Neeraj Chopra Range Rover Velar : రేంజ్ అంటే ఇలా ఉండాలి భయ్యా.. కార్ల కలెక్షన్ కింగ్.. నీరజ్ చోప్రా కొత్త కారు చూస్తే అదే అంటారు.. ధర ఎంతో తెలుసా?

Neeraj Chopra Range Rover Velar : లగ్జరీ కార్లకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పన్కర్లేదు. ఈ కార్లను కొనాలంటే ఆ మాత్రం రేంజ్ ఉండాల్సిందే. అలాంటి రేంజ్ మోడల్ కారును మన ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ నీరజ్ చోప్రా కొనేశాడు.  

Neeraj Chopra Range Rover Velar : రేంజ్ అంటే ఇలా ఉండాలి భయ్యా.. కార్ల కలెక్షన్ కింగ్.. నీరజ్ చోప్రా కొత్త కారు చూస్తే అదే అంటారు.. ధర ఎంతో తెలుసా?

Olympic Gold Medalist Neeraj Chopra buys a new Range Rover Velar worth Rs 90 lakh

Updated On : July 21, 2023 / 9:58 PM IST

Neeraj Chopra buys new Range Rover Velar : అతడో సంచలనం.. ఒలింపిక్ గోల్డ్ మెడల్ విజేతగా నీరజ్ చోప్రా (Neeraj Chopra) ఎన్నో సంచనాలను సృష్టించాడు. కేవలం మైదానంలో మాత్రమే కాదు.. బయటా కూడా అదే స్థాయిలో దూసుకుపోతున్నాడు. భారత స్పోర్టింగ్ ఐకాన్ మాత్రమే కాదు.. హై-ఎండ్ కార్లను సేకరించడంలోనూ తనకు సాటి మరొకరు లేరని నిరూపించాడు. ఎందుకంటే.. లగ్జరీ కార్లను కొనుగోలు చేయడంలో నీరజ్‌కు ఎప్పుడూ ముందు ఉంటాడు. లగ్జరీ కార్ల అంటే అంత పిచ్చి అతడికి.. మార్కెట్లోకి ఏదైనా లగ్జరీ కారు వచ్చిందంటే చాలు.. ఆ కారు కొనాల్సిందే.. తీసుకొచ్చి తన గ్యారేజీలో పెట్టాల్సిందే.

ఇటీవలే నీరజ్ తన హై-ఎండ్ కార్ల గ్యారేజీలోకి రూ. 90 లక్షల విలువైన ఓ లగ్జరీ కారును తీసుకొచ్చాడు. అదే.. సరికొత్త బ్లాక్ రేంజ్ రోవర్ వెలార్ SUV కారు.. ఈ కొత్త రేంజ్ రోవర్ వెలార్‌ (Range Rover Velar)తో నీరజ్ దిగిన ఫొటో ఒకటి ఇటీవల ఆన్‌లైన్‌లో షేర్ అయింది. ఈ ఫొటో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. భారత అథ్లెట్ నీరజ్ చోప్రా కొనుగోలు చేసిన అద్భుతమైన బ్లాక్ రేంజ్ రోవర్ వెలార్ SUV అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ SUV కారు ఫొటోను సోషల్ మీడియాలో ల్యాండ్ రోవర్ మాల్వా ఆటోమోటివ్స్ ద్వారా షేరింగ్ అయింది. నీరజ్‌కు అభినందనలు.. రేంజ్ రోవర్ ఫ్యామిలీలోకి స్వాగతం అంటూ పోస్టు షేర్ చేసింది.

Read Also :  Google Warn Users : మీరు ఈ పని చేయకపోతే.. మీ జీమెయిల్, యూట్యూబ్ అకౌంట్లు డిలీట్ అవుతాయి జాగ్రత్త..!

ఇప్పటికే నీరజ్ చోప్రా విభిన్నమైన హైఎండ్ కార్ల గ్యారేజీలోకి సరికొత్త రేంజ్ రోవర్ వెలార్ వచ్చి చేరింది. నీరజ్ చోప్రాకు లగ్జరీ కార్ల పట్ల ఆసక్తి ఎక్కువ. కొత్త రేంజ్ రోవర్ వెలార్‌తో పాటు తన రేంజ్ రోవర్ స్పోర్ట్, అనేక ఇతర టాప్ రేంజ్ వాహనాలను కలిగి ఉన్నాడు. చాలాసార్లు నీరజ్ చోప్రా.. బ్లూ కలర్ ఫోర్డ్ ముస్టాంగ్‌తో కూడా కనిపించాడు. స్టైల్, పవర్‌ కార్లను సేకరించడమంటే చాలా ఇష్టమని చెబుతుండేవాడు. నీరజ్ వాడే ముస్తాంగ్ కారు ఇదే.. ఈ ఐకానిక్ వాహనాన్ని నీరజ్ ఎంతో ఇష్టంగా కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది.  రేంజ్ రోవర్ వెలార్ విషయానికొస్తే.. బ్రిటిష్ కంపెనీ ఈ కారును తయారుచేసింది. టాప్ రేంజ్, లగ్జరీ కార్లలో బాగా పాపులర్ అని చెప్పవచ్చు.

