ఈ జియో ప్లాన్‌లో ప్రతిరోజూ 1.5GB డేటా, 100SMS, 18 రోజుల వ్యాలిడిటీతో అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్ పొందవచ్చు. ఈ ప్లాన్ ధర కేవలం రూ. 199 మాత్రమే. ఎప్పుడైనా రీఛార్జ్ చేసుకోవచ్చు. ఏదైనా డిజిటల్ పేమెంట్ యాప్ నుంచి కూడా రీఛార్జ్ చేసుకోవచ్చు. జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ సబ్‌స్క్రిప్షన్ కూడా పొందవచ్చు.