Nokia 4G Series Launch : వైర్‌లెస్ ఎఫ్ఎమ్ రేడియోతో నోకియా రెండు కొత్త 4జీ ఫోన్లు.. స్నేక్ గేమ్ కూడా..!
Nokia 4G Series Launch : నోకియా 108 4జీ (2024), నోకియా 125 4జీ ఫోన్ 2.0-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉన్నాయి. ధర, లభ్యత వివరాలను కంపెనీ ఇంకా ప్రకటించలేదు.

Nokia 108 4G And 125 4G Announced With Wireless FM Radio
Nokia 4G Series Launch : కొత్త ఫీచర్ ఫోన్ కొంటున్నారా? ప్రముఖ హెచ్ఎండీ గ్లోబల్ బ్రాండ్ నోకియా నుంచి రెండు సరికొత్త 4జీ ఫోన్లు వచ్చేశాయి. నోకియా 108 4జీ (2024), నోకియా 125 4జీ (2024) హెచ్ఎండీ లేటెస్ట్ ఫీచర్ ఫోన్‌లుగా ఆవిష్కరించింది. ఈ కొత్త ఫోన్‌లు వైర్‌లెస్ ఎఫ్ఎమ్ రేడియో సపోర్టుతో వస్తాయి. ఎంపీ3 ప్లేయర్‌ని కలిగి ఉంటాయి. ఈ రెండు ఫోన్‌లలో నోకియా క్లాసిక్ స్నేక్ గేమ్ ఉంది. నోకియా 108 4జీ (2024), నోకియా 125 4జీ ఫోన్ 2.0-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉన్నాయి. నోకియా ఫోన్లలో 1,450mAh బ్యాటరీని కలిగి ఉంది. రెండోది 1,000mAh సెల్‌ను పొందుతుంది.
నోకియా 125 4జీ (2024) ఇటీవల ప్రకటించిన నోకియా 110 4జీ (2024) ఎఎ రీబ్రాండ్‌గా కనిపిస్తుంది. అయితే, నోకియా 108 4జీ (2024) స్పెసిఫికేషన్‌లు హెచ్ఎండీ 105 4జీతో వస్తాయి. నోకియా108 4జీ (2024), నోకియా 125 4జీ (2024) ధర, లభ్యత వివరాలు ఇంకా ప్రకటించలేదు. ప్రస్తుతం కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో జాబితా అయ్యాయి. నోకియా 108 4జీ (2024) బ్లాక్, సియాన్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. నోకియా 125 4జీ (2024) బ్లూ, టైటానియం షేడ్స్‌లో వస్తుంది.
నోకియా 108 4జీ, నోకియా 125 4జీ (2024) స్పెసిఫికేషన్‌లు :
నోకియా 108 4జీ (2024), నోకియా 125 4జీ (2024) 2-అంగుళాల డిస్‌ప్లేలను కలిగి ఉన్నాయి. రెండు మోడల్‌లు వైర్డు, వైర్‌లెస్ మోడ్‌లతో ఎఫ్ఎమ్ రేడియోను కలిగి ఉన్నాయి. వాటిలో వాయిస్ రికార్డర్, డ్యూయల్ ఫ్లాష్‌లైట్ ఉన్నాయి. రెండు ఫోన్‌లు గరిష్టంగా 2,000 కాంటాక్ట్‌లను సేవ్ చేసేందుకు స్టోరేజీని కూడా అందిస్తున్నాయని బ్రాండ్ పేర్కొంది.
నోకియా 4జీ హ్యాండ్‌సెట్‌లు ఎంపీ3 ప్లేయర్‌తో వచ్చాయి. 128ఎంబీ ర్యామ్, 64ఎంబీ ఇంటర్నల్ స్టోరేజీతో అమర్చారు. మైక్రో ఎస్‌డీ కార్డ్ స్లాట్ ద్వారా విస్తరించుకోవచ్చు. నోకియా పాత స్నేక్ గేమ్ కూడా ఉంది. క్లౌడ్ యాప్‌లు, ఇతర సర్వీసులను కూడా పొందవచ్చు. హెచ్ఎండీ నోకియా 108 4జీ (2024)లో 1,450mAh బ్యాటరీని కలిగి ఉన్నాయి.
ఒక్కసారి ఛార్జ్‌పై 15 రోజుల స్టాండ్‌బై టైమ్ అందిస్తుంది. నోకియా 125 4జీ చిన్నపాటి 1,000mAh బ్యాటరీ, నానో సిమ్ సపోర్టును కలిగి ఉంది. నోకియా 125 4జీ (2024) స్పెసిఫికేషన్‌లు ఇటీవల లాంచ్ అయిన నోకియా 110 4జీ (2024) రీబ్రాండ్ అని సూచిస్తున్నాయి. మరోవైపు, నోకియా 108 4జీ (2024), ముఖ్య ఫీచర్లను హెచ్ఎండీ 105 4జీతో పాటు చిన్న 2-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది.
Read Also : Jio Payment Services : పేటీఎం, ఫోన్‌పేకు పోటీగా ‘జియో పే’ పేమెంట్స్ సర్వీసులు.. ఆర్బీఐ ఆమోదం..!