OnePlus 13s Price Cut : అద్భుతమైన డిస్కౌంట్.. ఫ్లిప్‌కార్ట్‌లో వన్‌ప్లస్ 13s ఫోన్ అతి తక్కువ ధరకే.. ఇలాంటి డీల్ మళ్లీ రాదు భయ్యా..!

OnePlus 13s Price Cut : ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడమ్ సేల్ 2025 ప్రస్తుతం వన్‌ప్లస్ 13s స్మార్ట్‌ఫోన్‌పై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది.

OnePlus 13s Price Cut

OnePlus 13s Price Cut : కొత్త వన్‌ప్లస్ ఫోన్ కోసం చూస్తున్నారా? వన్‌ప్లస్ 13s భారీ తగ్గింపు ధరకే లభిస్తోంది. ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడమ్ సేల్ 2025 సెప్టెంబర్ 8 వరకు (OnePlus 13s Price Cut) అందుబాటులో ఉంటుంది. ఈ సేల్ సమయంలో కొన్ని బెస్ట్ స్మార్ట్‌ఫోన్లపై అద్భుతమైన ఆఫర్లను అందిస్తోంది. ఇప్పుడు, వన్‌ప్లస్ 13sపై రూ. 11వేలు కన్నా ఎక్కువ డిస్కౌంట్ పొందవచ్చు. ఈ బెస్ట్ ఫ్లాగ్‌షిప్ ఆండ్రాయిడ్ డీల్‌ అసలు వదులుకోవద్దు. ఇంతకీ ఈ ఆఫర్ ఎలా పొందాలంటే?

వన్‌ప్లస్ 13s డీల్ :
ప్రస్తుతం వన్‌ప్లస్ 13s ఫోన్ (12GB ర్యామ్, 256GB స్టోరేజ్, పింక్ శాటిన్ వేరియంట్) ఫ్లిప్‌కార్ట్‌లో రూ.51,899కి అమ్ముడవుతోంది. లాంచ్ ధర రూ.54,999 నుంచి తగ్గింది. రూ.3,100 ముందస్తు డిస్కౌంట్ పొందవచ్చు.

Read Also : Jio SIM Cards : జియో యూజర్లకు పండగే.. ఇకపై మీ ఫ్యామిలీలో ఒకే నంబర్‌తో సిమ్ కార్డులు తీసుకోవచ్చు.. ఇదిగో సింపుల్ ప్రాసెస్..!

మీ దగ్గర పాత ఫోన్ ఉంటే.. ఫ్లిప్‌కార్ట్ ఎక్స్ఛేంజ్ ఆఫర్‌తో రూ.25వేల వరకు డిస్కౌంట్ పొందవచ్చు. ఉదాహరణకు.. వన్‌ప్లస్ నార్డ్ 4తో ట్రేడింగ్ చేస్తే మీకు రూ.8,250 వరకు ఎక్స్ఛేంజ్ వాల్యూ వస్తుంది. మీ మొత్తం సేవింగ్స్ దాదాపు రూ.11,350కి పెరుగుతుంది.

వన్‌ప్లస్ 13s స్పెసిఫికేషన్లు :
వన్‌ప్లస్ 13s హుడ్ కింద స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్‌తో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.32-అంగుళాల LTPO అమోల్డ్ డిస్‌ప్లేతో వస్తుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆధారంగా ఆక్సిజన్ OS 15పై రన్ అవుతుంది. దుమ్ము, నీటి నిరోధకతకు IP65 రేటింగ్‌ను కలిగి ఉంది.

కెమెరా పరంగా పరిశీలిస్తే.. 50MP ప్రైమరీ కెమెరా (OIS), 2x ఆప్టికల్ జూమ్‌తో 50MP టెలిఫోటో లెన్స్‌ కలిగి ఉంది. ఫ్రంట్ సైడ్ 32MP సెల్ఫీ షూటర్‌ కూడా ఉంది. హై క్వాలిటీ వీడియో కాల్స్, సెల్ఫీలకు బెస్ట్. 80W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్టుతో భారీ 5850mAh బ్యాటరీ కలిగి ఉంది.