Jio SIM Cards : జియో యూజర్లకు పండగే.. ఇకపై మీ ఫ్యామిలీలో ఒకే నంబర్‌తో సిమ్ కార్డులు తీసుకోవచ్చు.. ఇదిగో సింపుల్ ప్రాసెస్..!

Jio SIM Cards : జియో తమ యూజర్ల కోసం అద్భుతమైన సర్వీసును అందిస్తుంది. కుటుంబ సభ్యులకు ఒకే మొబైల్ నంబర్‌ను పొందవచ్చు.

Jio SIM Cards : జియో యూజర్లకు పండగే.. ఇకపై మీ ఫ్యామిలీలో ఒకే నంబర్‌తో సిమ్ కార్డులు తీసుకోవచ్చు.. ఇదిగో సింపుల్ ప్రాసెస్..!

Jio Prepaid Plans

Updated On : August 6, 2025 / 6:09 PM IST

Jio SIM Cards : జియో యూజర్లకు అద్భుతమైన న్యూస్.. మీ ఫ్యామిలీలో ఒక్కొక్కరికి ఒక్కో మొబైల్ నెంబర్ అక్కర్లేదు. ఒకే మొబైల్ నెంబర్‌తో అనేక కొత్త మొబైల్ సిమ్ కార్డులు తీసుకోవచ్చు.
మీతో పాటు మీ కుటుంబ సభ్యుల కోసం ఒకే మొబైల్ నంబర్‌ను ఎంచుకోవచ్చు. ప్రస్తుత రోజుల్లో మొబైల్ నంబర్లు ఫోన్‌లో సేవ్ చేస్తుంటారు.

ఇంట్లోని ప్రతి సభ్యుడి మొబైల్ నంబర్‌ను గుర్తుంచుకోవడం కష్టమే. కొంతమంది తమ కుటుంబ సభ్యుల నెంబర్లను ఒకటి లేదా రెండు నంబర్‌లను మాత్రమే గుర్తుంచుకుంటారు. అదే మొబైల్ నంబర్‌లు ఒకేలా ఉంటే సులభంగా గుర్తుంచవచ్చు.

దాంతో పిల్లలు కూడా ఫోన్ నంబర్‌లను సులభంగా గుర్తుంచుకోగలరు. మీరు జియో నంబర్‌ను ఉపయోగిస్తే.. మీ కుటుంబ సభ్యుల కోసం అదే నంబర్‌ను పొందవచ్చు. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

జియో ఫ్యామిలీ మ్యాచింగ్ నంబర్ ఏంటి? :
జియో ఫ్యామిలీ మ్యాచింగ్ నంబర్ అనేది ప్రస్తుత జియో నంబర్‌ మాదిరిగా ఉండే కొత్త జియో మొబైల్ నంబర్‌ను ఎంచుకోవచ్చు. మీ కుటుంబ సభ్యుని మొబైల్ నంబర్‌‌ను సులభంగా పొందవచ్చు. జియో ఛాయిస్ నంబర్ సర్వీసు ద్వారా పొందవచ్చు.

Read Also : Meta Matt Deitke : AI రేసులో తీవ్ర పోటీ.. ఈ 24 ఏళ్ల యువకుడికి మెటాలో రూ. 2,196 కోట్ల భారీ ప్యాకేజీ.. ఏఐ రీసెర్చర్ మాట్ డైట్కే ఎవరంటే?

మ్యాచింగ్ నెంబర్ కోసం రెండు మార్గాలివే :
వినియోగదారులు ఒకే నంబర్‌ను పొందడానికి 2 మార్గాలు ఉన్నాయి. జియో రిటైల్ అవుట్‌లెట్‌ను విజిట్ చేయొచ్చు. ప్రముఖ టెలికాం కంపెనీ www.jio.com అధికారిక వెబ్‌సైట్‌ను విజిట్ చేయడం ద్వారా అదే నంబర్‌ను పొందవచ్చు.

మీరు ఆన్‌లైన్‌లో మీకు ఇష్టమైన మ్యాచింగ్ నంబర్‌ను ఎంచుకుని కొత్త జియో సిమ్‌తో యాక్టివేట్ చేయాలి. మీరు కొత్త సిమ్‌తో మాత్రమే మీకు ఇష్టమైన నంబర్‌ను పొందగలరు. ఇప్పటికే ఉన్న మొబైల్ నంబర్‌లో ఎలాంటి మార్పు ఉండదు.

వెబ్‌సైట్‌లో ఇలా ఫాలో అవ్వండి :

  • ముందుగా మీరు జియో అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లాలి. ఆ తర్వాత ఛాయిస్ నంబర్ ఆప్షన్ కోసం సెర్చ్ చేయాలి.
  • మీ ప్రస్తుత జియో నంబర్‌ను ఎంటర్ చేయాలి. జనరేట్ OTP ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
  • మీ నంబర్‌కు OTP వస్తుంది. స్క్రీన్‌పై కనిపించే బాక్స్‌లో OTP ఎంటర్ చేయాలి.
  • వెంటనే అన్ని మ్యాచింగ్ ఫోన్ నంబర్లు స్క్రీన్‌పై కనిపిస్తాయి.
  • మీకు నచ్చిన నంబర్‌ను ఎంచుకోండి. మీకు సేమ్ నంబర్ బుక్ అవుతుంది. సిమ్ ఫ్రీగా వస్తుంది.

జియో ఫ్యామిలీ మ్యాచింగ్ నంబర్ ప్రత్యేకత ఏమిటంటే.. మీరు www.jio.com లేదా MyJio యాప్ ద్వారా అందుబాటులో ఉన్న ఏదైనా జియో పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌కు మారవచ్చు. ప్లాన్‌లను మార్చుకునేటప్పుడు మీరు జియో అథెంటికేషన్ ప్రక్రియ ప్రకారం వర్తించే పేమెంట్లను చేయాల్సి ఉంటుంది.

జియో కొత్త ప్లాన్ :
ఇటీవలే జియో తమ యూజర్ల కోసం సరసమైన ప్లాన్‌ ప్రవేశపెట్టింది. ఈ రీఛార్జ్ ప్లాన్ ధర రూ. 189 మాత్రమే. ఈ ప్లాన్‌లో వినియోగదారులు 2GB హైస్పీడ్ డేటా పొందవచ్చు. ఈ ప్లాన్ అన్‌లిమిటెడ్ కాలింగ్, ప్రతిరోజూ 100 ఫ్రీ SMS వంటి సౌకర్యాలతో వస్తుంది. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులు ఉంటుంది.