OnePlus 13R Price
OnePlus 13R Price : కొత్త వన్ ప్లస్ ఫోన్ కావాలా? మిడ్ రేంజ్ స్మార్ట్‌ఫోన్లలో ఒకటైన వన్‌ప్లస్ 13R (OnePlus 13R) ధర భారీగా తగ్గింది. ఆకర్షణీయమైన డిస్‌ప్లే నుంచి ఆకట్టుకునే కెమెరాలు, పర్ఫార్మెన్స్, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టు వరకు హ్యాండ్‌సెట్ అన్నింటినీ అందిస్తుంది.
Read Also : Vivo V50 Elite Edition : వివో లవర్స్ కొనాల్సిన ఫోన్.. మీ బడ్జెట్ ధరలోనే.. ఫీచర్ల కోసమైన కొనేసుకోండి..!
ఫ్లిప్‌కార్ట్‌లో ఈ వన్‌ప్లస్ 13R ఫోన్ రూ. 38వేల లోపు ధరకే సొంతం చేసుకోవచ్చు. మీరు కూడా ప్రీమియం ఫోన్ కోసం చూస్తుంటే.. వన్‌ప్లస్ 13R ముందుగా వన్‌ప్లస్ 13తో పాటు లాంచ్ అయింది. రూ. 38వేల కన్నా తక్కువ ధరకు ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
ఫ్లిప్‌కార్ట్‌లో వన్‌ప్లస్ 13R ధర :
రూ.42,999 ప్రారంభ ధరతో లాంచ్ అయిన వన్‌ప్లస్ 13R ప్రస్తుతం రూ.39,788కి అందుబాటులో ఉంది. రూ.3,211 ఫ్లాట్ డిస్కౌంట్‌ను ఆఫర్ చేస్తోంది.
ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ హోల్డర్లు ఈఎంఐతో అదనంగా రూ.1,985 తగ్గింపును పొందవచ్చు. కొనుగోలుదారులు ఫోన్‌ను నెబ్యులా నోయిర్, ఆస్ట్రల్ ట్రైల్ కలర్ ఆప్షన్లలో పొందవచ్చు.
వన్‌ప్లస్ 13R స్పెసిఫికేషన్లు :
వన్‌ప్లస్ 13R 5G ఫోన్ 6.78-అంగుళాల 1.5K LTPO 4.1 అమోల్డ్ ప్యానెల్‌ను 120Hz రిఫ్రెష్ రేట్, 4,500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో కలిగి ఉంది.
డిస్‌ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ద్వారా కూడా ప్రొటెక్షన్ అందిస్తుంది. వన్‌ప్లస్ 13Rలో స్నాప్‌డ్రాగన్ 8 జనరేషన్ 3 ప్రాసెసర్ ఉంది. 16GB వరకు LPDDR5x ర్యామ్, 512GB UFS 4.0తో వస్తుంది.
Read Also : Samsung Galaxy S24 Ultra : కొంటే ఇలాంటి శాంసంగ్ ఫోన్ కొనాలి.. ఈ 5G ఫోన్ క్రేజ్ తెలిస్తే కొనేవరకు ఉండలేరు..!
ఫోటోగ్రఫీ విషయానికి వస్తే.. వన్‌ప్లస్ ఫోన్ 50MP ప్రైమరీ షూటర్, 8MP అల్ట్రా-వైడ్ సెన్సార్, 50MP టెలిఫోటో లెన్స్‌తో వస్తుంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాను కలిగి ఉంది.