Ola Maintains Dominance In EV 2W Segment With Market Share Of 40 Percent In July
Ola Electric : భారత మార్కెట్లో అతిపెద్ద ఎలక్ట్రిక్ వాహనాల కంపెనీ ఓలా ఎలక్ట్రిక్ (Ola Electric) గత జూలైలో జోరుగా అమ్మకాలను కొనసాగించింది. తద్వారా (EV 2W) మార్కెట్‌లో టాప్ రేంజ్‌లో దూసుకుపోతోంది. ఓలా కంపెనీ జూలైలో దాదాపు 19వేల యూనిట్లను విక్రయించింది. అంటే.. 40శాతం మార్కెట్ వాటాతో మార్కెట్ లీడర్‌గా తన స్థానాన్ని పటిష్టం చేసుకుంది. గత ఏడాదిలో ఇదే కాలంతో పోల్చితే.. కంపెనీ అమ్మకాలలో 375శాతం వృద్ధిని సాధించింది.
ఓలా చీఫ్ బిజినెస్ ఆఫీసర్ అంకుష్ అగర్వాల్ మాట్లాడుతూ.. ’ఓలా ఎలక్ట్రిక్ తన మార్కెట్ స్థానాన్ని నిలబెట్టుకుంది. #EndICEAgeని వాస్తవంగా మార్చడానికి నిబద్ధతలో ముందుకు వెళ్తోంది. విప్లవాత్మకమైన సరసమైన ధర కలిగిన S1 ఎయిర్‌కు అఖండమైన స్పందన లభిస్తోంది.
స్కూటర్ సెగ్మెంట్‌లో మాస్ మార్కెట్‌ను అడాప్షన్ చేయడం ద్వారా భారత EV రంగాన్ని మరింత వేగవంతం చేయనుంది. S1 ఎయిర్ ICE స్కూటర్‌లకు సరైన సమాధానం. సాటిలేని TCO (యాజమాన్యం మొత్తం ఖర్చు)తో #EndICEAageని మరింత వేగవంతం చేస్తుంది. ఆగస్ట్‌లో S1 ఎయిర్ డెలివరీలు వంటి ప్రకటనలతో వార్షిక ఫ్లాగ్‌షిప్ ఈవెంట్ నిర్వహించనున్నాం’ అని ఆయన పేర్కొన్నారు.
Ola Maintains Dominance In EV 2W Segment With Market Share Of 40 Percent In July
ఓలా S1 ఎయిర్ కస్టమర్ల నుంచి భారీ రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటికే ఓలా 50వేలకు పైగా బుకింగ్‌లను రిజిస్టర్ చేసింది. అధిక డిమాండ్, ప్రారంభ ధరకే S1 స్కూటర్ అందించాలంటూ వినియోగదారుల నుంచి అనేక అభ్యర్థనలు వస్తున్నాయి. దాంతో కంపెనీ కస్టమర్లందరి కోసం ఈ కొత్త ఆఫర్‌ను రూ. 1,09,999 ఆకర్షణీయమైన ప్రారంభ ధరతో ఆగస్టు 15 వరకు పొడిగించింది.
Ola S1 ఎయిర్ స్కూటర్ అర్బన్ సిటీ రైడ్‌కు అద్భుతంగా ఉంటుంది. తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో S1 ఎయిర్ గత మోడల్స్ S1, S1 ప్రో నుంచి అత్యాధునిక టెక్నాలజీ డిజైన్‌తో వస్తోంది. 3kWh బ్యాటరీ కెపాసిటీ, 125కి.మీ సర్టిఫైడ్ రేంజ్, 90 కిమీ/గం టాప్ స్పీడ్‌తో, Ola S1 ఎయిర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ రంగంలో కొత్త బెంచ్‌మార్క్‌ను సెట్ చేస్తోంది.