Sonia Gandhi : సోనియాకు ప్రధాని మోదీ జన్మదిన శుభాకాంక్షలు

కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకురాలు సోనియాగాంధీ 77వ జన్మదినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ శనివారం ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. సోనియా గాంధీ 77వ జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ఆమెకు శుభాకాంక్షలు తెలియజేసి, ఆమె సుదీర్ఘకాలం ఆరోగ్యంగా జీవించాలని ప్రార్థించారు....

Sonia Gandhi : సోనియాకు ప్రధాని మోదీ జన్మదిన శుభాకాంక్షలు

Sonia Gandhi,PM Modi

Updated On : December 9, 2023 / 11:02 AM IST

Sonia Gandhi : కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకురాలు సోనియాగాంధీ 77వ జన్మదినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ శనివారం ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. సోనియా గాంధీ 77వ జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ఆమెకు శుభాకాంక్షలు తెలియజేసి, ఆమె సుదీర్ఘకాలం ఆరోగ్యంగా జీవించాలని ప్రార్థించారు. ‘‘శ్రీమతి సోనియా గాంధీ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆమె సుదీర్ఘమైన, ఆరోగ్యవంతమైన జీవితాన్నిఇవ్వాలని కోరుకుంటున్నాను’’ అని ప్రధాని ఎక్స్‌లో రాశారు.

ALSO READ : Prime Minister Narendra Modi : గ్లోబల్ లీడర్ నరేంద్రమోదీకే అత్యధిక ప్రజాదరణ

ప్రధానమంత్రి మోదీతో పాటు, కాంగ్రెస్‌కు చెందిన మల్లికార్జున్ ఖర్గే,కేసీ వేణుగోపాల్, శశి థరూర్, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ తదితరులు కాంగ్రెస్ మాజీ చీఫ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం నిస్వార్థంగా పోరాడిన సోనియమ్మకు ఆరోగ్యకరమైన జీవితాన్ని ప్రసాదించాలని దేవుడిని కోరుకుంటున్నానని మల్లికార్జున్ ఖర్గే పేర్కొన్నారు.


ప్రజాసేవ పట్ల సోనియాగాంధీ చూపిన నిబద్ధత, సమాజంలోని పేద, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతితో శతకోటి హృదయాలను గెలుచుకున్నారని వేణుగోపాల్ అన్నారు.

ALSO READ : Telangana Assembly Session : తెలంగాణ అసెంబ్లీ తొలి సమావేశాల్లో కొత్త ఎమ్మెల్యేల సందడి

‘‘సోనియాగాంధీ జీవిత ప్రయాణం మనందరికీ స్ఫూర్తిదాయకం. ఆమె ఎంతో సంయమనంతో అత్యంత సవాళ్లతో కూడిన కాలంలో కాంగ్రెస్‌ను నడిపించారు, అందరికీ సంక్షేమాన్ని అందించి, దేశాభివృద్ధిని అందించిన యూపీఏ ప్రభుత్వ రూపశిల్పి’’ అని కేసీ వేణుగోపాల్ పేర్కొన్నారు. సోనియమ్మ కాంగ్రెస్‌ను గొప్పగా నడిపించారని, కార్యకర్తలందరికీ స్ఫూర్తిదాయకంగా కొనసాగుతున్నారని శశిథరూర్ కొనియాడారు.