OnePlus Nord Buds 4 : వన్‌ప్లస్ నార్డ్ బడ్స్ 4 ఫస్ట్ సేల్.. 54 గంటల బ్యాటరీ లైఫ్ అదుర్స్, ఇలా కొన్నారంటే చౌకైన ధరకే..!
OnePlus Nord Buds 4 : గత వారమే భారత మార్కెట్లో వన్‌ప్లస్ నార్డ్ బడ్స్ 4 లాంచ్ అయ్యాయి. ఈ ఇయర్‌బడ్స్ సేల్స్ ఈ రోజు నుంచి ఆన్లైన్, ఆఫ్‌లైన్‌లో అందుబాటులో ఉన్నాయి.
OnePlus Nord Buds 4
- వన్‌ప్లస్ నార్డ్ బడ్స్ 4 భారత మార్కెట్లో లాంచ్
- కేస్, బ్యాటరీ 54 గంటల వరకు రన్నింగ్
- ఏఐ కాల్ నాయిస్ క్యాన్సిలేషన్ ఆప్షన్
- 12mm టైటానియం లేయర్ డైనమిక్ డ్రైవర్లు
OnePlus Nord Buds 4 : కొత్త వన్‌ప్లస్ నార్డ్ బడ్స్ ఫస్ట్ సేల్ మొదలైంది. గత వారమే భారత మార్కెట్లో వన్‌ప్లస్ నార్డ్ బడ్స్ 4 లాంచ్ అయ్యాయి. ఈ ఇయర్‌బడ్స్ సేల్స్ ఆన్లైన్, ఆఫ్‌లైన్‌లో అందుబాటులో ఉన్నాయి. వన్‌ప్లస్ నార్డ్ బడ్స్ 4లో 52dB వరకు యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ (ANC), ట్రాన్స్పరెంట్ మోడ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
ఈ ఇయర్‌బడ్స్ సింగిల్ ఛార్జ్‌పై 54 గంటల వరకు రన్ అవుతాయి. ఈ ఇయర్‌బడ్స్‌కు IP55 రేటింగ్ ఉంది. నీళ్లు, చెమట నుంచి ప్రొటెక్షన్ కూడా అందిస్తుంది. వన్‌ప్లస్ నార్డ్ బడ్స్ 4 ధర, ఆఫర్లు, ఫీచర్లు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
నార్డ్ బడ్స్ 4 ధర ఎంత? :
ధర విషయానికి వస్తే.. వన్‌ప్లస్ నార్డ్ బడ్స్ 4 ధర రూ. 3,299 మాత్రమే. ఈ ఇయర్‌బడ్స్ వన్‌ప్లస్ అధికారిక సైట్లో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సైట్లలో అమ్మకానికి అందుబాటులో ఉన్నాయి. లాంచ్ ఆఫర్లలో భాగంగా ఈ ఇయర్‌బడ్స్ రూ. 3,099 స్పెషల్ డిస్కౌంట్ ధరకు లభిస్తున్నాయి.
అద్భుతమైన ఫీచర్లు :
వన్‌ప్లస్ నార్డ్ బడ్స్ 4లో 12mm టైటానియం లేయర్ డైనమిక్ డ్రైవర్లు ఉన్నాయి. ఈ ఇయర్‌బడ్స్ 52dB వరకు యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ (ANC)కు సపోర్టు ఇస్తాయి. ఇందులో ట్రాన్స్పరెంట్ మోడ్ కూడా ఉంది. క్లియర్ కాల్స్ కోసం 6 మైక్రోఫోన్లు, ఏఐ కాల్ నాయిస్ క్యాన్సిలేషన్ ఉన్నాయి.
Read Also : Xiaomi 18 Leak : 7,200mAh బ్యాటరీ, 200MP కెమెరాతో కొత్త షావోమీ 18 వచ్చేస్తోందోచ్.. ఫుల్ ఫీచర్లు లీక్..
అలారాలు, రిమైండర్లు, వాతావరణం, ఏఐ ప్రాంప్ట్‌లు యాక్సెస్ కోసం వినియోగదారులు ఏఐ అసిస్టెంట్‌ను ఎనేబుల్ చేయవచ్చు. అలాగే, ఏఐ ట్రాన్స్‌లేట్ పర్సనల్ ట్రాన్స్ లేటర్ అందిస్తుంది. రియల్-టైమ్ ట్రాన్స్ లేషన్ కోసం ఎంపిక చేసిన వన్‌ప్లస్ ఫోన్లో కూడా యాక్సస్ చేయొచ్చు.
నార్డ్ బడ్స్ 4లో 62mAh బ్యాటరీ, కేస్‌లో 530mAh బ్యాటరీ ఉన్నాయి. ఏఎన్సీ ఆన్‌లో ఉన్నప్పుడు బ్యాటరీ 6.5 గంటల వరకు కేస్‌తో కలిపి 27 గంటల వరకు రన్ అవుతుంది. ANC ఆఫ్‌లో ఉన్నప్పుడు బ్యాటరీ 13 గంటల వరకు, కేస్‌తో కలిపి 54 గంటల వరకు రన్ అవుతుంది.
10 నిమిషాల ఛార్జ్‌తో యూజర్లు 11 గంటల వరకు మ్యూజిక్ ప్లేబ్యాక్ పొందవచ్చు. ఈ ఇయర్‌బడ్స్‌కు IP55 రేటింగ్ ఉంది. నీళ్లు, చెమట తాకినా సమస్య ఉండదు. కొలతల పరంగా పరిశీలిస్తే.. ఈ ఇయర్‌బడ్స్ 29.56mm పొడవు, 19.69mm వెడల్పు, 22.63mm మందంతో 4.3 గ్రాముల బరువు ఉంటాయి.