Olympic Gold Medalist Neeraj Chopra buys a new Range Rover Velar worth Rs 90 lakh

Olympic Gold Medalist Neeraj Chopra buys a new Range Rover Velar worth Rs 90 lakh

రేంజ్ రోవర్ ఎవోక్ ఖరీదైన రేంజ్ రోవర్ స్పోర్ట్, వోగ్ మోడల్‌ల మధ్య ఉంచిన వెలార్ పర్ఫార్మెన్స్, డిజైన్ ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. భారత మార్కెట్లో ఈ లగ్జరీ కారు ప్రారంభ ధర రూ. 78.87 లక్షలు (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ). అయితే, నీరజ్ చోప్రా చెల్లించిన కచ్చితమైన ధర ఎంత అనేది ఇంకా తెలియదు. భారత మార్కెట్లో రేంజ్ రోవర్ వెలార్ విభిన్న డ్రైవింగ్ ప్రాధాన్యతలతో వచ్చింది. ఈ కారు 3 ఇంజన్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది.

దిగువ వేరియంట్‌లు 179 Bhpతో 2.0-లీటర్ టర్బోచార్జ్డ్ డీజిల్ ఇంజన్ లేదా 250 Bhpతో 2.0-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్‌ను కలిగి ఉన్నాయి. టాప్-ఎండ్ వేరియంట్‌లలో 296 Bhpతో బలమైన 3.0-లీటర్ V6 టర్బోచార్జ్డ్ డీజిల్ ఇంజిన్‌ను కలిగి ఉంటాయి. ZF నుంచి 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్, టెర్రైన్ రెస్పాన్స్‌తో ఆల్-వీల్-డ్రైవ్ సిస్టమ్‌తో వెలార్ సున్నితమైన డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది.

Olympic Gold Medalist Neeraj Chopra buys a new Range Rover Velar worth Rs 90 lakh

Olympic Gold Medalist Neeraj Chopra buys a new Range Rover Velar worth Rs 90 lakh

రేంజ్ రోవర్ వెలార్ విలాసవంతమైన పర్ఫార్మెన్స్, ఆకర్షణీయమైన ఫీచర్లతో వస్తుంది. మ్యాట్రిక్స్ LED హెడ్‌ల్యాంప్‌లు, యూజర్ ఫ్రెండ్లీ టచ్‌స్క్రీన్ ఇంటర్‌ఫేస్‌తో టచ్ ప్రో డ్యుయో ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, హిల్ డిసెంట్ కంట్రోల్, అడాప్టివ్ ఎయిర్ సస్పెన్షన్, మెమొరీ ఫంక్షన్‌తో వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, యాక్టివ్ రియర్-లాకింగ్ ఇ-డిఫరెన్షియల్ వంటి ముఖ్యమైన హైలైట్‌లు ఉన్నాయి. కొత్త పివి ప్రో ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ 10-అంగుళాల టచ్‌స్క్రీన్, ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో వంటి అధునాతన కనెక్టివిటీ ఆప్షన్లను అందిస్తోంది.

రేంజ్ రోవర్ వెలార్ కొనుగోలు చేసిన సెలబ్రిటీ నీరజ్ చోప్రా ఒకడే కాదు. ప్రముఖ నటి కృతి ఖర్బండా, స్టాండ్-అప్ కమెడియన్ జకీర్ ఖాన్, నటి అవనీత్ కౌర్‌లతో పాటు, ఫుజి వైట్ అద్భుతమైన షేడ్‌లో వెలార్స్ కొనుగోలు చేశారు. అంతేకాకుండా, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కూడా తన జిమ్ ట్రైనర్‌కు రేంజ్ రోవర్ వెలార్‌ను బహుమతిగా ఇవ్వడంతో వార్తల్లో నిలిచింది.

Read Also : Ola S1 Air Teaser Video : ఓలా టీజర్ అదిరింది.. అత్యంత సరసమైన ఓలా S1 ఎయిర్ స్కూటర్ వస్తోంది.. గంటకు 85 కి.మీ వేగంతో దూసుకెళ్తుంది..!