Ola Electric : ఓలా ఎలక్ట్రిక్ ఆల్-టైమ్ రికార్డు.. ఫిబ్రవరిలో అత్యధికంగా 35వేల రిజిస్ట్రేషన్లు.. 42శాతం మార్కెట్ వాటాతో ఆధిపత్యం!

Ola Electric : ఫిబ్రవరిలో అత్యధికంగా 35వేల రిజిస్ట్రేషన్లతో ఓలా ఎలక్ట్రిక్ ఆల్ టైమ్ రికార్డు సాధించింది. 42శాతం మార్కెట్ వాటా సాధించి ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది.

Ola Electric records all-time high registrations of 35k in February

Ola Electric : బెంగుళూరుకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్‌ టూవీలర్‌ తయారీదారు ఓలా ఎలక్ట్రిక్‌ టూ వీలర్‌ సెగ్మెంట్‌లో సరికొత్త రికార్డులతో దూసుకుపోతోంది. భారత మార్కెట్లో 42శాతం మార్కెట్ వాటాతో ఆధిపత్యం కొనసాగిస్తోంది. 2024 ఏడాది ఫిబ్రవరిలో 35వేల అత్యధిక యూనిట్ల విక్రయాలతో ఆల్ టైం రికార్డు సాధించింది. ఈ మేరకు ఓలా బెంగళూరు కంపెనీ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఫిబ్రవరిలో స్కూటర్ల రిజిస్ట్రేషన్లలో ఓలా సరికొత్త రికార్డును నెలకొల్పగా.. గత 3 నెలల్లో లక్ష రిజిస్ట్రేషన్లను నమోదు చేసింది.

Read Also : Facebook News Tab : ఫేస్‌బుక్ పబ్లిషర్లకు షాకింగ్ న్యూస్.. ఇకపై ‘న్యూస్ ట్యాబ్’ కనిపించదు.. నో పేమెంట్..!

2023 డిసెంబర్‌తో పాటు 2024 జనవరి, ఫిబ్రవరిలో 30వేల కన్నా అత్యధికంగా రిజిస్ట్రేషన్లను నమోదు చేసింది. తద్వారా గతేడాది ఇదే నెలతో పోలిస్తే.. 100 శాతం వృద్ధిని సాధించినట్టు కంపెనీ పేర్కొంది. ఓలా ఎలక్ట్రిక్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ అన్షుల్ ఖండేల్వాల్ మాట్లాడుతూ.. రిజిస్ట్రేషన్లు, మార్కెట్ వాటాలో స్థిరమైన వృద్ధిని చూస్తున్నామని పేర్కొన్నారు.

600 సెంటర్ల విస్తరణే లక్ష్యంగా :
ప్రస్తుతం ఓలా ఎస్‌1 ప్రో స్కూటర్ మోడల్ ధర రూ.1.30 లక్షలు ఉండగా, ఎస్‌1 ఎయిర్‌ ధర రూ. 1.05 లక్షలుగా ఉంది. ఎస్1(ఎక్స్) (4kwh) బ్యాటరీ ప్యాక్‌ రూ. 1.10 లక్షలు ఉండగా.. ఎస్1ఎక్స్ ప్లస్ (3kwh) రూ. 84,999, ఎస్1ఎక్స్ (3kwh) మోడల్ ధర రూ. 89,999, ఓలా ఎస్ 1ఎక్స్(2kwh) మోడల్ ధర రూ. 79,999 వద్ద మార్కెట్లో లభ్యమవుతున్నాయి. ఏప్రిల్ 2024 నాటికి దేశవ్యాప్తంగా ఓలా ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్‌లను 600 సెంటర్లకు విస్తరించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతానికి దేశవ్యాప్తంగా ఓలా ఎలక్ట్రిక్ నుంచి 414 సర్వీస్ సెంటర్‌లు ఉన్నాయి. రానున్న రోజుల్లో మొత్తంగా 50శాతం సర్వీస్ నెట్‌వర్క్‌ను విస్తరించే ప్రణాళికలను కంపెనీ ఆవిష్కరించింది.

కస్టమర్ల కోసం యాడ్ ఆన్ వారంటీ :
ఓలా ఎలక్ట్రిక్ పరిశ్రమలో మొదటి 8 సంవత్సరాల/80కి.మీ ఎక్స్‌టెండెడ్ బ్యాటరీ వారంటీని మొత్తం శ్రేణి ఉత్పత్తులకు ఎలాంటి అదనపు ఖర్చు లేకుండా అందించనుంది.ఆసక్తి ఉన్న కస్టమర్‌లు ఇప్పుడు యాడ్-ఆన్ వారంటీని కూడా ఎంచుకోవచ్చు. నామమాత్రపు ప్రారంభ ధర రూ. 4,999 వద్ద 1,25,000 కిలోమీటర్ల వరకు ప్రయాణించే గరిష్ట పరిమితిని కూడా పెంచింది. వచ్చే త్రైమాసికం నాటికి ఫాస్ట్ ఛార్జింగ్ నెట్‌వర్క్‌ను 10వేల పాయింట్లకు పెంచాలని ఓలా ఎలక్ట్రిక్‌ భావిస్తోంది. 3KW పోర్టబుల్ ఫాస్ట్ ఛార్జర్ అనుబంధాన్ని కూడా ప్రవేశపెట్టింది. దీని ధర రూ. 29,999 వద్ద అందుబాటులో ఉంది.

Read Also : Infinix Smart 8 Plus Launch : కొత్త ఫోన్ కొంటున్నారా? సరసమైన ధరకే ఇన్ఫినిక్స్ స్మార్ట్ 8 ప్లస్ ఫోన్ వచ్చేసింది.. ధర ఎంతంటే?

ట్రెండింగ్ వార్తలు