OnePlus 13R goes on sale
OnePlus 13R Sale : కొత్త స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా? వన్‌ప్లస్ లేటెస్ట్ ప్రీమియం మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్ వన్‌ప్లస్ 13ఆర్ లాంచ్ సేల్ మొదలైంది. భారత మార్కెట్లో అనేక ఆఫర్‌లతో విక్రయానికి అందుబాటులో ఉంది.
ఈ ఫోన్ గత ఏడాదితో వన్‌ప్లస్ 12ఆర్‌కి అప్‌గ్రేడ్ అందిస్తుంది. టెలిఫోటో లెన్స్, కొంచెం మెరుగైన ఐపీ రేటింగ్, పెద్ద బ్యాటరీ, ఫ్లాట్ డిస్‌ప్లేతో సహా అనేక అప్‌గ్రేడ్‌లతో గత ఏడాది ప్రారంభ ధరలోనే రూ. 42,999కు వస్తుంది.
Read Also : OnePlus 13 First Sale : వన్‌ప్లస్ 13 ఫస్ట్ సేల్ మొదలైంది.. భారత్‌లో ఈ ఫోన్ ధర ఎంతంటే?
వన్‌ప్లస్ 13ఆర్ స్పెసిఫికేషన్స్ :
వన్‌ప్లస్ 13ఆర్ ఫోన్ 6.78 అంగుళాల 120Hz ప్రోఎక్స్‌డీఆర్ అమోల్డ్ డిస్‌ప్లేను ఎల్టీపీఓ 4.1 టెక్నాలజీతో వస్తుంది. గత ఏడాది మాదిరిగా 4,500నిట్స్ గరిష్ట ప్రకాశాన్ని కలిగి ఉంది. వన్‌ప్లస్ నుంచి వచ్చిన కొత్త ‘పర్ఫార్మెన్స్ ఫ్లాగ్‌షిప్’ ఫ్లాట్ డిస్‌ప్లేతో వస్తుంది. వన్‌ప్లస్ 12ఆర్‌లో కర్వ్డ్ డిస్‌ప్లే నుంచి ఫ్రంట్, బ్యాక్ రెండింటిలో కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7ఐ ద్వారా ప్రొటెక్షన్ అందిస్తుంది.
వన్‌ప్లస్ 13ఆర్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 జనరేషన్ 3 ఎస్ఓసీని కలిగి ఉంది. గత ఏడాదిలో లాంచ్ అయిన వన్‌ప్లస్ 12లో కనిపించే అదే ప్రాసెసర్. 12/జీబీ/16జీబీ ఎల్‌పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, 256జీబీ/512జీబీ యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజ్‌తో వస్తుంది. ఆప్టిక్స్ విషయానికి వస్తే.. వన్‌ప్లస్ 13ఆర్ ఫోన్ 50ఎంపీ సోనీ ఎల్‌వైటీ-700 ప్రైమరీ షూటర్, 50ఎంపీ 2ఎక్స్ శాంసంగ్ జేఎన్5 టెలిఫోటో లెన్స్, 8ఎంపీ అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్‌ను కలిగి ఉంది.
ఫ్రంట్ సైడ్ 16ఎంపీ సోనీ ఐఎమ్ఎక్స్480 సెల్ఫీ షూటర్ ఉంది. బ్యాక్ కెమెరాలు 4కె 60ఎఫ్‌పీఎస్ వద్ద వీడియోలను రికార్డ్ చేయగలవు. ఫ్రంట్ సెన్సార్ 30fps వద్ద 1080p రికార్డింగ్‌కు పరిమితం చేస్తుంది. ఇతర ఫోన్ల మాదిరిగానే వన్‌ప్లస్ 13ఆర్ కూడా 6,000mAhతో వస్తుంది. కానీ, 80డబ్ల్యూ సూపర్ వూక్ ఛార్జింగ్‌తో వస్తుంది. వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్టు లేదు.
ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆధారంగా ఆక్సిజన్‌ఓఎస్ 15పై కూడా రన్ అవుతుంది. వన్‌ప్లస్ ఇండియా, వన్‌ప్లస్ స్టోర్ యాప్, అమెజాన్, విజయ్ సేల్స్, రిలయన్స్ డిజిటల్, క్రోమా, బజాజ్ ఎలక్ట్రానిక్స్ ద్వారా ఈరోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్ కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది.
లాంచ్ ఆఫర్‌లో భాగంగా, వన్‌ప్లస్, ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లపై రూ. 3వేల ఇన్‌స్టంట్ డిస్కౌంట్ అందిస్తోంది. వన్‌ప్లస్ 13ఆర్ రెండు వేరియంట్‌లలో ధర వరుసగా రూ. 39,999, రూ. 46,999కు అందిస్తోంది. ఈ ఫోన్ ఆస్ట్రల్ ట్రైల్, నెబ్యులా నోయిర్ అనే 2 కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది.