Income Tax Rules 2026 : కొత్త ఇన్కమ్ టాక్స్ రూల్స్.. అసలు పాన్ కోట్ ఎందుకు చేయాలి? పాన్ కార్డు ఎప్పుడు అవసరం?
New Income Tax Rules 2026 : టాక్స్ పేయర్లు, పౌరులకు సంబంధించి త్వరలోనే కొత్త ఆదాయపు పన్ను 2026 జట్టుం ఏప్రిల్ 1 నుంచి అందుబాటులోకి రానుంది. అదేంటి బెనిఫిట్స్ ఏంటో తెలుసుకుందాం..
New Income Tax Rules 2026 ( Image Credit to Original Source )
- టాక్స్ పేయర్లకు బిగ్ అలర్ట్
- పాన్ కార్డు కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి
- ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆర్థిక చట్టం అమల్లోకి
- చిన్న మొత్తంలో లావాదేవీలకు నో పాన్ కార్డు
New Income Tax Rules 2026: పన్నుచెల్లింపుదారులకు బిగ్ అప్డేట్.. 2026లో త్వరలో పాన్ కార్డు కొత్త రూల్స్ రాబోతున్నాయి. ఇప్పటికే, ఆదాయపు పన్ను శాఖ కొత్త ముసాయిదా నిబంధలను జారీ చేసింది. ఏప్రిల్ 1, 2026 నుంచి కొత్త ఆర్థిక చట్టం అమల్లోకి రానుంది.
ఈ కొత్త ఆదాయపు పన్ను చట్టం 2025 కింద ఈ పాన్ కార్డు రూల్స్ రూపొందించారు. పాన్ కార్డు కొత్త రూల్స్ ద్వారా చిన్న లావాదేవీలు చేసేవారికి బిగ్ రిలీఫ్ అందనుంది. ఈ నియమాలు ప్రస్తుతం ముసాయిదా దశలో ఉన్నాయి. మార్చి మొదటి వారం నాటికి ఖరారు చేసే అవకాశం కనిపిస్తోంది.
కొత్త ప్రతిపాదన ప్రకారం.. బ్యాంకులో క్యాష్ డిపాజిట్ చేసేటప్పుడు లేదా డబ్బులు తీసే సమయంలో అందించే పాన్ కార్డు రూల్స్ మారనున్నాయి. దీని వెనుక అసలు రీజన్ ఏంటంటే.. లావాదేవీ పరిమితులను భారీగా పెంచాలనే ఉద్దేశంతోనే ఈ కొత్త రూల్ అమల్లోకి తీసుకురావాలని కేంద్రం యోచిస్తోంది.
మోటారు వాహనాల అమ్మకం లేదా కొనుగోళ్ల నుంచి బ్యాంకుల్లో క్యాష్ డిపాజిట్లు, విత్‌డ్రాలు, హోటల్ బిల్లుల చెల్లింపు వంటివి పాన్ కార్డు కోట్ చేయాల్సి ఉంటుందా? లేదా అనేది త్వరలో తేలనుంది.
ప్రతిపాదిత నియమం (రూల్ 159) ప్రాకరం.. కొన్ని ఆర్థిక లావాదేవీలపై పాన్ కోట్ చేయాల్సిన అవసరం ఉండకపోవచ్చు. అయితే, ముసాయిదా నియమాలపై తమ అభిప్రాయాన్ని సమర్పించేందుకు పన్ను చెల్లింపుదారులు, నిపుణులు, ఇండస్ట్రీ వాటాదారులకు ప్రభుత్వం ఫిబ్రవరి 22, 2026 వరకు సమయం ఇచ్చింది.
