Zero Toll Tax : బంపర్ ఆఫర్.. అక్కడ ఎలక్ట్రిక్ వాహనాలకి టోల్ ఫీజు లేదు..

Zero Toll Tax : ఆగస్టు 22, 2025 నుంచి ముంబైలోని ఎలక్ట్రిక్ కార్లు అటల్ సేతుపై టోల్ ఫ్రీ ప్రయాణాన్ని అందిస్తుంది.

Zero Toll Tax : బంపర్ ఆఫర్.. అక్కడ ఎలక్ట్రిక్ వాహనాలకి టోల్ ఫీజు లేదు..

Zero Toll Tax

Updated On : August 23, 2025 / 4:46 PM IST

Zero Toll Tax : ఎలక్ట్రిక్ వాహనదారులకు గుడ్ న్యూస్.. ఈ రాష్ట్రంలోని ఈవీ వాహనదారులు ఇకపై టోల్ ఫీజు చెల్లించనక్కర్లేదు. ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించేందుకు (Zero Toll Tax) మహారాష్ట్ర ప్రభుత్వం ఈ దిశగా నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోనే అతి పొడవైన రహదారి ‘అటల్ సేతు’పై ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాలు టోల్ పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు.

ఈ నిర్ణయం ఆగస్టు 22 నుంచి అమలులోకి వచ్చింది. సాధారణంగా ఈ మార్గంలో వెళ్లే వాహనదారులకు టోల్ ఫీజులతో ఎక్కువ ఖర్చవుతుంది. దాంతో ఈ టోల్ రేట్లపై సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ఆందోళనలను లేవనెత్తారు. కొత్త ఈవీ పాలసీ 2025 ప్రకారం.. మహారాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు బిగ్ రిలీఫ్ ప్రకటించింది. అటల్ సేతుపై ఎలక్ట్రిక్ వాహనాలకు టోల్ నుంచి మినహాయింపు అందిస్తోంది.

టోల్ మినహాయింపు అమల్లోకి :
ఆగస్టు 22, 2025 నుంచి అన్ని ఎలక్ట్రిక్ ఫోర్-వీలర్ వాహనాలకు ఈ వంతెనపై టోల్-ఫ్రీ పేమెంట్ నుంచి మినహాయింపు అందిస్తుంది. పట్టణాభివృద్ధి శాఖ ప్రభుత్వ నోటిఫికేషన్ ప్రకారం.. ఈ మినహాయింపు రాష్ట్ర రవాణా సంస్థలు (STU) లేదా నాన్-STU ఆపరేటర్లు నిర్వహిస్తున్న ఎలక్ట్రిక్ ఫోర్-వీలర్లు (కేటగిరీ M1), ఎలక్ట్రిక్ బస్సులు (కేటగిరీలు M3, M4) వర్తిస్తాయి. అయితే, ఎలక్ట్రిక్ గూడ్స్ క్యారియర్లను ఈ పథకంలో చేర్చలేదు.

Read Also : Ethanol Blending : పాత కారు, బైక్ కొంటున్నారా జాగ్రత్త.. ఈ ఎఫెక్ట్‌తో తుక్కుకి వేయడమే..!

ఈవీ వాహనాలకు టోల్ మినహాయింపు :
అటల్ సేతు కారిడార్‌లోని శివాజీ నగర్, గవాన్‌లోని కలెక్షన్ సెంటర్లలో టోల్ మినహాయింపు ప్రత్యేకంగా వర్తిస్తుంది. జనవరి 31, 2025 నాటి తీర్మానంపై విస్తరించింది. డిసెంబర్ 31, 2025 వరకు వంతెన ద్వారా వెళ్లే అన్ని వాహనాలకు టోల్ ఛార్జీలను నిర్ణయించింది. ఇప్పుడు, క్లీనర్ మొబిలిటీని ప్రోత్సహించేందుకు మహారాష్ట్ర ప్రోత్సాహానికి అనుగుణంగా ఈవీలకు స్పష్టమైన మినహాయింపు లభిస్తుంది.

మరో విషయం ఏమిటంటే.. టోల్ రిలీఫ్ అనేది అటల్ సేతు వద్ద ఆగదు. ఈవీ పాలసీ 2025లో భాగంగా మినహాయింపులు, రాయితీలు ప్రధాన రహదారులకు కూడా విస్తరించనుంది. సమృద్ధి ఎక్స్‌ప్రెస్‌వే, ముంబై-పుణే ఎక్స్‌ప్రెస్‌వేలో ఎలక్ట్రిక్ వాహనాలకు త్వరలో ఇలాంటి ప్రయోజనాలు పొందవచ్చు. అదనంగా, మహారాష్ట్ర అంతటా ఈవీ వాహనదారులు రాష్ట్ర, జాతీయ రహదారులపై టోల్ ఛార్జీలలో 50శాతం మాత్రమే చెల్లిస్తారు.