OnePlus 13R Discount
OnePlus 13R Discount : కొత్త స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా? భారత మార్కెట్లో ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం వన్‌ప్లస్ ప్రీమియం స్మార్ట్‌ఫోన్ల రేంజ్ ప్రవేశపెడుతోంది. ఇప్పటికే కొత్త లైనప్‌లో వన్‌ప్లస్ 13 సిరీస్, భారత మార్కెట్లో లాంచ్ అయింది. ఈ సిరీస్‌లో రెండు మోడళ్లు ఉన్నాయి.
అందులో వన్‌ప్లస్ 13, వన్‌ప్లస్ 13R ఫోన్లు ఉన్నాయి. లాంచ్ అయిన కొన్ని నెలల తర్వాత వన్‌ప్లస్ 13R ధర భారీగా తగ్గింది. ప్రస్తుతం మార్కెట్‌లోని హై-ఎండ్ స్మార్ట్‌ఫోన్ కొనుగోలుదారులకు ఆకర్షణీయమైన ఆప్షన్ అని చెప్పవచ్చు.
వన్‌ప్లస్ 13R డిస్కౌంట్ :
ఈ ఫోన్ 12GB ర్యామ్, 256GB స్టోరేజీతో బేస్ మోడల్ ధర రూ.49,999కు అందుబాటులో ఉంది. ప్రస్తుతం, అమెజాన్ ఎంపిక చేసిన బ్యాంక్ క్రెడిట్ కార్డులతో కస్టమర్లకు రూ.3వేలు తగ్గింపును అందిస్తోంది. అదనంగా, కొనుగోలుదారులు రూ.24,300 వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ను కూడా పొందవచ్చు.
మీ పాత ఫోన్ ట్రేడ్ చేస్తే దాదాపు రూ.15వేలు వస్తే.. మీరు కేవలం రూ.31,999 ధరకే వన్‌ప్లస్ 13R కొనుగోలు చేయవచ్చు. అయితే, ఫైనల్ ప్రైస్ అనేది మీ ట్రేడ్-ఇన్ స్టేటస్ ఆధారంగా ఉంటుంది. అంటే.. మీ పాత ఫోన్ వర్కింగ్ కండిషన్ ఆధారంగా ధరను నిర్ణయించవచ్చు.
వన్‌ప్లస్ 13R స్పెసిఫికేషన్లు :
వన్‌ప్లస్ 13R ఫోన్ అద్భుతమైన 6.78-అంగుళాల ఎల్టీపీఓ అమోల్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. ఈ ఫోన్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 జనరేషన్ 3 ప్రాసెసర్‌పై రన్ అవుతుంది. 12GB ర్యామ్‌తో సపోర్టు ఇస్తుంది. 1TB వరకు ఇంటర్నల్ స్టోరేజీని అందిస్తుంది. భారీ 6,000mAh బ్యాటరీ ఫోన్‌ను రోజంతా పవర్ అందిస్తుంది. 100W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్‌తో త్వరగా ఫుల్ ఛార్జింగ్ అవుతుంది.
ఫొటోగ్రఫీ విషయానికి వస్తే.. వన్‌ప్లస్ 13R ఫోన్ బ్యాక్ సైడ్ ట్రిపుల్-కెమెరా సిస్టమ్‌తో వస్తుంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS)తో 50MP ప్రైమరీ లెన్స్, 8MP అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్, 2MP మాక్రో లెన్స్‌లను కలిగి ఉంది.
సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16MP ఫ్రంట్ కెమెరా కూడా ఉంది. ఆండ్రాయిడ్ 15 ఆధారంగా ఆక్సిజన్ OS15పై రన్ అయ్యే ఈ స్మార్ట్‌ఫోన్ గూగుల్ జెమిని నుంచి అత్యాధునిక AI ఫీచర్లతో లోడ్ అయింది. వన్‌ప్లస్ 13R ఫోన్ నెబ్యులా నోయిర్, ఆస్ట్రల్ ట్రైల్ అనే రెండు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.