Oppo F29 5G Series
Oppo F29 5G Series : కొత్త స్మార్ట్‌ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీదారు ఒప్పో ఇటీవలే భారత మార్కెట్లో ఒప్పో F29 5G సిరీస్‌ను ప్రవేశపెట్టింది. మీరు సరసమైన స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తుంటే ఇదే సరైన సమయం. ఈ ఒప్పో ఫోన్లు మీకు అద్భుతమైన ఆప్షన్.
ఈ ఒప్పో స్మార్ట్‌ఫోన్ల ఫస్ట్ సేల్ భారత మార్కెట్లో ప్రారంభమైంది. ఈ సేల్ సమయంలో కంపెనీ కస్టమర్లకు ఆకర్షణీయమైన ఆఫర్‌లను అందిస్తోంది. ఒప్పో F29 5G సిరీస్‌లో కంపెనీ రెండు మోడళ్లను ఆవిష్కరించింది. అందులో ఒప్పో F29 5G, ఒప్పో F29 ప్రో 5G ఉన్నాయి. ఒప్పో F29 5G సేల్ మార్చి 27న ఫ్లిప్‌కార్ట్‌లో ప్రారంభమైంది. మీకు ఒప్పో 5జీ ఫోన్ కొనేందుకు ఆసక్తి ఉంటే అతి తక్కువ ధరకు ఇప్పుడే ఆర్డర్ పెట్టేసుకోండి.
ఒప్పో F29 5Gపై డిస్కౌంట్ :
ఒప్పో F29 5G ఫోన్ సాలిడ్ పర్పుల్, గ్లేసియర్ బ్లూ అనే రెండు ఆకర్షణీయమైన కలర్ వేరియంట్లలో అందుబాటులో ఉంది. 8GB RAM, 128GB స్టోరేజ్ ఉన్న మోడల్ ధర రూ. 23,999కు ఆఫర్ చేస్తోంది. మీరు 256GB స్టోరేజ్ ఉన్న హై-ఎండ్ వేరియంట్‌ను ఎంచుకుంటే.. ఈ ఒప్పో ఫోన్ ధర రూ. 25,999కు సొంతం చేసుకోవచ్చు.
మీరు HDFC, Axis లేదా SBI బ్యాంక్ కార్డులను ఉపయోగించి కొనుగోలు చేస్తే.. మీరు 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు. ఈ బ్యాంక్ ఆఫర్‌తో పాటు కస్టమర్‌లు రూ. 2వేల వరకు సేవ్ చేసుకోవచ్చు. ఇందులో ఎక్స్ఛేంజ్ ఆప్షన్ కూడా పొందవచ్చు. ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్‌తో ఫైనల్ డిస్కౌంట్ ధర రూ.11,160 వరకు తగ్గింపు పొందవచ్చు.
ఒప్పో F29 5G : రిటైల్ ధర ఎంతంటే? :
పాత ఫోన్ రూ. 9600 ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్.
రూ. 2000 అదనపు ఎక్స్జేంజ్ ఆఫర్
10శాతం (రూ. 1,239) బ్యాంక్ డిస్కౌంట్
ఒప్పో F29 5G స్పెసిఫికేషన్లు :
ఒప్పో F29 5G ఫోన్ 6.7-అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లేను 2412 x 1080 పిక్సెల్ రిజల్యూషన్‌తో కలిగి ఉంది. 8GB వరకు RAMతో వస్తుంది. 128GB, 256GB స్టోరేజీ ఆప్షన్లతో వస్తుంది. బ్యాక్ సైడ్ 50MP ప్రైమరీ కెమెరా ద్వారా ట్రిపుల్ కెమెరా సెటప్ అందిస్తుంది. అయితే, 16MP ఫ్రంట్ కెమెరా సెల్ఫీలు, వీడియో కాల్స్ చేసుకోవచ్చు.
ఒప్పో F29 5G ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆధారంగా రన్ అవుతుంది. ఈ ఫోన్ డస్ట్, వాటర్ నిరోధకతతో IP66/IP68/IP69 రేటింగ్‌ను కలిగి ఉంది. అత్యుత్తమ పర్ఫార్మెన్స్ కోసం స్నాప్‌డ్రాగన్ 6 Gen 1 చిప్‌సెట్ ద్వారా పొందుతుంది. అదనంగా, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు అందించే 6500mAh బ్యాటరీని కలిగి ఉంది.