Prime Minister Narendra Modi : గ్లోబల్ లీడర్ నరేంద్రమోదీకే అత్యధిక ప్రజాదరణ

గ్లోబల్ లీడర్స్ జాబితాలో మళ్లీ భారత ప్రధాని నరేంద్ర మోదీ అగ్రస్థానంలో నిలిచారు. గ్లోబల్ లీడర్స్ సర్వేలో అత్యధికంగా 76శాతం ఆమోద రేటింగ్‌తో ప్రపంచ నాయకుల్లోనే ప్రధాని మోదీ అగ్రస్థానంలో ఉన్నారు....

Prime Minister Narendra Modi : గ్లోబల్ లీడర్ నరేంద్రమోదీకే అత్యధిక ప్రజాదరణ

Prime Minister Narendra Modi

Updated On : December 9, 2023 / 10:34 AM IST

Prime Minister Narendra Modi : గ్లోబల్ లీడర్స్ జాబితాలో మళ్లీ భారత ప్రధాని నరేంద్ర మోదీ అగ్రస్థానంలో నిలిచారు. గ్లోబల్ లీడర్స్ సర్వేలో అత్యధికంగా 76శాతం ఆమోద రేటింగ్‌తో ప్రపంచ నాయకుల్లోనే ప్రధాని మోదీ అగ్రస్థానంలో ఉన్నారు. యూఎస్‌కు చెందిన కన్సల్టెన్సీ సంస్థ గ్లోబల్ లీడర్ అప్రూవల్ రేటింగ్ ట్రాకర్ ప్రకారం భారతదేశంలో 76 శాతం మంది ప్రజలు ప్రధాని మోదీ నాయకత్వాన్ని ఆమోదించారు. కేవలం 18 శాతం మంది మోదీని ఆమోదించలేదు.

ALSO READ : Telangana Assembly Session : తెలంగాణ అసెంబ్లీ తొలి సమావేశాల్లో కొత్త ఎమ్మెల్యేల సందడి

మరో ఆరు శాతం మంది ఎలాంటి అభిప్రాయం చెప్పలేదు. మెక్సికో ప్రెసిడెంట్ ఆండ్రెస్ మాన్యుయెల్ లోపెజ్ ఒబ్రాడోర్ కు 66 శాతం, స్విట్జర్లాండ్ ప్రెసిడెంట్ అలైన్ బెర్సెట్ 58 శాతం ఆమోద రేటింగ్‌ను పొందారు. ఈ సర్వేలో అమెరికా అధ్యక్షుడు జో బిడెన్‌కు 37 శాతం మంది, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోకు 31 శాతం, బ్రిటన్ ప్రధాని రిషి సునక్‌కి 25 శాతం మంది, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌కు కేవలం 24 శాతం మంది ప్రజల ఆమోదం లభించింది.

ALSO READ : Telangana Assembly Session : తెలంగాణ అసెంబ్లీ తొలి సమావేశాల్లో కొత్త ఎమ్మెల్యేల సందడి

గత సర్వేల్లోనూ గ్లోబల్ రేటింగ్స్‌లో ప్రధాని మోదీ అగ్రస్థానంలో నిలిచారు. అదే సమయంలో ఇతర పెద్ద ప్రపంచ నాయకుల ఆమోద రేటింగ్‌లు తక్కువగా ఉన్నాయి. ఉత్తరాది రాష్ట్రాలైన మధ్యప్రదేశ్, రాజస్థాన్,ఛత్తీస్‌గఢ్‌లలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ప్రధాని మోదీ నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ భారీ విజయాలను నమోదు చేసిన తర్వాత ఈ రేటింగ్‌లు వచ్చాయి.2024లో జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రధాని మోదీకి, ఆయన పార్టీకి గ్లోబల్ రేటింగ్ భారీ ప్రోత్సాహకంగా పరిగణించవచ్చు.