Oppo K12 Plus Launch : కొత్త ఫోన్ చూశారా? ఒప్పో K12 ప్లస్ ఫోన్ వచ్చేసిందోచ్.. ధర, ఫీచర్లు వివరాలివే..!

Oppo K12 Plus Launch : ఈ స్మార్ట్‌ఫోన్ తయారీదారు ఒప్పో కె12 ప్లస్ ఫోన్ చైనాలో అక్టోబర్ 15న అమ్మకానికి వస్తుందని ప్రకటించింది. అయితే, ప్రీ-ఆర్డర్‌లు ఇప్పుడే ఓపెన్ అయ్యాయి.

Oppo K12 Plus Launch : కొత్త ఫోన్ చూశారా? ఒప్పో K12 ప్లస్ ఫోన్ వచ్చేసిందోచ్.. ధర, ఫీచర్లు వివరాలివే..!

Oppo K12 Plus Launch

Updated On : October 12, 2024 / 7:55 PM IST

Oppo K12 Plus Launch : కొత్త స్మార్ట్‌ఫోన్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? ఒప్పో కె12 ప్లస్ స్మార్ట్‌ఫోన్ తయారీదారు చైనాలో లాంచ్ చేసింది. కంపెనీ లేటెస్ట్ హ్యాండ్‌సెట్ స్నాప్‌డ్రాగన్ 7 జనరేషన్ 3 చిప్‌సెట్‌తో పాటు 12జీబీ వరకు ర్యామ్, 512జీబీ వరకు స్టోరేజీని కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 14పై ఆధారపడిన కలర్ఓఎస్ 14పై రన్ అవుతుంది. 80డబ్ల్యూ ఛార్జింగ్‌కు సపోర్టుతో 6,400mAh బ్యాటరీని అందిస్తుంది. ఒప్పో కె12 ప్లస్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్, 16ఎంపీ సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. దుమ్ము, స్ప్లాష్ నిరోధకతకు ఐపీ54 రేటింగ్‌ను కూడా కలిగి ఉంది.

Read Also : Ajay Jadeja : 15 టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన మాజీ క్రికెటర్.. ఈ రాజ సింహాసనానికి వారసుడు.. జామ్ సాహెబ్‌గా ప్రకటన

ఒప్పో కె12 ప్లస్ ధర ఎంతంటే? :
ఒప్పో కె12 ప్లస్ ఫోన్ 8జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజీతో కూడిన బేస్ మోడల్ ధర సీఎన్‌వై 1,899 (సుమారు రూ. 22,600) నుంచి ప్రారంభమవుతుంది. అదే సమయంలో, 12జీబీ+256జీబీ, 12జీబీ+512జీబీ వేరియంట్‌లు వరుసగా సీఎన్‌‌వై 2,099 (దాదాపు రూ. 25వేలు), సీఎన్‌వై 2,499 (దాదాపు రూ. 29,800)గా ఉన్నాయి. బసాల్ట్ బ్లాక్, స్నో పీక్ వైట్ కలర్ ఆప్షన్లలో విక్రయానికి అందుబాటులో ఉంటుంది.

ఈ స్మార్ట్‌ఫోన్ తయారీదారు ఒప్పో కె12 ప్లస్ ఫోన్ చైనాలో అక్టోబర్ 15న అమ్మకానికి వస్తుందని ప్రకటించింది. అయితే, ప్రీ-ఆర్డర్‌లు ఇప్పుడే ఓపెన్ అయ్యాయి. CNY 100 (దాదాపు రూ. 1,200) రెండు 256జీబీ స్టోరేజ్ వేరియంట్‌ల ధరను తగ్గించనుంది. ఈ ప్రమోషన్‌ను కూడా కస్టమర్‌లు పొందవచ్చు.

ఒప్పో కె12 ప్లస్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
డ్యూయల్-సిమ్ (నానో+నానో) ఒప్పో కె12 ప్లస్ ఆండ్రాయిడ్ 14-ఆధారిత కలర్ఓఎస్ 14 అవుట్-ఆఫ్-ది-బాక్స్‌పై రన్ అవుతుంది. 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7-అంగుళాల ఫుల్-హెచ్‌డీ+ (1,080×2,412 పిక్సెల్‌లు) అమోల్డ్ స్క్రీన్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 7 జనరేషన్ 3 చిప్‌సెట్‌తో ఆధారితంగా పనిచేస్తుంది. 8జీబీ ఎల్‌పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, ఫొటోలు, వీడియో కోసం సోనీ ఐఎమ్ఎక్స్882 సెన్సార్ (ఎఫ్/1.8)తో 50ఎంపీ ప్రైమరీ కెమెరాను ఉపయోగించవచ్చు.

అయితే, ఐఎమ్ఎక్స్355 సెన్సార్ (ఎఫ్/2.2)తో కూడిన 8ఎంపీ అల్ట్రావైడ్ కెమెరా వైడ్ యాంగిల్ షాట్‌లను అందిస్తుంది. ఫ్రంట్ సైడ్ ఎఫ్/2.4 ఎపర్చర్‌తో 16ఎంపీ కెమెరా ఉంది. ఒప్పో కె12ప్లస్ 512జీబీ వరకు ఇంటర్నల్ స్టోరేజీతో వస్తుంది. మైక్రో ఎస్‌డీ కార్డ్ స్లాట్ ద్వారా 1టీబీ వరకు అప్‌గ్రేడ్ చేయవచ్చు. 5జీ, 4జీ ఎల్‌టీఈ, వై-ఫై 6, బ్లూటూత్ 5.3, జీపీఎస్, ఎన్‌ఎఫ్‌సీ కనెక్టివిటీతో పాటు సెన్సార్, యాంబియంట్ లైట్ సెన్సార్, గైరోస్కోప్, యాక్సిలెరోమీటర్, ఇ-కంపాస్‌లకు సపోర్టు అందిస్తుంది.

ఒప్పో కె12 ప్లస్‌లో 6,400mAh బ్యాటరీ కూడా ఉంది. 80డబ్ల్యూ సూపర్‌వూక్ అడాప్టర్ ఉపయోగించి ఛార్జ్ చేయవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్‌లో బయోమెట్రిక్ అథెంటికేషన్ ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, అప్లియన్సెస్ కంట్రోలింగ్ కోసం ఇన్‌ఫ్రారెడ్ (IR) ట్రాన్స్‌మిటర్ ఉన్నాయి. దుమ్ము, స్ప్లాష్ నిరోధకతకు ఐపీ54 రేటింగ్‌ను కలిగి ఉంది. 162.5×75.3×8.37ఎమ్ఎమ్ కొలుస్తుంది. 192గ్రాముల బరువు ఉంటుంది.

Read Also : Best Mobiles 2024 : కొత్త స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా? ఈ నెలలో రూ. 30వేల లోపు ధరలో బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు ఇవే..!