OnePlus 13 First Sale : వన్‌ప్లస్ 13 ఫస్ట్ సేల్ మొదలైంది.. భారత్‌లో ఈ ఫోన్ ధర ఎంతంటే?

OnePlus 13 First Sale : భారత మార్కెట్లో వన్‌ప్లస్ 13 ఫస్ట్ సేల్ ప్రారంభమైంది. ఈ ఫోన్ అమెజాన్ ఇండియా, ఇతర రిటైల్ స్టోర్లలో అందుబాటులో ఉంటుంది.

OnePlus 13 First Sale : వన్‌ప్లస్ 13 ఫస్ట్ సేల్ మొదలైంది.. భారత్‌లో ఈ ఫోన్ ధర ఎంతంటే?

OnePlus 13 First Sale

Updated On : January 10, 2025 / 5:55 PM IST

OnePlus 13 First Sale : కొత్త స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా? ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం వన్‌ప్లస్ ఇటీవల ఫ్లాగ్‌షిప్ మోడల్ వన్‌ప్లస్ 13 ఫోన్ భారత మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ ఫోన్ జనవరి 7న రూ.69,999 ప్రారంభ ధరతో విడుదలైంది. అయితే, ఈ ఫోన్‌పై లాంచ్ డిస్కౌంట్ కూడా లభిస్తుందని కంపెనీ వెల్లడించింది.

వన్‌ప్లస్ 13 ఫోన్ ముందున్న వన్‌ప్లస్ 12 కన్నా మరింత అప్‌గ్రేడ్ అందిస్తుంది. కానీ, డిస్కౌంట్లు, బ్యాంక్ ఆఫర్‌లతో వినియోగదారులు వన్‌ప్లస్ 12 (లాంచ్ ధర) మాదిరిగానే వన్‌ప్లస్ 13ని కొనుగోలు చేయవచ్చు. వన్‌ప్లస్ 13 ఫోన్ ధర, తగ్గింపులను పొందవచ్చు.

వన్‌ప్లస్ 13 ఫస్ట్ సేల్ మొదలైంది :
వన్‌ప్లస్ 13 ఫోన్ (ఈరోజు) మధ్యాహ్నం 12 గంటలకు భారతీయ మార్కెట్లోకి విడుదల కానుంది. ఈ ఫోన్ అమెజాన్ ఇండియా, ఇతర అనుబంధ రిటైల్ స్టోర్ల ద్వారా అందుబాటులో ఉంటుంది. ఈ ఫోన్ రూ. 69,999 ప్రారంభ ధర వద్ద అందుబాటులో ఉంది. డిస్కౌంట్లు, బ్యాంక్ ఆఫర్లు ఆకట్టుకునే డీల్‌ను తగ్గించాయి. ఐసీఐసీఐ బ్యాంక్ కార్డ్ ఆఫర్లతో వన్‌ప్లస్ 13ని తక్కువ ధరకు కొనుగోలు చేయొచ్చు.

Read Also : iPhone 16E Launch : కొత్త ఐఫోన్ కోసం చూస్తున్నారా? చౌకైన ధరకే ఐఫోన్ 16E వచ్చేస్తోంది.. ఫీచర్లు, డిజైన్ వివరాలివే!

వన్‌ప్లస్ 13 ఫోన్ 12జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజీ కోసం ప్రారంభ ధర రూ. 69,999తో వస్తుంది. అయితే, హై-ఎండ్ మోడల్‌ల ధర మరింత ఎక్కువగా ఉంటుంది. 512జీబీ స్టోరేజ్ మోడల్‌తో 16జీబీ ర్యామ్ ధర రూ.76,999, 1టీబీ మోడల్‌తో 24జీబీ ర్యామ్ ధర రూ. 89,999కు కొనుగోలు చేయొచ్చు.

ఈ ఫోన్ కొనుగోలుపై బ్యాంక్ ఆఫర్లు కూడా వర్తిస్తాయి. లాంచ్ సేల్ ఆఫర్‌లలో భాగంగా కస్టమర్లు లేటెస్ట్ ఫ్లాగ్‌షిప్ ఫోన్‌పై రూ. 5వేల తగ్గింపును పొందవచ్చు. ప్రత్యేకంగా ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ యూజర్ల కోసం దరఖాస్తు చేసుకున్న తర్వాత బేస్ మోడల్ ధర రూ.64,999 అవుతుంది. అదేవిధంగా, 512జీబీ స్టోరేజ్ వేరియంట్‌తో 16జీబీ ర్యామ్ తగ్గింపుతో రూ.71,999కి అందుబాటులో ఉంటుంది. టాప్-టైర్ మోడల్, 24జీబీ ర్యామ్, 1టీబీ స్టోరేజీని కూడా కలిగి ఉంది. అదే ఆఫర్ కింద వన్‌ప్లస్ ఫోన్ ధర రూ. 84,999కి తగ్గుతుంది.

