Redmi 12 Series Launch : సరసమైన ధరకే రెడ్‌మి 12 సిరీస్ ఫోన్లు.. ధర తక్కువ, ఫీచర్లు ఎక్కువ.. వెంటనే కొనేసుకోండి..!

Redmi 12 Series Launch : కొత్త ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? రెడ్‌మి 12 4G, 5G మోడల్‌లు భారత మార్కెట్లో లాంచ్ అయ్యాయి. ఈ ఫోన్ ధర రూ. 8,999 నుంచి సొంతం చేసుకోవచ్చు. రెడ్‌మి ఫోన్ మొత్తం 3 కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉన్నాయి.

Redmi 12 Series Launch : సరసమైన ధరకే రెడ్‌మి 12 సిరీస్ ఫోన్లు.. ధర తక్కువ, ఫీచర్లు ఎక్కువ.. వెంటనే కొనేసుకోండి..!

Redmi 12 4G and 5G models launched in India with effective price starting at Rs 8,999

Redmi 12 Series Launch : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ మేకర్ షావోమీ (Xiaomi) బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ సెగ్మెంట్, Redmi 12 4G, Redmi 12 5Gలో భారత మార్కెట్లో సరికొత్త ఆఫర్‌ను లాంచ్ చేసింది. 5G స్మార్ట్‌ఫోన్ కొనేందుకు చూసే వినియోగదారులకు ఇదే సరైన అవకాశం.. ఈ రెండు ఫోన్‌లు 3 స్టోరేజ్ వేరియంట్‌లు, 3 కలర్ ఆప్షన్‌లలో వస్తాయి. ఈ డివైజ్ ధర రూ. 8,999 నుంచి ప్రారంభమవుతుంది. ధర, లభ్యత వివరాలతో పాటు ఫోన్ టాప్ స్పెక్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

రెడ్‌మి 12 4G, రెడ్‌మి 12 5G ధర ఎంతంటే? :
రెడ్‌మి 12 4G రెండు వేరియంట్‌లను కలిగి ఉంది. అందులో ఒకటి 4GB RAM, 128 GB స్టోరేజ్, మరోకటి 6GB RAM, 128 GB స్టోరేజ్ ఉన్నాయి. 4GB RAM, 128 GB స్టోరేజ్ వేరియంట్, బ్యాంక్ ఆఫర్‌లతో కలిపి మొత్తంగా రూ. 8,999 ధర ఉంటుంది. అయితే, 6GB RAM, 128 GB వేరియంట్ ధర రూ. 10,499కి పొందవచ్చు. రెడ్‌మి 12 5G ఫోన్ భారత మార్కెట్లో మూడు స్టోరేజ్ వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. అందులో 4GB + 128GB, 6GB + 128GB, 8GB + 256GB వేరియంట్లు ఉన్నాయి.

Read Also : Redmi 12 Price Leak : ఆగస్టు 1న రెడ్‌మి 12 ఫోన్ వచ్చేస్తోంది.. లాంచ్‌కు ముందే ఫీచర్లు లీక్.. ధర ఎంత ఉండొచ్చుంటే?

4GB RAM,128 GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 10,999 కాగా, 6GB + 128GB వేరియంట్ ధర రూ. 12,4999 ఉంటుంది. 8GB + 256 GB వేరియంట్ రూ. 1,000 బ్యాంక్ ఆఫర్‌తో కలిపితే ధర రూ. 14,999కు సొంతం చేసుకోవచ్చు. ఈ రెండు ఫోన్‌లు ఆగస్టు 4 మధ్యాహ్నం 12:00 గంటల నుంచి అమ్మకానికి వస్తాయి. రెడ్‌మి 12 5G బ్రాండ్ అధికారిక వెబ్‌సైట్‌తో పాటు అమెజాన్‌లో అందుబాటులో ఉంటుంది. Redmi 12 4G విషయానికొస్తే.. బ్రాండ్ అధికారిక వెబ్‌సైట్, ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంటుంది.

రెడ్‌మి 12 4G టాప్ స్పెషిఫికేషన్లు :
రెడ్‌మి 12 4G గ్లాస్ బ్యాక్ ప్యానెల్‌తో వస్తుంది. ప్రీమియం లుక్ కలిగి ఉంటుంది. కెమెరా లెన్స్‌లకు సిల్వర్ మెటాలిక్ రిమ్‌లతో కెమెరా సెటప్‌ కలిగి ఉంది. రెడ్‌మి 12 ఫోన్ MIUI 14 (Android 13 ఆధారంగా) ద్వారా అందిస్తుంది. MIUI డయలర్‌తో కూడా వస్తుంది. రెడ్‌మి MediaTek Helio G88 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.79-అంగుళాల FHD+ డిస్‌ప్లే ఉంది. డిస్ప్లే మూడు వైపులా స్లిమ్ బెజెల్స్‌తో పంచ్-హోల్ నాచ్ డిజైన్‌ను కలిగి ఉంది. ఫోన్ హుడ్ మీద నాచ్ కొంచెం మందంగా ఉంటుంది.

Redmi 12 4G and 5G models launched in India with effective price starting at Rs 8,999

Redmi 12 4G and 5G models launched in India with effective price starting at Rs 8,999

ఈ ఫోన్ 5,000mAh బ్యాటరీతో వస్తుంది. 18W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. దీని బరువు దాదాపు 198.5 గ్రాములు. ఈ ఫోన్ పాస్టెల్ బ్లూ, మూన్‌షైన్ సిల్వర్, జేడ్ బ్లాక్ అనే 3 కలర్ ఆప్షన్‌లలో వస్తుంది. కెమెరాల విషయానికి వస్తే.. ఈ రెండు ఫోన్‌లో 50MP ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రావైడ్ కెమెరా, 2MP మాక్రో కెమెరా, సెల్ఫీ కెమెరా 8MP ఉన్నాయి.

రెడ్‌మి 12 5G టాప్ స్పెషిఫికేషన్లు :
రెడ్‌మి 12 5G ఫోన్‌లో Redmi 12 4G మాదిరిగానే స్పెషిఫికేషన్లు ఉన్నాయి. రెండు ఫోన్‌ల మధ్య ప్రధాన వ్యత్యాసం చిప్‌సెట్, 5G టెక్నాలజీ మాత్రమే.. రెడ్‌మి 12 5G ఫోన్ ధర విభాగంలో అరుదుగా ఉండే 5G కనెక్టివిటీకి సపోర్టు ఇస్తుంది. ఈ ఫోన్ భారత్‌లో స్నాప్‌డ్రాగన్ 4 Gen 2 ప్రాసెసర్‌ను అందిస్తుంది. కెమెరా విషయానికి వస్తే.. రెడ్‌మి 12 5G ఫోన్ 2MP డెప్త్ కెమెరా, LED ఫ్లాష్‌తో 50MP ప్రైమరీ కెమెరాను కలిగి ఉంది. ముందు కెమెరా 8MP, రెండు ఫోన్‌లు 5000mAh బ్యాటరీని కలిగి ఉంటాయి. ఈ ఫోన్లలో టైప్-C, USB పోర్ట్ ద్వారా 18W ఛార్జింగ్‌కు సపోర్టు అందిస్తుంది.

Read Also : Honor Pad X9 : 11 అంగుళాల డిస్‌ప్లేతో హానర్ ప్యాడ్ X9 వచ్చేసిందోచ్.. ప్రీ ఆర్డర్ బుకింగ్‌పై డిస్కౌంట్, ధర ఎంతో తెలుసా?