Honor Pad X9 : 11 అంగుళాల డిస్‌ప్లేతో హానర్ ప్యాడ్ X9 వచ్చేసిందోచ్.. ప్రీ ఆర్డర్ బుకింగ్‌పై డిస్కౌంట్, ధర ఎంతో తెలుసా?

Honor Pad X9 : కొత్త ట్యాబ్ కొనేందుకు చూస్తున్నారా? భారత మార్కెట్లో (Honor Pad X9) లాంచ్ అయింది. ముందున్న వెర్షన్‌తో పోలిస్తే.. పెద్ద మెరుగైన డిస్‌ప్లే, పెద్ద బ్యాటరీ కలిగి ఉంది. ధర రూ. 14,499కు సొంతం చేసుకోవచ్చు. టాబ్లెట్ ప్రీ-ఆర్డర్ రూ.500 డిస్కౌంటు అందిస్తుంది.

Honor Pad X9 : 11 అంగుళాల డిస్‌ప్లేతో హానర్ ప్యాడ్ X9 వచ్చేసిందోచ్.. ప్రీ ఆర్డర్ బుకింగ్‌పై డిస్కౌంట్, ధర ఎంతో తెలుసా?

Honor Pad X9 with 11-inch display, free folio case launched in India_ Price, specifications and more

Updated On : August 1, 2023 / 4:07 PM IST

Honor Pad X9 : భారత మార్కెట్లో హానర్ రీ ఎంట్రీ అదిరింది. స్మార్ట్‌ఫోన్ కంపెనీ స్టార్టర్స్ కోసం కొత్త టాబ్లెట్‌ను లాంచ్ చేసింది. హానర్ ప్యాడ్ (Honor Pad X9) పేరుతో ఇటీవల భారత్‌లో ప్రవేశపెట్టింది. సెప్టెంబరు 2022లో లాంచ్ అయిన Honor Pad X8కి సక్సెసర్ అని చెప్పవచ్చు. ఈ కొత్త టాబ్లెట్ అంతకంటే ముందున్న వెర్షన్‌తో పోలిస్తే.. అనేక అప్‌గ్రేడ్లను కలిగి ఉంది. పెద్ద, మెరుగైన డిస్‌ప్లేతో పాటు భారీ బ్యాటరీని కలిగి ఉంది.

హానర్ ప్యాడ్ X9 : ధర ఎంతంటే? :
భారత్‌లో Honor Pad X9ని కొనుగోలు చేసేందుకు ఆసక్తి కలిగి ఉన్నారా? అయితే, 4GB RAM, 128GB స్టోరేజీతో ఒకే వేరియంట్‌లో వస్తుంది. ఈ మోడల్ ధర రూ. 14,499గా నిర్ణయించింది. టాబ్లెట్ స్లీక్ స్పేస్ గ్రే కలర్ ఆప్షన్‌లో అందుబాటులో ఉంది. ప్రస్తుతం, ఈ కొత్త ట్యాబ్‌ను ముందస్తుగా ఆర్డర్ చేయవచ్చు. అమెజాన్‌లో ఆగస్టు 2న అధికారిక సేల్ ప్రారంభం కానుంది. మీరు డివైజ్ ప్రీబుక్ చేయాలనుకుంటే.. రూ. 500 డిస్కౌంట్‌తో పాటు ఫ్రీ హానర్ ఫ్లిప్ కవర్ కూడా పొందవచ్చు.

Read Also : Apple iPhone 15 Series : ఆపిల్ బిగ్ లాంచ్ ఈవెంట్‌కు ముందే ఐఫోన్ 15 సిరీస్ ధరలు లీక్.. ఏ ఐఫోన్ ధర ఎంత ఉండొచ్చుంటే?

హానర్ ప్యాడ్ X9 : స్పెసిఫికేషన్‌లు :
ఫీచర్ల విషయానికి వస్తే.. హానర్ ప్యాడ్ X9 మోడల్ 2K రిజల్యూషన్ (2000 x 1200 పిక్సెల్‌లు)తో 11.5-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. 120Hz అధిక రిఫ్రెష్ రేట్, 400 nits గరిష్ట బ్రైట్‌నెస్ లెవల్ అందిస్తుంది. టాబ్లెట్ ఆండ్రాయిడ్ 13-ఆధారిత MagicUI 7.1పై రన్ అవుతుంది. మల్టీ-విండో, మల్టీ-స్క్రీన్ సహకారతో త్రీ-ఫింగర్ స్వైప్ ఫీచర్‌ల వంటి డజను ఫీచర్‌లతో వస్తుంది. ఆక్టా-కోర్ Qualcomm Snapdragon 695 SoCని కలిగి ఉంది. కెమెరా విభాగంలో, హానర్ ప్యాడ్ X9 మోడల్ 5MP ఫ్రంట్ కెమెరాతో పాటు 5MP బ్యాక్ కెమెరాతో వస్తుంది. ఫొటోగ్రఫీకి అంత బెస్ట్ కాకపోవచ్చు.

Honor Pad X9 with 11-inch display, free folio case launched in India_ Price, specifications and more

Honor Pad X9 with 11-inch display, free folio case launched in India

కానీ, వీడియో కాల్స్, ప్రైమరీ ఫొటోలకు ఫర్‌ఫెక్ట్ అని చెప్పవచ్చు. బ్యాటరీ లైఫ్ పర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉంటుంది. టాబ్లెట్ 22.5W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో భారీ 7,250mAh బ్యాటరీని కలిగి ఉంది. కంపెనీ ప్రకారం.. సింగిల్ ఛార్జ్‌పై 13 గంటల వరకు పనిచేస్తుంది. హాయ్-రెస్ ఆడియోతో 6 సినిమాటిక్ సరౌండ్ స్పీకర్‌లకు టాబ్లెట్ సపోర్టుతో ఆడియోను పొందవచ్చు.

ఇందులో వైఫై, బ్లూటూత్ v5.1, USB టైప్-C పోర్ట్ వంటి ప్రామాణిక కనెక్టివిటీ ఫీచర్‌లను కూడా కలిగి ఉంది. ట్యాబ్ సైజు, బరువు పరంగా చూస్తే.. హానర్ ప్యాడ్ X9 మోడల్ బరువు 499 గ్రాములు, 267.3mm x 167.4mm x 6.9mm కొలతలు కలిగి ఉంది. Honor Pad X9 ముందు వెర్షన్ కన్నా పోర్టబుల్‌గా పనిచేస్తుంది.

Read Also : iPhone 15 Series : డైనమిక్ ఐలాండ్ నాచ్‌తో ఐఫోన్ 15 సిరీస్ వస్తోంది.. కొత్త డిస్‌ప్లే టెక్‌తో ప్రో మోడల్స్..!