OnePlus 13 First Sale

OnePlus 13 First Sale

వన్‌ప్లస్ 13 ఫోన్ కొనుగోలుపై పాత ఫోన్‌ని ఎక్స్ఛేంజ్ చేయాలనుకుంటే మరిన్ని ఆఫర్‌లను పొందవచ్చు. మీ పాత ఫోన్ ఎక్స్ఛేంజ్ విలువ రూ. 18వేల వరకు ఉండవచ్చు. దానిపైన, అమెజాన్ రూ. 7వేల అదనపు ఎక్స్ఛేంజ్ బోనస్‌ను అందిస్తోంది. మొత్తంగా, డిస్కౌంట్ ఆఫర్‌లతో వన్‌ప్లస్ 13 సొంతం చేసుకోవచ్చు.

వన్‌ప్లస్ 13 స్పెషిఫికేషన్లు, ఫీచర్లు :
వన్‌ప్లస్ 13 ఫోన్ 6.82-అంగుళాల ఎల్టీపీఓ డిస్‌ప్లేను కలిగి ఉంది. గత ఫోన్ వన్‌ప్లస్ 12 మాదిరిగా అదే సైజులో వస్తుంది. స్క్రీన్ 120Hz రిఫ్రెష్ రేట్, క్యూహెచ్‌డీ+ రిజల్యూషన్‌ను అందిస్తుంది. సాధారణ మోడ్‌లో 1,600నిట్‌ల వరకు ఆకట్టుకునే బ్రైట్‌నెస్ స్థాయిలు, గరిష్ట ప్రకాశంతో 4,500నిట్స్ ఉంటాయి.

చలికాలంలో ఢిల్లీ వంటి శీతల ప్రాంతాల్లో వినియోగదారుల కోసం రూపొందించిన కొత్త గ్లోవ్ ఫీచర్ చేతి గ్లౌజ్‌లను తొలగించకుండా ఫోన్ ఆపరేట్ చేసేందుకు అనుమతిస్తుంది. వన్‌ప్లస్ 13 ఫోన్‌లో క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్ కలిగి ఉంది. మరో ముఖ్యమైన అప్‌గ్రేడ్ బ్యాటరీ, 6,000mAh సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఈ పెద్ద బ్యాటరీ సింగిల్ ఛార్జ్‌పై దాదాపు 2 రోజుల పాటు వస్తుందని వన్‌ప్లస్ పేర్కొంది. ఈ ఫోన్ 100డబ్ల్యూ వైర్డు ఛార్జింగ్, 50డబ్ల్యూ వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. అలాగే, మాగ్నెటిక్ వైర్‌లెస్ ఛార్జింగ్‌ను కూడా అందిస్తుంది.

కెమెరాల పరంగా, వన్‌ప్లస్ 13 ఫోన్ 50ఎంపీ ఎల్‌వైటీ-808 ప్రైమరీ సెన్సార్‌ను కలిగి ఉంది. అయితే, టెలిఫోటో, అల్ట్రావైడ్ లెన్స్‌లను 50ఎంపీ సెన్సార్‌లకు అప్‌గ్రేడ్ చేస్తుంది. హాసెల్‌బ్లాడ్-బ్రాండెడ్ సిస్టమ్ 4కె/60ఎఫ్‌పీఎస్ డాల్బీ విజన్ వీడియో రికార్డింగ్‌కు కూడా సపోర్టు అందిస్తుంది.

ఈ ఫోన్ అత్యంత మన్నికైనది. నీటి నిరోధకతకు ఐపీ68, ఐపీ69 రేటింగ్‌లను కలిగి ఉంది. అడ్వాన్స్ ఫీచర్లలో అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉన్నాయి. తడి చేతులతో కూడా సులభంగా ఆపరేట్ చేయొచ్చు. మెరుగైన గేమింగ్ కోసం అడ్వాన్స్ వైబ్రేషన్ మోటార్ కూడా ఉంది.

Read Also : Blinkit Delivery : బ్లింకిట్‌లో మరో కొత్త సర్వీసు.. ఇకపై ల్యాప్‌టాప్‌లు, మానిటర్లు, ప్రింటర్లు కొనొచ్చు.. కేవలం 10 నిమిషాల్లోనే డెలివరీ..!