Onion
Onion : త్వరలో లోక్‌సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పెరుగుతున్న ఉల్లి ధరలకు కేంద్రం కళ్లెం వేసింది. ఉల్లి ధరలు పెరిగితే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత వస్తుందనే భయంతో ఉల్లి ఎగుమతులను కేంద్రం నిషేధించింది. ఉల్లి ఎగుమతిపై కేంద్రం నిషేధం ప్రకటించిన నేపథ్యంలో ఉల్లి రైతులు శుక్రవారం నాసిక్‌లోని మూడు చోట్ల రద్దీగా ఉండే ముంబై-ఆగ్రా హైవేను దిగ్బంధించారు. నాసిక్ జిల్లాలోని హోల్‌సేల్ మార్కెట్‌లలో ఉల్లి వేలాన్ని నిరవధికంగా నిలిపివేయాలని నిర్ణయించారు.
ALSO READ : Sonia Gandhi : సోనియాకు ప్రధాని మోదీ జన్మదిన శుభాకాంక్షలు
దేశీయంగా ఉల్లి లభ్యత పెంచడం ద్వారా, ధరలను అదుపు చేసేందుకు వచ్చే ఏడాది మార్చి 31వతేదీ వరకు ఉల్లి ఎగుమతులను కేంద్రం నిషేధించింది. దీనికి నిరసనగా చందవాడ్‌లో జరిగిన నాసిక్ జిల్లా ఉల్లి వ్యాపారుల సంఘం సమావేశంలో శనివారం నుంచి వేలం నిలిపివేయాలని నిర్ణయించారు. ఉల్లి ఎగుమతి నిషేధంపై నిర్ణయం తీసుకునే ముందు ప్రభుత్వం కనీసం వారం రోజుల ముందుగానే అల్టిమేటం ఇచ్చి ఉండాల్సిందని, దీనివల్ల వ్యాపారులంతా ఇప్పుడు గందరగోళంలో ఉన్నారని నాసిక్ జిల్లా ఉల్లి వ్యాపారుల సంఘం అధ్యక్షుడు ఖండూ డియోర్ చెప్పారు.
ALSO READ : CM Reventh Reddy : నేటి నుంచి ఉచిత బస్సు, ఆరోగ్య శ్రీ..రేవంత్ స్పీడ్
ముంబయికు 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న నాసిక్ జిల్లాలోని లాసల్‌గావ్, చందవాడ్, నంద్‌గావ్, దిండోరి, యోలా, ఉమరానే, ఇతర ప్రాంతాలలోని ఉల్లిపాయల మార్కెట్‌లలో శుక్రవారం రైతులు వేలం నిలిపివేశారు. లాసల్‌గావ్ అగ్రికల్చర్ ప్రొడ్యూస్ మార్కెట్ కమిటీలో వేలం జరగలేదు. శుక్రవారం 600 వాహనాల్లో ఉల్లిగడ్డలు వించూరుకు వచ్చాయి. లాసల్‌గావ్‌లోని రైతులు మార్కెట్ ధరలు తగ్గుతాయనే భయంతో వేలానికి అనుమతించలేదని ఓ అధికారి తెలిపారు.
ALSO READ : Telangana Assembly Session : తెలంగాణ అసెంబ్లీ తొలి సమావేశాల్లో కొత్త ఎమ్మెల్యేల సందడి
ముంబయి-ఆగ్రా హైవేపై వందలాది మంది రైతులు గుమిగూడి మూడు చోట్ల ట్రాక్టర్లను ఉపయోగించి రహదారిని దిగ్బంధించారు. కేంద్రం చర్యకు వ్యతిరేకంగా మాలెగావ్‌లోని జైఖేడా, చాంద్‌వాడ్, ఉమరానే, నంద్‌గావ్, ముంగ్సేలో ఉల్లి రైతులు రాస్తారోకోలు చేశారు. ప్రస్తుతం ఉల్లి క్వింటాల్‌కు రూ.1000 నుంచి రూ.1200 ధర వరకు పలుకుతున్నప్పటికీ ప్రజలకు క్వింటాల్‌కు రూ.3 వేలకు విక్రయిస్తున్నారని, దళారులు రేట్లు పెంచుతున్నారని రైతులు మండిపడ్డారు.
ALSO READ : Odisha : ఒడీశా మద్యం వ్యాపారి నివాసంలో నోట్ల గుట్టలు
మధ్య దళారులు ఉండకూడదని, ఉల్లిని నేరుగా విక్రయించేలా ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలని రైతులు డిమాండ్ చేశారు. అకాల వర్షాలు, వడగళ్ల వాన కారణంగా రైతులు నష్టపోయారు. మొక్కజొన్న, ఉల్లి పంటలు దెబ్బతిన్నాయి. వీలైనంత త్వరగా ఉల్లిపై ఎగుమతి నిషేధాన్ని ఉపసంహరించుకోవాలని రైతులు డిమాండ్ చేశారు.
ALSO READ : KCR : తెలంగాణ ప్రతిపక్ష నేతగా కేసీఆర్
వినియోగదారులకు ఉపశమనం కలిగించేందుకు రిటైల్ మార్కెట్‌లో కిలోకు రూ.25 సబ్సిడీపై బఫర్ ఉల్లి స్టాక్‌ను విక్రయించాలని అక్టోబర్‌లో కేంద్రం నిర్ణయించింది. ధరలను నియంత్రించేందుకు ప్రభుత్వం ఈ ఏడాది అక్టోబర్ 28 నుంచి డిసెంబర్ 31 వరకు ఉల్లి ఎగుమతులపై టన్నుకు 800 డాలర్ల కనీస ఎగుమతి ధర విధించింది. మొత్తం మీద కేంద్రం ఉల్లి ఎగుమతిపై నిషేధాస్త్రంతో వీటి ధరలు దిగిరానున్నాయి.