ఈ పాన్ కోట్ ఎందుకు అవసరం? :
వాస్తవానికి, గతంలో తక్కువ మొత్తంలో లావాదేవీలపై కూడా పాన్ కోట్ చేయడం తప్పనిసరి. అందులో ప్రధానంగా రూ. 5 లక్షల లోపు వాడిన వాహనం లేదా మోటార్ సైకిల్ కొనుగోలు, సాధారణ క్యాష్ డిపాజిట్లు లేదా రోజువారీ అధిక-ఫ్రీక్వెన్సీ పేమెంట్లు ఉన్నాయి. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే తక్కువ వాల్యూ పేమెంట్లపై పాన్ కార్డు సమర్పించాల్సిన అవసరం ఉండదు.
ముసాయిదా నియమ ప్రతిపాదనలివే :
- మోటారు వాహనాల చట్టం కింద రిజిస్ట్రేషన్ కలిగిన అన్ని వాహనాలకు ముసాయిదా నియమం వర్తిస్తుంది.
- పేమెంట్ వాల్యూ లిమిట్ రూ. 5 లక్షలుగా నిర్ణయించింది.
- లావాదేవీ విలువ రూ. 5 లక్షలు దాటితే పాన్ కార్డు తప్పనిసరిగా అందించాలి.
- లావాదేవీ విలువ రూ. 5 లక్షల కన్నా తక్కువ ఉంటే పాన్ అక్కర్లేదు.
- ఒక వ్యక్తి ఒకటి కన్నా ఎక్కువ అకౌంట్లలో ఆర్థిక సంవత్సరంలో రూ. 10 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ క్యాష్ డిపాజిట్లు లేదా విత్ డ్రా చేస్తే ఇప్పుడు పాన్ కోట్ తప్పనిసరి అవుతుంది.
- ప్రస్తుతం, బ్యాంకింగ్ కంపెనీ లేదా సహకార బ్యాంకులో ఏ రోజునైనా రూ. 50వేల కన్నా ఎక్కువ క్యాష్ డిపాజిట్లకు పాన్ అవసరం పడుతుంది.
- అదే హోటల్ విషయానికి వస్తే.. రెస్టారెంట్, కన్వెన్షన్ సెంటర్, బాంకెట్ హాల్ బిల్లులు రూ. లక్ష దాటితే కూడా పాన్ కార్డు తప్పనిసరి.
- ఇలాంటి సందర్భాలలో పాన్ కోట్ చేసేందుకు ప్రస్తుత పరిమితి రూ. 50వేలు మాత్రమే.
- ఏదైనా స్థిరాస్తి అమ్మడం లేదా కొన్నా గిఫ్ట్ ఇచ్చినా ఆ లావాదేవీ విలువ రూ. 20 లక్షలు దాటితే పాన్ కార్డు తప్పనిసరి. అయితే ప్రస్తుత పరిమితి రూ. 10 లక్షలుగా ఉంది.
- ఇకపై ఇన్సూరెన్స్ కంపెనీలో బీమా తీసుకున్నా కూడా అకౌంట్ ఆధారిత ప్రక్రియ కోసం పాన్ కార్డు తప్పనిసరి.
- ప్రస్తుతం, జీవిత బీమా ప్రీమియంలురూ. 50వేల కన్నా ఎక్కువ పేమెంట్లకు పాన్ అవసరం.
- యజమానులు అందించే రెమ్యునరేషన్ వాల్యూ పెంచాలని ముసాయిదా ప్రతిపాదిస్తుంది.
- ఫ్రీ ఫుడ్, మద్యపానరహిత పానీయాల్లో రెమ్యునరేష్ వాల్యూను భోజనానికి రూ.200గా నిర్ణయించారు.
- మోటారు కార్లలో 1.6 లీటర్ల ఇంజిన్ సామర్థ్యం కన్నా తక్కువ కార్లకు నెలకు రూ. 8వేలు భత్యం, ఇతర కార్లకు నెలకు రూ. 10వేలు అలవెన్స్ ఉంటుంది. ఇందులో డ్రైవర్లకు కూడా అలవెన్స్ ఉంటుంది.
