Angel & Rocket: హైదరాబాద్‌లో ఏంజెల్ & రాకెట్ రెండవ ఔట్‌లెట్ ప్రారంభం
డిజైన్,నాణ్యత పట్ల అమిత శ్రద్ధ చూపే ఏంజెల్ & రాకెట్, తమ వినియోగదారులకు రాజీలేనటువంటి రీతిలోవస్త్రాలు అందిస్తుంది. ‘బై బెటర్, వియర్ లాంగర్.హ్యాండ్ డౌన్’ అనే దానిపై నడుస్తూనే ట్రెండ్స్‌కు అనుగుణంగా తమ వస్త్రాలను రూపొందిస్తుంటుంది

Angel & Rocket: శరత్ సిటీక్యాపిటల్ మాల్‌లో తమ తొలి స్టోర్ సాధించిన విజయం అందించిన స్ఫూర్తితో కిడ్స్ క్లాతింగ్ స్టోర్, ఏంజెల్ & రాకెట్ తమ తలుపులను బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లో తెరిచింది. ఈనూతన స్టోర్ 1588 చదరపుఅడుగుల విస్తీర్ణంలో ఉండటంతో పాటుగా బ్రాండ్ యొక్క స్ర్పింగ్ సమ్మర్ కలెక్షన్ ప్రదర్శించనుంది.
డిజైన్,నాణ్యత పట్ల అమిత శ్రద్ధ చూపే ఏంజెల్ & రాకెట్, తమ వినియోగదారులకు రాజీలేనటువంటి రీతిలోవస్త్రాలు అందిస్తుంది. ‘బై బెటర్, వియర్ లాంగర్.హ్యాండ్ డౌన్’ అనే దానిపై నడుస్తూనే ట్రెండ్స్‌కు అనుగుణంగా తమ వస్త్రాలను రూపొందిస్తుంటుంది. ఈ వస్త్రాలన్నీ కూడా పర్యావరణ అనుకూలంగానే ఉంటాయి. ఈవస్త్రాలను యుకెలో డిజైన్ చేయడంతో పాటుగా ప్రపంచవ్యాప్తంగా నీతివంతమైనఫ్యాక్టరీలలో తయారుచేస్తున్నారు. ఏంజెల్ & రాకెట్ న్యాయమైన వాణిజ్యం చేయడంతో పాటుగారీసైకిల్డ్ పాలిస్టర్ ఫ్యాబ్రిక్స్,ఆర్గానిక్ కాటన్స్ వినియోగిస్తుంది.
ఈ నూతన స్టోర్ ప్రారంభం సందర్భంగా కో–ఫౌండర్ ఎస్‌చెందురన్ మాట్లాడుతూ ‘‘నా భాగస్వామిలూయిస్ బోస్టోక్, తాను రెండవ స్టోర్‌ను హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో ప్రారంభించడం పట్ల చాలా సంతోంగా ఉన్నాము. శరత్ సిటీ క్యాపిటల్ మాల్‌లో ఏర్పాటుచేసిన తమ మొదటి స్టోర్‌కు చక్కటి స్పందన అందుకున్నాము. కిడ్స్‌వేర్‌కు ఈ తరహా ఆదరణ లభించడం ఆనందంగా ఉంది. డిమాండ్ ధోరణి కనిపిస్తుండటం, ఫ్యాషన్‌లు కూడా పెరుగుతుండటం చేత ఏంజెల్ & రాకెట్ లాంటి బ్రాండ్లకు ప్రీమియం నాణ్యత కలిగినకిడ్స్‌వేర్ క్లాతింగ్ అందించే అవకాశం కలుగుతుంది’’ అని అన్నారు.